Home Blog Page 24

విజ‌య‌సాయిరెడ్డి TDP ని షేక్ చేస్తున్నారు…ఎలా? – TDP fear by Vijayasai Reddy.. How?

0

విజ‌య సాయి రెడ్డి. రాజ‌కీయాల్లో అంత‌గా సీనియార్టీ లేదు. జ‌గ‌న్ కు వీర విధేయుడు. వైసిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు. కానీ, ఇప్పుడు టిడిపి నేత‌లు జ‌గ‌న్ కంటే ఎక్కువ‌గా కార్న‌ర్ చేస్తున్న నేత‌. వైసిపి లో అంద‌రివాడుగా ఉంటున్న విజ‌య‌సాయ‌రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యు డు అయిన త‌రువాతి నుండి కేంద్ర స్థాయిలో అంద‌రితోనూ మంచి స‌త్సంబంధాలు న‌డ‌ప‌టంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు భాగ‌స్వామిగా ఉన్న టిడిపి కంటే..కేంద్రంలో ఏం జ‌రుగుతుందో ముంద‌స్తు స‌మాచారం ఆయ‌న‌కే వ‌స్తుంద‌ని టిడిపి నేత‌లే అంగీక‌రించే ప‌రిస్థితి.

కేంద్రంలో ప్ర‌ధాని మోదీ నుండి ఏ మంత్రి అయినా..విజ‌య సాయి రెడ్డి అడిగితే అ ప్పాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందే. ఆ స్థాయికి ఆయ‌న త‌న ప‌లుకుబ‌డి పెంచుకున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు సైతం ప్ర‌ధాని మోదీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌ని స్థితిలో జ‌గ‌న్ కు అప్పాయింట్‌మెంట్ ద‌క్కేలా సాయి రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. ఇక ఎన్డీఏ రాష్ట్రప‌తి, గ‌వ‌ర్న‌ర్ ల వంటి నియామ‌కాల విష‌యంలోనూ సాయి రెడ్డికి ముందుగానే స‌మాచారం ఇస్తున్నార‌ని టిడిపి నేత‌లు ఉక్రో షానికి గుర‌యిన సందర్భాలు ఉన్నాయి. విజ‌య సాయి రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన స‌మ‌యంలో..తాజాగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర రెడ్డి ఏక‌గ్రీవం అయ్యే విధంగానూ సాయిరెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. టిడిపి అంచ‌నాల‌ను తిప్పి కొడుతూ జ‌గ‌న్ సూచ‌న ల మేర‌కు టిడిపి పై పై చేయి సాధించారు. ఇక‌..తాజాగా..టిడిపి ని కేంద్రంలో కార్న‌ర్ చేయ‌టంలో విజ‌య సాయిరెడ్డి ప్ర‌ముఖ పాత్ర పోషించార‌ని టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌. ఎప్పుడూ ప్ర‌ధాని పేషీ వద్ద సాయి రెడ్డి ఉంటార‌ని..ఆయ‌న‌కు అక్క‌డ ఏం ప‌ని అన్న‌ది టిడిపి నేత‌ల ప్ర‌శ్న‌. అయితే, త‌మ‌కు ద‌క్క‌ని గౌర‌వం సాయి రెడ్డికి ప్ర‌ధాని ఇస్తున్నార‌నేది టిడిపి నేత‌ల ఆక్రోశానికి ప్ర‌ధాన కార‌ణం.

విజ‌య సాయి రెడ్డి రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా మీద అనేక సంద‌ర్భాల్లో  ప్ర‌స్తావించారు. రాజ్య‌స‌భ‌లో స్టేట్స్‌మెన్‌గా గుర్తింపు పొందారు. అతి త‌క్కువ కాలంలోనే కేంద్ర రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టు సాధించిన విజ‌య సాయి రెడ్డి పై టిడిపి నేత‌లు మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ మాత్ర‌మే టిడిపికి కొర‌క‌రాని కొయ్య‌గా క‌నిపించారు. ఇప్పుడు సాయి రెడ్డి సైతం టిడిపికి ప‌క్క‌లో బ‌ల్లెంగా మా రారు. దీంతో..విజ‌య సాయి రెడ్డి లాంటి స‌త్సంబంధాలు ఉన్న నేత మ‌న‌కు ఢిల్లీలో అవ‌స‌ర‌మ‌ని స్వ‌యంగా టిడిపి ముఖ్య‌నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారంటే వారు సాయి రెడ్డి స‌మ‌ర్ధ‌త‌ను ఏ విధంగా అంచ‌నా వేస్తున్నారో అర్దం అవుతోంది. ఇటువైపు జ‌గ‌న్ మాత్రం విజ‌య సాయి రెడ్డి కి అనేక బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు. సాయి రెడ్డి పార్టీకి చేస్తున్న సేవ ఎలాంటితో పార్టీ నేత‌లే చెబుతుంతారు.

జ‌గ‌న్ రాజ‌కీయం ముందు మోక‌రిల్లిన టిడిపి వ్యూహం -TDP was feared by YS Jagan Technique

0

న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం..వ‌ర్సెస్ ఎనిమిదేళ్ల పార్టీ. ఎత్తుల‌-పై ఎత్తులు. వ్యూహాలు- ప్ర‌తి వ్యూహాలు. ఏపిలో కొంత కాలంగా పూర్తిగా పైచేయి గా క‌నిపించిన టిడిపి రాజ‌కీయాన్ని..అదును చూసి దెబ్బ కొట్టారు వైసిపి అధినేత జ‌గ‌న్‌. ప్ర‌త్యేక హోదాతో సమ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారం కావ‌ని చెప్పిన చంద్ర‌బాబే..జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహంలో చిక్కుకున్నారు. జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం..ఎంపీల రాజీనామా అన‌గానే చంద్ర‌బాబు కు విషయం అర్ద‌మైపోయింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైపోయారు. అప్ప‌టి వ‌ర‌కు బిజెపి – టిడిపి మ‌ధ్య మేము కొట్టిన‌ట్లు న‌టిస్తాం..మీరు ఏడ్చిన‌ట్లు న‌టించ‌డి అనే విధంగా రాజీక‌యం సాగింది. కానీ, జ‌గ‌న్ పెంచిన ఒత్తి డితో టిడిపి త‌లొగ్గ‌క తప్ప‌లేదు.

కేంద్రం నుండి టిడిపి మంత్రుల‌ను విత్ డ్రా చేసారు. కానీ, టిడిపి త‌న అవ‌స‌రాల దృష్ఠ్యా ఎన్డీఏలో కొన‌సాగుతోంది. ఏపిలో త‌న వైఫ‌ల్యాల‌ను బిజెపి మీద‌కు మ‌ళ్లించి రాజ‌కీయంగా ల‌బ్ది పొందే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే స‌మ‌యం లో ఏపిలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి వైసిపికని ఇందులోకి లాగే ప్ర‌యత్నం చేస్తోంది టిడిపి. ఇందులో భాగంగా..ఒక వైపు తాను ఎన్డీఏ లో కొన‌సాగుతూనే..మ‌రో వైపు బిజెపితో జ‌గ‌న్ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌చారం చేస్తోంది.

జ‌గ‌న్ ఏపికి ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తే..వారితో క‌లిసి న‌డుస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. కానీ, టిడిపి మాత్రం తాము ఎన్డీఏ నుండి తొలిగే అంశంపై క్లారిటీ ఇవ్వ‌టం లేదు. కేంద్రం పై పోరాటం అంటూనే కేంద్రంలో అధికారంలో ఉన్న కూట‌మిలో భాగ‌స్వామిగా ఉంది. ఇదే స‌మ‌యంలో .. ఏపి ప్ర‌జ‌లు బిజెపి పై ఆగ్ర‌హంగా ఉండటంతో..బిజెపి తో పాటుగా వైసిపి ని కార్న‌ర్ చేసే ప‌నిలో ప‌డింది టిడిపి. ఈ విష‌యంలో టిడిపి డ‌బుల్ గేమ్ ను వైసిపి నుండి జ‌గ‌న్ మిన‌హా మిగిలిని నేత‌లు పెద్ద‌గా జ‌నంలోకి తీసుకుపోవ‌టం లేదు. ఈ ప్ర‌చారం ద్వారా వైసిపికి మైనార్టీలు..ద‌ళితుల‌ను దూరం చేయ‌టం..రాజ‌కీయంగా ఏపిలో ప్ర‌యోజ‌నం పొంద‌టం టిడిపి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. కానీ, జ‌గ‌న్ మాత్రం ధీమాగా క‌నిపిస్తున్నారు. తాము ప్ర‌త్యేక హోదా కోసం అవిశ్వాసం ప్ర‌తిపాదించే స‌మ‌యంలో టిడిపి మ‌ద్ద‌తు ఇవ్వ‌క పోయినా.. త‌మ ఎంపీలు రాజీనామా చేసే స‌మ‌యంలో క‌లిసి రాక‌పోయినా..టిడిపి ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల దృష్టిలో డామేజ్ అవుతుంద ని వైసిపి అధినేత అంచ‌నా వేస్తున్నారు. ఇదే విష‌యంలో వైసిపి అమ‌లు చేసే నిర్ణ‌యాలు బిజెపికి మేలు చేసేవిగా టిడిపి ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, ఇటు టిడిపి..అటు వైసిపి వేస్తున్న ఎత్తుగ‌డ‌లను బిజెపి సైతం నిశితంగా ప‌రిశీలిస్తోంది. కేంద్ర స్థాయిలో వైసిపి ఎంత చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించినా…టిడిపి చేస్తున్న విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌క‌పోతే..అది రానున్న రోజుల్లో వైసికి న‌ష్టం క‌లిగిస్తోంది. ఇ ప్ప‌టి వ‌ర‌కు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైసిపి..రానున్న రోజుల్లో టిడిపిని కార్న‌ర్ చేస్తూ ఎటువంటి కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తుందో చూడాలి.

రాటు తేలిన జ‌గ‌న్ రాజ‌కీయం – YS Jagan Is Fully experienced Person in AP Politics

0

జ‌గ‌న్ రాజ‌కీయల్లో రాటు తేలుతున్నాడు. న‌ల‌భై ఏళ్ల అనుభ‌నానికే టెన్ష‌న్ పుట్టిస్తున్నాడు. తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో జగ‌న్ అనుస‌రించిన వ్యూహం టిడిపిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి ప‌డేసింది. ఎన్నిక లేకుండానే రాజ్య‌స‌భ ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసిం ది. ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఏపిలో ఖాళీ అయిన మూడు రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి వైసిపి కి..రెండు టిడిపికి ద‌క్కాలి. అయితే, వైసిపి నుండి 23 మంది ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌పెట్టి త‌మ పార్టీలోకి చేర్చుకున్న టిడిపి నేత‌లు వైసిపికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌కుండా చేయాల‌ని తొలి నుండి భావించారు. వైసిపికి ఇక రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌టం క‌ష్ట‌మే అని అంద‌రూ భావించారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో..జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వైసిపి నుండి అన్ని ర‌కాలుగా స‌మ‌ర్ధ‌త ఉన్న వేమిరెడ్డి ప్ర‌భాక‌ర‌రెడ్డిని అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిపారు.

ప్ర‌భాక‌ర రెడ్డి సైతం జ‌గ‌న్ సూచ‌న‌ల‌తో జిల్లాల వారీగా అభ్య‌ర్దుల‌తో స‌మావేశం అయ్యారు. ఇక‌, ఒక ఉత్త‌రాంధ్ర మంత్రి ఏకంగా వైసిపి ఎమ్మె ల్యేల‌కు ఫోన్ చేసి ప్ర‌లోభాల‌కు ప్ర‌య‌త్నించిన ఆడియో త‌మ చేతుల్లో ఉందంటూ వైసిపి ఎంపి విజ‌య సాయి రెడ్డి లీక్ ఇచ్చారు. ఇక‌, బిజెపి నాలుగు ఓట్ల మ‌ద్ద‌తు టిడిపికి క‌ష్టంగా మారింది. వైసిపి ఖాళీ అవుతుంది..ఎమ్మెల్యేలంతా త‌మ‌తోనే ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడిన టిడిపికి..వైసిపి సైతం అదే స్థాయిలో మైండ్ గేమ్‌తో స‌మాధానం చెప్పింది. వైసిపి నుం డి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల్లో అనేక మంది అసంతృప్తితో ఉన్నార‌ని వారు వైసిపి నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం తెర మీద‌కు తీసుకొచ్చారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వారు వేమిరెడ్డికి మ‌ద్ద‌తిచ్చేందుకు సిద్దంగా ఉన్నార‌ని వైసిపి నేత‌లు జోరుగా ప్ర‌చారం చేసారు. దీంతో, ఓటుకు నోటు వ్య‌వ‌హారం కార‌ణంగా ఇప్ప‌టికీ ఇబ్బందులు ప‌డుతున్న టిడిపి అధినాయ‌క‌త్వం..ప్ర‌స్తుతం వైసిపి వ్యూహాల‌కు బెండ్ కాక త‌ప్ప‌లేదు. అంతే..మూడు స్థానాలు త‌మ‌వే అంటూ ప్ర‌చారం చేసుకున్న టిడిపి అధినాయ‌క‌త్వం ఒక్క‌సారిగా వెన‌క్కు త‌గ్గింది. త‌మ‌కు ద‌క్కాల్సిన రెండు స్థానాల‌కే అభ్య‌ర్ధులను ఖ‌రారు చేసి మిన్ని కుండిపోయింది. దీంతో..వైసిపి కి అస‌లు ద‌క్కుతుందా లేదా అనే సందేహ‌ల న‌డుమ‌..రాజ్య‌స‌భ‌లోకి వైసిపి ఎంపిగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర రెడ్డి నేరుగా ప్ర‌వేశిస్తున్నారు. న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ముందు జ‌గ‌న్ ఎంత అనుకున్న టిడిపి నేత‌ల‌కు..జ‌గ‌న్ రాజ‌కీయాల్లో ఎంత‌గా రాటు తేలారో స్ప‌ష్ట‌మైంది

వైసిపి సీరియ‌స్ డెసిష‌న్. టిడిపి ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టే నిర్ణ‌యం – YCP Take Serious Decision About TDP

0

వైసిపి సీరియ‌స్ డెసిష‌న్. టిడిపి ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టే నిర్ణ‌యం. ప్ర‌త్యేక హోదా పై పోరుకు జోష్ తేవాల‌ని నిర్ణయించిన వైసిపి అధినేత‌. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా రాజీనామా చేసిన ఎంపీల కొత్త వ్యూహం. తొలి నుండి ప్ర‌త్యేక హోదా కోసమ‌ని ముందుండి పోరాడుతున్న వైసిపి మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే త‌మ ప‌దవుల‌కు రాజీనామా చేసి..ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష చేసిన ఎంపీల పోరాటానికి విలువ పెంచేలా ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యించింది. దీని కోసం రాజీనామాల ఆ మోదానికి స్పీక‌ర్ పై ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్ప‌టికే స్పీక‌ర్ ఫార్మాట్ లో వైసిపి కి చెందిన అయిదుగురి ఎంపీల రాజీనామాలు స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని స‌త్వరం ఆమోదించి… ఎన్ని క‌ల సంఘానికి నివేదించేం దుకు స్పీక‌ర్ ను క‌లిసి ఒత్తిడి తేవాల‌ని వైసిపి అధినాయ‌క‌త్వం ఆదేశించింది. ఎంపీల రాజీనామాలు..వారు చేసిన ఆమ‌ర ణ దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తు రాకుండా చూసేందుకు టిడిపి నేత‌ల‌తో పాటుగా మ‌ద్ద‌తు మీడియా అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. డిల్లీ వేదిక‌గా చేసిన ఆమ‌ర‌ణ దీక్ష‌ల‌ను పోలీసులు భ‌గ్నం చేసారు. ఇక‌, టిడిపి సైతం ప్ర‌త్యేక హోదా పై యూ ట‌ర్న్ తీసు కుంది. ప్ర‌త్యేక హోదా కోస‌మ‌ని చెబుతూ తిరుప‌తిలో స‌భ ఏర్పాటు చేసింది. ఈ నెలాఖ‌రులోగా విశాఖ‌లో మరో స‌భ ఏ ర్పాటుకు నిర్ణ‌యిచింది. దీంతో…వైసిపి అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలోనే..ఏపి ప్ర‌భుత్వం పై ఒత్తిడి తె చ్చేలా ద్విముఖ వ్యూహానికి పావులు క‌దుపుతున్నారు. ఒక వైపు కర్నాట‌క ఎన్నిక‌ల తరువాత త‌మ పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారిస్తుంద‌ని..అవినీతి జ‌రిగిన అంశాల పై చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని టిడిపి నేత‌లే అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అంగీక‌రి స్తున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ప‌ట్టు బ‌ట్టి మ‌రీ ఓటు కు నోటు కేసు పై వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తు న్నారు. అంత‌టితో ఆగ‌కుండా ఆప‌ధ్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు హ‌యాంలో తీసుకున్న వివాదాస్ప‌ద భూ కేటాయిం పుల పైనా పున‌ర్విచార‌ణ జ‌రిపేలా కొత్త క‌మిష‌న్ ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. దీంతో…టిడిపి పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ లో ప‌డిన స‌మ‌యంలో..మ‌రింత ఒత్తిడి పెంచేలా క్షేత్ర స్థాయిలో ప్ర‌త్యేక హోదా కోసం పోరాటాలు చేయాల‌ని ప్రాధ‌మికం గా నిర్ణ‌యించారు. దీనికి తోడు..ఎంపీల ద్వారా ఒత్తిడి పెంచి స్పీక‌ర్ రాజీనామాల‌ను ఆమోదించేలా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. స్పీక‌ర్ రాజీనామాలు వెంట‌నే ఆమోదిస్తే..ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు. ఆల‌స్యం చేస్తే.. సాధార‌ణ ఎన్నిక‌లను సాకుగా చూపించి ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌ల‌కు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వైసిపి అంచ‌నా వేస్తోంది.

సాధార‌ణ ఎన్నిక‌ల ముందే టిడిపిని పూర్తి ఢిఫెన్స్‌లో ప‌డేయ‌టంతో పాటుగా అయిదు లోక్‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు వస్తే..టిడిపి పోటీ చేసినా..చేయ‌కున్నా..ఆ పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని వైసిపి లెక్క‌లు వేస్తోంది. దీంతో..రాజీనామాల ఆమోదం కోసం ఒక ఢిల్లీలోనే మ‌కాం వేయాల‌ని వైసిపి నిర్ణ‌యించింది.

జ‌గ‌న్ దే అప్ప‌ర్ హ్యాండ్ – YS Jagan is a High Level Political Leader In Andrapradesh

0

వైసిపి అధినేత జ‌గ‌న్…ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద పై చేయి సాధించారా. జ‌గ‌న్ ఒత్తిడి చంద్ర‌బాబు పై ప‌ని చేసిందా. కేంద్రం నుండి టిడిపి మంత్రుల ఉప సంహ‌ర‌ణ నిర్ణ‌యం వెనుక ప్ర‌ధానం కార‌ణం ఏంటి. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ గ‌తంలో చేసిన ప్ర‌క‌ట న‌నే మ‌రోసారి చేసారు. కానీ, టిడిపి గ‌తంలో అభినందించిన ప్ర‌క‌ట‌న‌నే ఇప్పుడు అభిశంసించింది. ఒక‌వైపు ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్ ఇప్ప‌టికే కేంద్రం పై అవిశ్వాసం కోసం ముహూర్తం కూడా ప్ర‌క‌టించారు. దీంతో ఆగ‌కుండా..పార్ల‌మెంట్ స‌మావేశాల చివ‌రి రోజున వైసిపి ఎంపీల రాజీనామాలు చేస్తార‌ని ప్ర‌క‌టించారు. దీంతో..టిడిపి పై ఒత్తిడి పెరిగింది. ప్ర‌జ‌లు సైతం వైసిపి తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నార‌ని గుర్తించారు. ప్ర‌త్యేక హోదా పై ఇప్ప‌టి వ‌ర‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన టిడిపి..ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకున్నారు. తీసుకున్నారు అనే దాని కంటే..తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏదైతే చెబుతూ వ‌చ్చారో అదే ఇప్పుడు చంద్ర‌బాబు చెబుతున్నారు.

ప్ర‌తిప‌క్షం తీసుకుంటున్న నిర్ణ‌యాలతో…ప్ర‌జ‌ల్లో ఇమేజ్ పెరుగుతోంది. ప‌రోక్షంగా టిడిపి పై ఒత్తిడి పెరిగింది. కేంద్ర ప్ర‌భుత్వం నుండి మంత్రులు ఉప సంహ‌రించుకొనే నిర్ణ‌యం తీసుకుంది. బిజెపితో తెగ‌దెంపుల‌కు నిజంగా చంద్ర‌బాబు సిద్ద మై ఉంటే..ఏకంగా ఎన్డీఏ నుండే బ‌య‌ట‌కు వ‌చ్చేసేవారు. కానీ, ప‌రిస్థితి అది కాదు. వైసిపి ఒత్తిడి బాగా ప‌ని చేసింది. కేంద్రం తో క‌య్యానికి టిడిపి కి ధైర్యం చాల‌ట్లేదు. ప‌దేప‌దే చంద్ర‌బాబు కార‌ణంగానే ఏపికి ప్ర‌త్యేక హోదా రాలేద‌ని జ‌గ‌న్ ఏదైతే చెబుతూ వ‌చ్చారో..ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆర్దిక మంత్రి ఆరుణ్ జైట్లీ సైతం ఏపి ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌రువాత‌నే ప్ర‌త్యేక ప్యాకేజిని ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. ఇప్పుడు అదే..టిడిపికి డామేజ్ చేసే వ్యాఖ్య‌ల‌ని టిడిపి అధినాయ‌క‌త్వం గుర్తించింది. జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా టిడిపి ఆల‌స్యంగా నిర్ణ‌యం తీసుకున్నా..ఖ‌చ్చితంగా ఇది ప్ర‌జ‌ల విక్ట‌రీగానే భావించాల్సి ఉంటుంది. త‌న‌కు ఎదురులేద‌ని భావించే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌లొగ్గేలా చేయ‌టంలో జ‌గ‌న్ వ్యూహం స‌క్సెస్ అయింద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జ‌గ‌న్ ఆన్ ఫైర్‌…ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో టిడిపి – YS Jagan Masater Plan …TDP in self defense

0

వైసిపి అధినేత జ‌గ‌న్ మ‌రోసారి టిడిపిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసారు. ఇప్ప‌టికే వ్యూహాత్మ‌క ఒత్తిడితో కేంద్రం నుండి టిడిపి ఎంపీల‌ను ఉప‌సంహ‌రించుకొనేలా చేసిన జ‌గ‌న్‌..ఇప్పుడు ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం కొత్త ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. తొలి నుండి ప్ర‌త్యేక హోదా కో సం పోరాడుతున్న వైసిపి..ఇప్పుడు ఏపిలో రాజ‌కీయంగాపై చేయి సాధించింది. టిడిపి కేంద్రం నుండి మంత్రుల‌ను ఉప‌సంహ‌రించు కున్నా..ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు రాలేదు. ఇదే స‌మ‌యంలో  జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. కేంద్రం పై ఈనెల 21న అవిశ్వాసం పెట్టేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌..ఇప్పుడు టిడిపి సిద్ద‌మ‌ని చెబితే..వెంట‌నే అవిశ్వాసం పెట్టేందుకు సిద్ద‌మ‌నే వి ష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. వైసిపి ప్ర‌తిపాదించే అవిశ్వాసానికి మద్ద‌తు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రికి సూచించారు. ఒక‌వేళ‌..టిడిపి యే అవిశ్వాసం ప్ర‌తిపాదిస్తే..అందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి తాను సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. దీని ద్వారా..తాను ఏపి ప్ర‌యెజ‌నాల కోస‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నానే సంకేతాలిస్తూ..టిడిపిని రాజ‌కీయంగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టేసారు.

టిడిపి ఇంకా ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు రాక‌పోవ టంతో..టిడిపి ఇప్పుడు జ‌గ‌న్ ఆఫ‌ర్  కు సానుకూలంగా స్పందించే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. కానీ, జ‌గ‌న్ చేసిన ఆఫ‌ర్ పై ప్ర‌జ ల్లో మాత్రం సానుకూల స్పంద‌న క‌నిపిస్తోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా త‌న‌కు సంబంధం లేద‌ని..ఎవ‌రై తే ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తూ సంత‌కం చేస్తారో వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇందుకోసం ఏపి ప్ర‌జ‌లు ఎవ‌రినీ న‌మ్మ‌వ‌ద్ద‌ని..మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో వైసిపి అభ్య‌ర్ధుల‌నే గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్ధించారు. ఇలా..కొద్ది రోజులుగా ఏపికి ప్ర‌త్యేక హోదా అంశంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు..కేంద్రం పైనా..టిడిపి పైనా ఒత్తిడి పెంచ‌టమే కాకుండా.. ప్ర‌జ‌ల్లో వైసిపి ఇమేజ్ పెరిగేలా ఉంటున్నాయి. అయితే, రానున్న నాలుగైదు రోజుల్లో రాజ‌కీయంగా స‌మీక‌ర‌ణాలు మ‌రింత వేడి పుట్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ అడుగుల్లో 40 ఏళ్ల అనుభ‌వం – TDP Leader Chnadrababu Fallows YS Jagan

0

40 ఏళ్ల అనుభ‌వానికి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు. ప్ర‌తిప‌క్ష నేత బాట‌లో ముఖ్య‌మంత్రి. హోదా వ‌ద్దు ప్యాకేజి ముద్దు అంటూ ఊద‌ర గొట్టిన ముఖ్య‌మంత్రి..త‌న వాద‌నే వినిపించేలా చేయ‌టంలొ విప‌క్ష నేత జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. తొలి నుండి ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ పోరాటం చేస్తున్నారు. దీక్ష‌లు చేసారు. యువ‌భేరీలు నిర్వ‌హించారు. కానీ, అధికార‌ప‌క్షం మాత్రం హోదాతో ప్ర‌త్యేకంగా వచ్చే లాభాలు ఏమున్నాయో చెప్పాల‌ని..హోదా పేరుతో యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని వాదించింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. జ‌గ‌న్ ర‌చించిన వ్యూహం స‌క్సెస్ అయింది. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ క‌ళ్యాన్ తో స‌హా అనేక సంఘాలు స‌పోర్టింగ్ వాయిస్ వినిపిస్తున్నాయి. ఇక‌,నిన్నటి దాకా ప్యాకేజి అంటూ దాట‌వేసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించిన టిడిపి నేత‌లు సైతం జ‌గ‌న్ బాట ప‌ట్టారు.

ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్‌గా మార‌టం..దీనికి వైసిపి అధినేత నాయ‌క‌త్వం వ‌హించ‌టంతో..టిడిపిలో క‌ల‌క‌లం మొద‌లైం ది. ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం..పార్ల‌మెంట్‌లో నిర‌స‌న‌లు..కేంద్రం పై అవిశ్వాస తీర్మానం..చివ‌ర‌గా ఎంపీల రాజీనామా ద్వారా..ప్ర‌జ‌ల్లో వైసిపి ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోవ‌టంతో..టిడిపి దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది. క్ర‌మ‌క్ర‌మంగా జ‌గ‌న్ వాయిస్ నే వినిపిస్తూ…ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ఫాలో అవుతున్నారు. వైసిపి కి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పెరుగుతున్న అంశాన్ని గ‌మ‌నించిన టిడిపి అప్ర‌మ‌త్త‌మైంది. బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌లో సైతం ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించారు. వైసిపి ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్న వేళ‌..టిడిపి పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో ప‌డిపోయింది. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టా నికి టిడిపి నేత‌లు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ నే ఫాలో అవుతున్నారు టిడిపి నేత‌లు

ఢిల్లీలో జ‌గ‌న్ వైబ్రేష‌న్స్ – YS Jagan Shakes Delhi

0

ఢిల్లీ వీధుల్లో ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను హోరెత్తించిన వైసిపి. ఢిల్లీ పెద్ద‌ల‌ను ఎదిరించ‌టం కొత్త కాని జ‌గ‌న్‌..మ‌రోసారి ఏపికి ప్ర‌త్యే క హోదా కోసం హ‌స్తిన వీధుల్లో క‌ధం తొక్కారు. ఏపిలో కాదు..ఢిల్లీ వీధుల్లో ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాలంటూ టిడిపి తో పాటుగా అనేక మంది జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసారు. ఏ నిర్ణ‌యం తీసుకున్నా..వెనుక‌డుగు వేయ‌టం అల‌వాటు లేని జ‌గ‌న్ ఈ సారి కూడా పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్ట‌మైన దిశా నిర్ధేశం చేసారు. దీనికి అనుగుణంగా..ఢిల్లీ వీధుల్లో ఏపి ప్ర‌జ‌ల బ‌ల‌మైన వాయిస్ గా నిలిచిన ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను వినిపించారు.

ప్యాకేజి వ‌ద్దు..హోదా ఏపి ప్ర‌జ‌ల హ‌క్కు అంటూ నినాదాల చేసారు. వైసిపి నేత‌లు పెద్ద ఎత్తున పాల్గొని హోదాకు మ‌ద్ద‌తుగా నినాదాలు చేసారు. పార్టీ నేత‌లు శాంతి యుతంగా నిర‌స‌న‌లు చేసిన నేత‌లను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసారు. వైసిపి ఎంపీల‌ను అరెస్ట్ చేసే స‌మ‌యంలో వైసిపి కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. కేవ‌లం పార్ల‌మెంట్లో ప్ల‌కార్డులు ప‌ట్టుక‌ని నినాదాల‌కే ప‌రిమిత‌మైన టిడిపి నేత‌లు వైసిపి నేత‌ల పోరాటం చూసి విస్తుపోయారు. టిడిపి నేత‌ల నాట‌కీయ నిర‌స‌న‌లు తేలిపోయాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు వ‌ర‌కు క‌ద‌లి వ‌చ్చిన వైసిపి నేత‌లు మహా ధ‌ర్నా నిర్వ‌హించి త‌మ చిత్త‌శుద్దితో ఏ విధంగా పోరాడుతుందీ నిరూపించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభ రోజునే వ్యూహాత్మ‌కంగా వామ‌ప‌క్ష నేత‌ల‌తో స‌హా వైసిపి నేత‌లు చేసిన ధ‌ర్నా కేంద్రం దృష్టిని సైతం ఆక‌ర్షించింది. వైసిపి ఢిల్లీ న‌డి వీధుల్లో హోరెత్తించిన ప్ర‌త్యేక హోదా నినాదంతో టిడిపి పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. ఇక‌, అవిశ్వాస తీర్మానం…రాజీనామాల విష‌యంలోనూ వైసిపి నేత‌లు ఇదే దూకుడుతో ముందుకు వెళ్ల‌నున్నారు

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌తో వైసిపి ఆట మొద‌లెడుతుందా – YCP Will play the Key Role with Rajya Sabha elections?

0

వైసిపి కి రాజ్య‌స‌భ సీటు ద‌క్కుతుందా. టిడిపి ఎత్తుగ‌డ‌ల‌ను వైసిపి తిప్పికొడుతుందా. టిడిపి అభ్య‌ర్ధుల‌కు బిజెపి మ‌ద్దతు ఇస్తుందా. ఇప్పుడు ఇదే ఏపి పాలిటిక్స్‌లో హాట్ చ‌ర్చ‌. ఇప్ప‌టికే ఏపి నుండి మూడు రాజ్య‌స‌భ సీట్ల కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వైసిపి త‌మ అభ్య‌ర్ధిగా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్ర‌భాక‌ర‌రెడ్డిని ప్ర‌క‌టించింది. టిడిపి మాత్రం త‌మ అభ్య‌ర్ధుల‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న సంఖ్య‌బ‌లం మేర టిడిపి కి ఇద్ద‌రు..వైసిపి కి ఒక్క‌రు రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ద‌క్కాల్సి ఉంది. కానీ, టిడిపి మూడు స్థానాలు త‌మ ఖాతాలో వేసుకొనే విధంగా పావులు క‌దుపుతోంది. ఒక్కో అభ్య‌ర్ధిని గెల‌వాలంటే 44 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కావాల్సి ఉంది. సంఖ్య ప‌రంగా చూసుకుంటే టిడిపికి 102 మంది స‌భ్యుల‌తో పాటుగా ఇప్ప‌టికే టిడిపిలో విలీనం అయిన ఇద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్ధుల మ‌ద్ద‌తు ఉంది. ఇక‌, ప్ర‌స్తుతం న‌డుస్తున్న రాజ‌కీయంతో బిజెపికి చెందిన న‌లుగురు టిడిపి అభ్య‌ర్ధికి మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహగా మారింది. వైసిపి నుండి టిడిపి లోకి ఫిరాయించిన వారి సంఖ్య 23గా ఉంది. బిజెపి స‌భ్యు ల‌ను మిన‌హాయిస్తే..టిడిపి బ‌లం 127 గా ఉంది. బిజెపి మ‌ద్ద‌తు ఇస్తే అది 131కి పెరుగుతంది.

మూడు రాజ్య‌స‌భ సీట్లు గెల‌వాలం టే టిడిపికి మ‌రో ఎమ్మెల్యే మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఇక‌, వైసిపి విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం వైసిపి వ‌ద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 44. ఇది స‌రిగ్గా ఒక రాజ్య‌స‌భ అభ్య‌ర్ధిని గెలిపించుకోవ‌టానికి సరిపోతుంది. అయితే త‌మ‌తో ఇద్ద‌రు వైసిపి ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంఓల‌..వైసిపి నుండి టిడిపి లో చేరిన కొంద‌రు ఎమ్మెల్యేలు వైసిపి తో ట‌చ్‌లోకి వ‌చ్చిన ట్లు స‌మాచారం. జిల్లాల వారీగా త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఎమ్మెల్యేల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. వైసిపికి చెందిన ఎమ్మెల్యేలను ప్ర‌లోభ‌పెట్టే ప‌నుల‌ను ఇంకా టిడిపి కొన‌సాగిస్తోంది. కానీ, వైసిపి నుండి ఎవ‌రూ వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. వైసిపి అంచ‌నా వేస్తున్న‌ట్లుగా టిడిపి శిబిరం నుండి వైసిపికి పోలింగ్ స‌మ‌యంలో మ‌ద్ద‌తు ల‌భిస్తే..అది ఖ‌చ్చితంగా టిడిపికి కోలుకోలేని షాక్ గా మారుతుంది. కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే తో ఇప్పుడు రాజ్య‌స‌భ అభ్య‌ర్ధుల జ‌యాప‌జ‌యాలు తారుమారు అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వైసిపి నేత‌లు మాత్రం ఖ‌చ్చితంగా తాము త‌మ‌కు ద‌క్కాల్సిన రాజ్య‌స‌భ సీటును ద‌క్కించుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇందు కోసం ఈనెల‌7వ తేదీన వైసిపి అభ్య‌ర్ధి నామినేష‌న్ కు ముమూర్తం ఖ‌రారైంది. మ‌రి..టిడిపి ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్న వైసిపి..కొత్త వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. మ‌రి..ఎవ‌రి వ్యూహాలు ఫ‌లిస్తాయో చూడాల్సిందే..