Home Blog Page 26

మంత్రి అఖిల ప్రియ పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు – TDP Ministers attend Bhuma Akhila Priya Marriage at Kurnool

0
మంత్రి అఖిల ప్రియ పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. మంత్రి అఖిల‌ప్రియ ప్రేమించిన భార్గ‌వ్ తో ఆగ‌స్టు 29న వివాహం జ‌ర‌గనుంది. హైద‌రాబాద్‌లోని అఖిల నివాసంలో స్నేహితులు, బంధుమిత్ర‌ల స‌మ‌క్షంలో అఖిల‌, భార్గ‌వ్ల వివాహ నిశ్చితార్దం జ‌రిగింది. వ‌రుడు బార్గ‌వ్ మాజీ డిసిజి సాంబ‌శివ‌రావు అల్లుడుగా తెలుస్తోంది. మంత్రి నారాయ‌ణ పెద్ద‌ల్లుడు సోద‌రుడైన భార్గ‌వ్ను అఖిల తో వివాహ జ‌ర‌ప‌టానికి పెద్ద‌లు నిర్ణ‌యించారు.
ఎంగేజ్‌మెంట్‌లో రెండు కుటుంబాల పెద్ద‌లు పాల్గొన్నారు. అఖిల త‌ల్లి తండ్రుల ఫొటో ముందు ఇద్ద‌రు దండ‌లు మార్చుకొన్నారు. సోద‌రుడు జ‌గ‌ద్విఖ్యాత్ రెడ్డి, సోద‌రి మౌనిక ఎంగేజ్ మెంట్‌లో అఖిల ప‌క్క‌నే ఉన్నారు. అఖిల త‌ల్లి తండ్రులు ఉన్న స‌మ‌యంలోనే వైయ‌స్ బంధువుల కుటుంబం తో సంబంధం ఏర్ప‌డింది. అయితే, ఆ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా విడిపోయారు. ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్న అఖిల వివాహాం చేసుకోబోతున్నారు. దీంతతో మంత్రులు నారాయ‌ణ‌, గంటా మ‌ధ్య ఇప్ప‌టికే వియ్యం ఉంది. కాగా, తాజాగా అఖిల వివాహంతో ఈ ఇద్ద‌రు మంత్రుల‌కు సైతం బంధుత్వం ఏర్ప‌డ‌నుంది. ఆగ‌స్టు 29న వివాహం కోసం ఇప్ప‌టి కే నిర్ణ‌యం జ‌రిగింది.

క‌ర్నాట‌క‌లో బిజెపి గెలిస్తే టిడిపి కి న‌ష్ట‌మేంటి – Sabbam Hari Predicts BJP win In Karnataka

0
క‌ర్నాట‌క‌లో బిజెపి గెలిస్తే టిడిపి కి న‌ష్ట‌మేంటి. క‌ర్నాట‌క‌లో గెలిచేదెవ‌రు. ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో జ‌రుగుతున్న పోలింగ్ పైఎవ‌రి అంచ‌నాలు వారికి ఉన్నాయి. అయితే, 2014 ఎన్నిక‌ల పోలింగ్ ముందు రోజు టిడిపికి అనుకూలంగా మాట్లాడి విశాఖలో వైసిపికి న‌ష్టం చేసిన స‌బ్బంహ‌రి ఇప్పుడు, క‌ర్నాట‌క ఎన్నిక‌లపై జోస్యం చెప్పారు. క‌ర్నాట‌క‌లో బిజెపి వైపే అక్క‌డి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌ని తేల్చి చెప్పారు. అదే స‌మ‌యంలో క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో బీజేపి గెలిచిన త‌రువాత ఏపి లో రాజ‌కీయాల్లో మార్పులు ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు. గుజ‌రాత్‌లో బిజెపి విజ‌యం త‌రువాత ఏపీలో చాలా మార్పులు జ‌రిగాయ‌ని గుర్తు చేసారు. ఏపిలో ప్ర‌స్తుతానికి టిడిపి బ‌లంగా ఉంద‌ని, ఆపార్టీ పై త‌న విశ్వాసాన్ని చాటుకుంటూనే ఎన్నిక‌ల్లోపు ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని టిడిపికి జ‌రిగే న‌ష్టంపై ప‌రోక్షంగా అంచ‌నాకు వ‌చ్చారు.
వ‌చ్చే, ఎన్నిక‌ల వ‌ర‌కు చంద్ర‌బాబు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. 2019 ఎన్నిక‌ల్లో గెలిచేందుకు బిజెపి ఏదైనా చేయ‌చ్చ‌ని స‌బ్బంహ‌రి అంచనా వేస్తున్నారు. గ‌తంలో వైసిపిలో ఉంటూ, పార్టీకి ద్రోహం చేసిన స‌బ్బంహ‌రి గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌లో వైయ‌స్ విజ‌య‌మ్మను ఓడించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసారు. పోలింగ్ ముందు రోజు టిడిపికి అనుకూలంగా మాట్లాడారు. అప్ప‌టి నుండి టిడిపి లో అధికారికంగా చేర‌న‌ప్ప‌టికీ ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం స‌బ్బంహ‌రి  టిడిపిలో అధికారికంగా టిడిపిలో చేర‌టానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇక‌, క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో బిజెపి గెల‌వ‌కుండా చూసేందుకు టిడిపి, మ‌ద్ద‌తు దారులు అనేక ప్ర‌య‌త్నాలు చేసారు. అయితే, కొద్ది రోజుల‌క క్రితం టిడిపి మ‌ద్ద‌తు మీడియా సైతం క‌ర్నాట‌క‌లో బిజెపికే అవ‌కాశం అంటూ క‌ధ‌నాలు ఇచ్చింది.
ఇప్పుడు స‌బ్బంహ‌రి లాంటి వారు సైతం బిజెపికే గెలుపు ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. క‌ర్నాట‌కలో బిజెపి గెలిస్తే ఆ త‌రువాత ఏపి పై బిజెపి అధినేత‌లు దృష్టి సారిస్తార‌ని, ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని టిడిపి విస్తృత స్థాయి స‌మావేశంలోనూ చ‌ర్చ జ‌రిగింది. పార్టీ నేత‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పార్టీ అధినేత హెచ్చ‌రించారు. ఈ ప‌రిస్థితుల్లో క‌ర్నాట‌క‌లో బిజెపి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌ని టిడిపికి అండ‌గా నిలిచే స‌బ్బం హ‌రి లాంటి వారు చెబుతుంటే..టిడిపి నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంని చెప్ప‌టం కూడా టిడిపి నేత‌ల‌కు మింగుడు ప‌డ‌ట‌టం లేదు. ఇప్పుడు స‌బ్బంహ‌రి వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రి, క‌ర్నాట‌కలో వాస్త‌వం ఏంటో తేలాలంటే.15వ తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఆ త‌రువాత ఇక ఏపిలో రాజకీయంగా ప‌రిణామాలు వేగంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఏపిలో అయిదు లోక్‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు ఖాయం – Chandrababu Announced About By-Election in AP

0
ఏపిలో అయిదు లోక్‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు ఖాయం. వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతున్నాయి. ఇది చెబుతుంది వైసిపి ఎంపీలు కాదు. ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం వైసిపికి చెందిన అయిదుగురు ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసారు. ఆ వెంట‌నే ఆమ‌ర‌ణ దీక్ష చేసారు. స్పీక‌ర్ ఫార్మాట్లో ఇచ్చిన త‌మ రాజీనామాల‌ను ఆమోదించాల‌ని ఇప్ప‌టికే వైసిపి ఎంపీలు స్పీక‌ర్ను కోరారు. మ‌రోసారి క‌లిసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇదే స‌మ‌యంలో టిడిపి నేత‌ల త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో స‌మావేశ‌మ‌య్యారు. ఆ స‌మావే శంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. జూన్ రెండు త‌రువాత వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు.
రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని, త‌డాఖా చూపిద్దామంటూ పార్టీ నేత‌ల‌తో     చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అయితే, నంద్యాల ఉపఎన్నిక కోస‌మే 13 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేల‌ను, టిడిపి మొహ‌రించింది. అయితే, ఇప్పుడు అయిదు లోక్‌స‌భ స్థానాల‌కు ఆ విధంగా మేనేజ్ మెంట్ చేయ‌టం సులువైన విష‌య మేమి కాదు. ఈ సంగ‌తి టిడిపి నేత‌ల‌కు బాగా తెలుసు. అయితే, ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసిపి ఎంపీల పై టిడిపి పోటీ పెట్ట‌టానికే సిద్ద‌మ‌వుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ప‌ద‌వులు త్యాగం చేస్తే వారి పై పోటీకి దిగ‌టం ద్వారా టిడిపి స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.
ఇక‌, పోటీ చేసినా ప‌ద‌వులు వ‌దులుకున్న వారిగా వైసిపి ఎంపీల‌నే ప్ర‌జ‌లు తిరిగి గెలిపించ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. వైసిపి నేత‌లు తాము ప్ర‌జ‌ల్లోకి వెళ్లి హోదా సెంటిమెంట్ ఎంత బ‌లంగా ఉందో చాటుతామ‌ని ఇప్ప‌టికే ప‌లు మార్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాదయాత్ర ద్వారా ప్ర‌తీ జిల్లాలోనూ విశేష స్పంద‌న క‌నిపిస్తోంది. క‌డ‌ప‌, రాజంపేల‌, నె ల్లూరు, తిరుప‌తి, ఒంగోలు లోక్‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రగాల్సి ఉంటుంది. ఖ‌చ్చితంగా ఏడాది లో సాధార‌ణ ఎన్నిక‌లు ఉన్న ప‌రిస్థితుల్లో..ఇప్పుడు వైసిపి ఈ స్థానాల‌ను గెలుచుకోవ‌టం ద్వారా కేడ‌ర్లో కొత్త జోష్ నింపేందుకు ఉప యోగ‌ప‌డుతుంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.
మ‌రి, టిడిపి పై పెరుగుతున్న అసంతృప్తి కేడ‌ర్లో నిస్తేజం క‌నిపిస్తోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో జూన్ మొద‌టి వారంలో వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే అదే నెలలో ఎన్నిక‌ల సంఘానికి లోక్‌స‌భ స్థానాల‌ను నోటిఫై చేస్తూ లోక్‌స‌భ స‌చివాల‌యం స‌మాచారం ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో, దాదాపుగా ఆగ‌స్టులో ఏపిలో అయిదు లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. ఇదే స‌మ‌యం లో స్పీక‌ర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఎంపీల ఫిరాయింపు అన‌ర్హ‌త పిటీష‌న్ల పైనా నిర్ణ‌యం ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. అదే జ‌రిగితే ఉప ఎన్నిక‌ల స్థానాల సంఖ్య ఏడుకు పెరిగే ఛాన్స్ క‌నిపిస్తోంది. దాదాపుగా ఆ ఎన్నిక‌లు సెమీ ఫైన‌ల్స్ గా టిడిపి-వైసిపి మ‌ధ్య హోరా హోరా పోరుకు వేదిక‌గా మార‌నున్నాయి.

నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా – Dilemma on Lokesh Nara contesting in 2019

0

నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా. చేస్తే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుండి బ‌రిలో నిలుస్తారు. ఏ స్థానం నుండి పోటీ చేస్తే సుర‌క్షితంగా భావిస్తున్నారు. ముఖ్య‌మంత్రి, మంత్రి లోకేష్ కోర్ టీంలో దీనిపై కొద్ది రోజులుల‌గా క‌స‌రత్తు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్సీగా చేసి, ఆ త‌రువాత మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టంపై దొడ్డి దారిన లోకేష్ ను మంత్రి గా చేసార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని లోకేష్ భావిస్తున్నా రు. దీని కోసం పార్టీ అధినేత ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. టిడిపి అధినేత రాయ‌ల‌సీమ నుండి కుప్పం నియోజ‌క వ‌ర్గం నుండి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దీంతో, లోకేష్ను కోస్తా జిల్లాల నుండి బరిలోకి దింపాల‌నే ఆలోచ‌న జ‌రిగింది. కానీ, సుర‌క్షిత స్థానం ఏద‌నే దాని పై ఇంకా స్ప‌ష్ట‌త‌కు రాలేదు. కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు పై తొలుత దృష్టి పెట్టిన‌ట్లు ప్రచారం జ‌రిగింది.

అయితే, ఇప్పుడు టిడిపి కి అండ‌గా నిలిచే సామాజిక వ‌ర్గాలు త‌న తండ్రి సొంతూరు అయిన నారా వారి ప‌ల్లె గ్రామం ఉండే చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని లోకేష్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అయితే, అక్క‌డ నుండి ప్ర‌స్తుతం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ భాస్కర రెడ్డికి అనుకూల ప‌రిస్థితులే ఉన్నాయి. ఇక‌, న‌గ‌రి నియోక‌వ‌ర్గం పైనా లోకేష్ కోసం ఫోక‌స్ చేసిన‌ట్లు చెబుతున్నారు. కానీ, అక్క‌డ వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్క‌డ లోకేష్ పోటీచేస్తూ ఫ‌లితం ఎలా ఉంటుంద‌నే దాని పై టిడిపి కోర్టీంలో స్ప‌ష్ట‌త లేదు. దీంతో, ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌గిరి బెస్ట్ అని వారు భావిస్తున్నారు. వీటితో పాటుగా హిందూపూర్ పైనా ఆలోచ‌న జ‌రుగుతోంది. అయితే, అక్క‌డ బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా స్థానిక ప‌రిస్థితులు మాత్రం   టిడిపికి అంత అనుకూలంగా క‌నిపించ‌టం లేదు.

టిడిపికి కంచుకోట‌గా ఉన్న హిందూపూర్ లోనే ప‌రిస్థితి ఇలా ఉండ‌టం తో ఈసారికి ఎమ్మెల్సీగానే ఉంటూ, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణా బాధ్య‌త తీసుకొంటే బెట‌ర్ అనే సూచ‌న కూడా పార్టీ నేత‌ల నుండి వ‌స్తున్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తే ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం నుండి అప్పుడు, పోటీ             చేయించవ‌చ్చ‌ని వారు సూచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న ఏపి లో మంత్రిగా ఉన్న లోకేష్ పోటీ చేసే స్థానం పై ఇంత త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతుంటే. ఇక‌, పార్టీలో ఎమ్మెల్యేల ప‌రిస్థితి గెలుపు పై టిడిపి లో ఎటువంటి ప‌రిస్థితి ఉందో అర్ద‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితుల కార‌ణంగానే టిడిపి నుండి జంపింగ్లు క్ర‌మేణా పెరుగుతున్నాయ‌ని, రానున్న రోజుల్లో ఇవి మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఏపిలో పంచాయితీ ఎన్నిక‌లు జ‌రుగుతాయా..!టిడిపి- వైసిపిలు ఏం కోరుకుంటున్నాయి. – Panchayathi Elections In Andrapradesh

0

ఏపిలో పంచాయితీ ఎన్నిక‌లు జ‌రుగుతాయా..!టిడిపి- వైసిపి లు ఏం కోరుకుంటున్నాయి.? పంచాయితీ ఎన్నిక‌లు  జ‌రిగితే ఎవ‌రిది పై చేయి అవుతుంది.? ఏపిలో పంచాయితీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ముందుకు వచ్చింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పంచాయితీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌భుత్వాన్ని కోరింది. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు 2013 లో పంచాయితీ ఎన్నికలు జ‌రిగాయి. ఈ ఏడాది ఆగ‌స్టు 1 నాటికి వాటి కాల‌ప‌రిమితి ముగుస్తుంది. గ‌డువు లోగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, ఇందు కోసం ఏర్పాట్లు చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం సూచించింది. పంచాయ‌తీల్లో ఓట‌ర్ల జాబితాల ప్ర‌చుర‌ణ‌, వార్డుల రిజ‌ర్వేషన్‌, వంటి అంశాల‌ను పూర్తి చేయాల‌ని కోరింది. అయితే, ప్ర‌భుత్వం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పంచాయితీ ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌కు సిద్దంగా లేద‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వంలోని ఉన్న‌త స్థాయి వ‌ర్గాలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏపిలో రాజ‌కీయంగా మారుతున్న స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో ఉంచుకొని పంచాయితీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుండా ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌లోకి వెళ్ల‌ట‌మే మంచిదనే అభిప్రాయంతో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే, 2014 లో జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల స‌మ‌యానికి వైసిపి సంస్థాగ‌తంగా బ‌లం పుంజుకోలేదు.

జ‌గ‌న్ అప్ప‌టి వ‌ర‌కు జైల్ లో ఉండ‌టం..పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసుకోక‌పోవ‌టం..జ‌నాద‌ర‌ణ పైనే పార్టీ ఆధార‌ప‌డ‌టంతో 2013 లో జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల్లో ఎదురు దెబ్బ తిన్న‌ది. కానీ, ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. ప్ర‌తీ గ్రామంలో వైసిపికి కేడ‌ర్ ఏర్ప‌డింది. పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని వైసిపి కోరుకుంటుంది. సాధార‌ణంగా పంచాయితీ ఎన్నిక‌లు పార్టీ గుర్తు పైన జ‌రగ‌వు. అధికార పార్టీ వైపే గెలిచిన అభ్య‌ర్ధులు మొగ్గు చూప‌టం సాధ‌ర‌ణంగా జ‌రిగే విష‌యం. అయిన‌ప్ప‌టికీ, అధికార తెలుగు దేశం పార్టీ మాత్రం ఈ ఎన్నిక‌ల‌కు విముఖంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. వైసిపి ఈ సారి పంచాయితీ, మున్సిప‌ల్, జిల్లా ప‌రిషత్ ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితే పాద‌యాత్ర ప్ర‌భావం ఆ ఎన్నిక‌ల పై ఉంటుంద‌ని..ఖ‌చ్చితంగా క్షేత్ర స్థాయిలో బ‌లం నిరూపించు కోవ‌టం ద్వారా సాధార‌ణ ఎన్నిక‌ల‌కు అన్ని ర‌కాలుగా కేడ‌ర్ సిద్ద‌మ‌వుతుంద‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఎన్నిక‌ల కోసం వైసిపి సిద్ద‌మ‌నే సంకేతాలు ఇస్తుంటే..అధికార టిడిపి దీని పై ఏ ర‌కంగా స్పందిస్తుందో చూడాలి.

వైసిపి లోకి ముఖ్య‌మంత్రి త‌న‌యుడు – Nedurumalli Ram Kumar Reddy to join ysrcp

0

మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు వైసిపి బాట ప‌ట్టారు. త్వ‌ర‌లోనే అధికారికంగా వైసిపిలో చేర‌నున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న‌రెడ్డి – మాజీ మంత్రి నేదురుమ‌ల్లి రాజ్య‌ల‌క్ష్మీ కుమారుడు నేదురుమ‌ల్లి రాంకుమార్ రెడ్డి వైసిపిలో చేర‌టానికి రంగం సిద్ద‌మైంది. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో నేదురుమ‌ల్లి అను చ‌ర‌గ‌ణం ఎక్కువ‌గా క‌న‌పిస్తెంది. నేదురుమ‌ల్లి-వైయ‌స్ఆర్ కాంగ్రెస్ లో వైరి వ‌ర్గాలుగా ఉన్న‌ప్ప‌టికీ..వైయ‌స్ ముఖ్య‌మంత్రి కాగానే నేదురుమ‌ల్లి స‌తీమ‌ణి రాజ్య‌ల‌క్ష్మిని వైయ‌స్ త‌న క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

విద్యాశాఖ మంత్రిగా ప‌ని చేసరు. నేదురుమ‌ల్లి జ‌నార్ధ‌న‌రెడ్డి బాప‌ట్ల‌, విశాఖ‌ప‌ట్నం, న‌ర్స‌రావుపేట నుండి ఎంపీగా, వెంక‌ట‌గిరి నుండి ఎమ్మెల్యేగా వ్య‌వ హ‌రించారు. నేదురుమ‌ల్లి రాజ్య‌ల‌క్ష్మీ సైతం వెంక‌ట‌గిరి నుండి రెండు సార్లు గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో నేదురుమ‌ల్లి త‌నయుడు రాంకుమార్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసారు. అయితే, తాజాగా జ‌నార్ధ‌న‌రెడ్డి వ‌ర్దంతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాంకుమార్ రెడ్డి తాను నేదురుమ‌ల్లి అభిమానుల అభిప్రాయాలు తెలుసుకొని 2019 లో వెంక‌ట‌గిరి నుండి ఏ పార్టీ నుండి పోటీ చేయాలో నిర్ణ‌యించుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. దీని పై అభిమానుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలోనే.. మధ్యలో ఓ అభిమాని మన పార్టీ ‘వైఎస్‌ఆర్‌ సీపీ’ అంటూ గట్టిగా అరిచాడు. దీనికి స్పందించిన ఆయన మీ అభిప్రాయాలను మరో 3 నెలలు మనసు లోనే ఉంచుకోవాలి.

మీ అందరి మనసుల్లో ఏ పార్టీ అనుకుంటున్నారో అదే పార్టీ నుంచి వెంకటగిరిలో పోటీ చేస్తానని చెప్ప‌టం ద్వారా త్వ‌ర‌లో వైసిపిలో చేర‌టం ఖాయ‌మ‌నే సంకేతాలిచ్చారు. గత నెలలో గూడూరు వైసీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ రాంకుమార్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలసి చర్చించడం, ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పడంపై ఆయన కచ్చితంగా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో మేక‌పాటి-న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డి ఇప్ప‌టికే వైసిపిలో ఉన్నారు. ఆనం కుటుంబం సైతం టిడిపిని వీడేందుకు సిద్దంగా ఉంది. ఇక‌, ప‌న‌బాక కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉన్నా.. అంత యాక్టివ్ గా లేరు. ఇక‌, ఆదాల సైతం టిడిపిలో ఉన్నా…పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో టిడిపి వెంక‌ట‌గిరి, కోవూరు, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలుచుకోగా, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసిపి గెలిచింది.

జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంలో నెల్లూరు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భించింది. ఈ ప‌రిస్థితుల్లో నేదురుమ‌ల్లి వార‌సుడు సైతం వైసిపి లో చేర‌టం ద్వారా ఆ జిల్లాలో పూర్తిగా వైసిపి ప‌ట్టు కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుండి ఇద్ద‌రు మంత్రులు నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న‌రెడ్డి ఉన్నా..వారిద్ద రూ ఎమ్మెల్సీల కోటా నుండి మంత్రులైన‌వా రే. దీంతో..ఇప్పుడు నెల్లూరు రాజ‌కీయాల్లో వైసిపి ఆధిప‌త్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది

ప‌వ‌న్ బ‌స్‌టూర్‌… అదే ల‌క్ష్యం..కౌంట‌ర్ కు వైసిపి సిద్దం – YCP Ready To Counter on Pawankalyan

0

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ తాజా ల‌క్ష్యం ఎవ‌రు. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి ఎవ‌రిని టార్గెట్ చేయ‌బోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి ప‌వ‌న్ చేప‌డుతున్న బ‌స్‌యాత్ర పై అనేక అంచ‌నాలు ఉన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాన్ దాదాపు 40 రోజుల పాటు రాజ‌కీయ యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. త‌న యాత్ర కోసం ప్ర‌త్యేకంగా ఒక బ‌స్ ను సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం 13 జిల్లా లు క‌వ‌ర్ అయ్యేలా ప‌వ‌న్ టూర్ షెడ్యూల్ ఖ‌రారు చేస్తున్నారు. నాలుగేళ్లుగా టిడిపి మిత్రుడుగా ఉన్న ప‌వ‌న్ పార్టీ ఆవిర్భావ స‌భ ద్వారా టిడిపి ని టార్గెట్ చేయ‌టం మొద‌లు పెట్టారు.

ఇక‌, ఈ న‌ల‌బై రోజుల యాత్ర‌లో సైతం టిడిపి ల‌క్ష్యంగా జ‌నసేన అధినేత ప్ర‌సంగాలు ఉంటాయ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. కొన్ని మీడియా సంస్థ‌ల పైన వ‌ప‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. దీంతో..ప‌వ‌న్ టూర్ కు మీడియా నుండి గ‌తంలో మాదిరి భారీ క‌వ‌రేజ్ ఉండే అవకాశాలు క‌నిపించ‌టం లేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యం..టిడిపి జిల్లాల స‌భ‌లు పెడుతున్న ఈ ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ సైతం ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. టిడిపి – మీడియా సంస్థ‌ల మ‌ధ్య సంబంధాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా బ‌య‌ట పెడుతు న్న ప‌ప‌వ‌న్‌..ఇక ప్ర‌జ‌ల్లోనే ఆ విష‌యాల‌ను ప్ర‌స్తావించే అవ‌కాశం క‌నిపిస్తోంది. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో పార్టీ జిల్లా స్థాయి కార్య‌వ‌ర్గాల‌ను సైతం ప్ర‌క‌టించ‌నున్నారు. టిడిపి అవినీతి పై త‌న బ‌హిరంగ స‌భ ద్వారా అస్త్రాల‌ను సంధించ‌టం మొద‌లు పెట్టిన ప‌వ‌న్‌..ఇప్పుడు ముఖ్య‌మంత్రి త‌న‌యుడితో పాటుగా మంత్రులు..వారి కుటుంబ స‌భ్యుల అవినీతి వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట పెట్ట‌టానికి సిద్దం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వైపు టిడిపి నేత‌లు బిజెపి ని టార్గెట్ చేస్తూ.. జ‌గ‌న్‌-ప‌వ‌న్ బిజెపికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టేలా..టిడిపి ప్ర‌భుత్వం చేసిన నిర్వాకాల‌ను ప‌వ‌న్ ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్ట‌టానికి సిద్దం అవుతున్న‌ట్లు స‌మాచారం. ఇక‌, జ‌గ‌న్ పై ప‌వ‌న్ ఏ ర‌కంగా స్పందిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా ఇప్ప‌ట‌కే మెగా కుటుంబం మొత్తం ఒక్క‌టయింది. దీంతో..సినీ ప‌రిశ్ర‌మ‌లో నూ ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర పై ఆస‌క్తి పెరిగింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న ప‌రిణా మాలు..నెల‌కొన్ని ప‌రిస్థితుల‌తో పాటుగా..అధికార పార్టీకి కొంద‌రు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల మీద ప‌వ‌న్ స్పందించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో..ప‌వ‌న్ టూర్ పై టిడిపి – వైసిపి శ్రేణులు ఆస‌క్తిగా ఉన్నాయి. ప‌వ‌న్ ను రాజ‌కీయ ప్రత్య‌ర్ధిగా కాకుండా..ఇప్ప‌టికీ సినీ యాక్ట‌ర్ గానే జ‌గ‌న్ భావిస్తున్నారు. అయిత, జ‌గ‌న్ పాద‌యాత్ర సాగుతున్న స‌మ‌యంలోనే ప‌వ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. ఆ స‌మ‌యంలో వైసిపిని ల‌క్ష్యంగా చేసుకొని ఏమైనా విమర్శ‌లు..ఆరోప‌ణ‌లు చేస్తే…తిప్పి కొట్టేందుకు వైసిసి సైతం స‌మాయ‌త్తం అవుతోంది

మ‌న‌వాళ్లు భ్రీప్‌డ్ మీ, బిగుస్తున్న ఉచ్చు, ఏ-1 ఆయనే – Who is A1 and Who Will Fall in Gripping Trap?

0

మ‌న‌వాళ్లు భ్రీప్‌డ్ మీ దేశ వ్యాప్తంగా అంద‌రికీ వెంట‌నే గుర్తొచ్చే ఘ‌ట‌న‌. మూడేళ్ల క్రితం సంచ‌న‌లం సృష్టించిన ఈ కేసు కీల‌క ద‌శ‌కు చేరుకుంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ ని  ప్ర‌లోభ పట్టేందుకు ప్ర‌య‌త్నించార‌నే అభియోగం పై విచార‌ణ మ‌రోసారి ఊపందుకుంది. కొంత కాలంగా కామ్ అయిపోయిన ఈ కేసు పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఉన్న‌తాధికారుల‌తో కీల‌క సుదీర్ఘ స‌మావేశం నిర్వ‌హించారు. నామినేటేడ్ ఎమ్మెల్సీతో మాట్లాడింది టిడిపి అధినేత చంద్ర‌బాబు అని ఫోరెన్సిక్ తేల్చిన‌ట్లుగా పోలీసు అధికారులు ముఖ్య‌మంత్రికి నివేదిక ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల చివ‌రి వారంలో ఈ వివరాల‌తో తుది ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. దీం తో ఇప్పుడు ఈ కేసు ఏపి ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న టిడిపి అధినేత మెడ‌కు ఏ ర‌కంగా  చుట్టుకుంటుందో అనే ఉ త్కంఠ క‌నిపిస్తోంది. అయితే, చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోండి ఎలాంటి ఒత్తిళ్లు ఉండ‌వ‌ని ముఖ్య‌మంత్రి పోలీసు అధికారుల‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఓట్లు కు ఓట్లు వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబే ఏ-1 అని పోలీసుల అధికారులు తేల్చిన‌ట్లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో కోర్టుల్లో ఈ కేసు పై ప్ర‌స్తుతం ఉన్న స్టేట‌స్ పైనా చ‌ర్చ జ‌రిగింది. ఓటు కు నోటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తదితరులపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీని ప్రత్యేక ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనిని హైకోర్టు పక్కనబెట్టింది.

హైకోర్టు ఆదేశాన్ని కూడా ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. సుప్రీం చీఫ్‌ జస్టి స్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంలో కేసు విచారణలో ఉంది. ఈ కేసులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో, ఈ కేసుపై గత వారం రోజులుగా పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేప థ్యం లోనే సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కౌంటర్‌ దాఖలు చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. ఒక వైపు న్యాయ‌ప‌రంగా కోర్టుల్లో దాఖ‌లు చేయాల్సిన కౌంట‌ర్ తో పాటుగా తుది ఛార్జ్‌షీట్ దాఖ‌లు పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇప్ప‌టికే కేంద్రం ఎటువంటి చ‌ర్య‌ల‌కు దిగు తుందో అనే టెన్ష‌న్ తో ఉన్న టిడిపి నేత‌ల‌కు ఇప్పుడు స‌డ‌న్ గా తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో జ‌రిగిన స‌మా వేశంతో ఉచ్చు బిగుస్తోంద‌నే విష‌యం అర్ద‌మ‌వుతోంది. ఇక‌, గ‌తంలో ఈ కేసుకు కౌంట‌ర్ గా తెలంగాణ ముఖ్యుల పై నాడు ఏపి ప్ర‌భుత్వం టెలిపోన్ ట్యాపింగ్ అంశం తెర మీద‌కు తెచ్చింది. మ‌రి ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం టిడిపి ముఖ్యులు దీని పై ఏ ర‌కంగా రియాక్ట్ అవుతారో ఎటువంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో చూడాలి.

టార్గెట్ చంద్ర‌బాబు. టిడిపి నేత‌ల్లో అల‌జ‌డి – Why Target is Chandra Babu Naidu and Why TDP Leaders Fears

0

టిడిపి అధినేత చంద్ర‌బాబు చుట్టూ ఉచ్చు బిగిస్తోందా. టిడిపి నేత‌ల్లో అల‌జ‌డి ఎందుకు మొద‌లైంది.  ఉమ్మ‌డి ఏపి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు తీ సుకున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాల పై ఇప్పుడు విచార‌ణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. కేంద్రం పైనా ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేస్తూ ఏపి సీయం చంద్ర‌బాబు టిడిపి నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కొద్ది రోజులుగా కేంద్రం త‌మ పై చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని ఏపికి చెందిన పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు, మీడియా పై సిబిఐ విచార‌ణ జ‌రిగే అవ‌కాశాలు ఉ న్నాయ‌ని స్వ‌యంగా టిడిపి అధినేతే అనుమానం వ్య‌క్తం చేసారు. ఇటువంటి స‌మ‌యంలో కేంద్రానికి వ్య‌తిరేకంగా వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాల మంత్రులు పుదుచ్చేరి సీయం తో క‌లిసి కేంద్ర ఆర్దిక విధానాల పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష త‌న స‌మావేశం జ‌రిగింది.

కేంద్రం దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి ఎవరూ హాజ‌రు కాలేదు. టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ టిడిపి నేత‌ల స‌మావేశంలో కెసిఆర్ ప్ర‌తిపాదిత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను చాలా లైట్ గా తీసుకొని వ్యాఖ్య‌లు చేసారు. ఈ నేపథ్యంలో కెసిఆర్‌ తెలంగాణ పోలీసు ఉన్న‌తాధికారులు, న్యాయ శాఖ అధికారుల‌తో సుదీర్ఘ స‌మావేశం నిర్వ‌హించారు. ఓటు కు నోటు కేసుతో పాటుగా ఉమ్మ‌డి ఏపి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాల పైనా చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముందు రోజే గ‌వ‌ర్న‌ర్ తోనూ తెలంగాణ సీయం స‌మావేశ‌మ‌య్యారు. అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో చంద్రబాబు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎమ్‌జి సంస్థకు హైదరాబాద్ లోని స్టేడియంలను అప్పగించడానికి తీసుకున్న నిర్ణయంపై విచారణ దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.  గచ్చిబౌలిలో దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌ సంస్థకు గోల్ఫ్‌ కోర్సు పేరిట దాదాపు 500 ఎకరాలు కట్టబెట్టిన వైనంపైనా విచారణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మార్, రహేజాతో పాటు చంద్రబాబు హయాంలో సాగిన అన్ని భూ లావాదేవీల వెనుక గుట్టును రాబట్టాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమా చారం.

చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులకు సంబంధించి అప్పటి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఏ కేసు పైనా ఆరు నెల‌ల కు మించి స్టే ఉండ‌టానికి వీళ్లేద‌ని సుప్రీం ఆదేశాలివ్వ‌టం, ఇప్పుడు ఈ వ్య‌వ‌హారాల పై స‌డ‌న్ గా కెసిఆర్ విచార‌ణ చేయ‌టం వెనుక చూస్తుంటే ఇది టార్గెట్ చంద్ర‌బాబు గా అడుగులు ప‌డుతున్న‌ట్లు అర్ద‌మ‌వుతోంది. తెలంగాణ సీయం కార్యాల‌యంలో అయిదు గంట‌ల పాటు సాగిన పోలీసు- న్యాయ శాఖ‌ల ఉన్న‌తాధికారుల స‌మావేశంతో టిడిపి నేత‌ల్లో అల‌జ‌డి మొద‌లైంది. ఒక వైపు కేంద్రం, మ‌రో వైపు తెలంగాణ ముఖ్య‌మంత్రి వేస్తున్న అడుగులు రాజ‌కీయంగా ఎటువంటి ప‌రిణామాల‌కు కార‌ణం అవుతాయో అనే ఉత్కంఠ ఇప్పుడు ఏపిలో క‌నిపిస్తోంది.

ఆశోక్ బాబు కి దిమ్మ తిరిగింది, బొమ్మ క‌న‌బ‌డింది – AP NGO Director Ashok Babu Is A TDP Agent?

0

పేరుకే ఉద్యోగ సంఘ నేత‌. టిడిపి కి మ‌ద్ద‌తు దారుడిగా ముద్ర‌. బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటు వేయ‌మ‌ని ప్ర‌చారం. టిడిపి నేత‌ల‌నే మించిపోయేలా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపి ఎన్టీవో సంఘ అధ్య‌క్షుడు అశోక్ బాబు ప్ర‌వాసాంధ్రుల ఆగ్ర‌హాని కి గుర‌య్యారు. అక్క‌డి తెలుగు సంఘాళ మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మ‌య్యారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, తెలుగు దేశం నాయకులు బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్‌కు వేయాలని  సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్‌ఫీల్డ్‌ రోడ్డులోని ఒక హోటల్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌ హక్కు ల పోరాట వేదిక’ పేరిట అశోక్‌బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే తాము ఇక్కడికి వచ్చేవాళ్లమే కాదంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడి తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి తమను విభజించవద్దని సూచించారు.

చంద్రబాబు చెప్పినట్లు అశోక్‌బాబు ఇక్కడికొచ్చి వ్యవహరించడం సరికాదని చెప్పారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం కర్ణాటకలోని తెలుగు ప్రజలను ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కర్ణాటక ఎన్నికలతో అశోక్‌బాబుకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. అశోక్‌బాబును నిలదీసేందుకు కొందరు తెలుగు సంఘాల వారు హోటల్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గొడవ మధ్యే అశోక్‌ బాబు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన బీజేపీని, మోదీనీ ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. స్వ‌చ్చంద సేవా సంస్థ‌ల ప్ర‌తినిధులు, బిజెపి నేత‌లు ఫైర్ అవుతున్నారు. అశోక్ బాబు వ్యవహారం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తాము గవర్నర్ నరసింహన్ కు, ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తామని బిజెపి నేత‌లు చెబుతున్నారు. అయితే, ఏపి అధికార పార్టీ ఈ ర‌కంగా ఉద్యోగ సంఘ నేత‌ల‌ను పొరుగు రాష్ట్ర ఎన్నిక‌ల్లో త‌మ విధానానికి అనుగుణంగా ఉప‌యోగించుకోవ‌టం పై ఉద్యోగుల్లోనే అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. ఇప్పుడు అశోక్‌బాబు క‌ర్నాట‌క లో తెలుగు వారి మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మై ఉద్యోగ సంఘాల‌కు ఉండే విలువ‌ను త‌గ్గిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.