Home Blog Page 30

వైసిపి ఎమ్మెల్యేలు ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసే ప్ర‌తిపాద‌న పై చ‌ర్చ జ‌రుగుతోంది – YSRCP MLA demands debate on AP Special Status

0
వైసిపి ఆ నిర్ణ‌యం తీసుకుంటే టిడిపి కొత్త కుట్ర‌కు సిద్దంగా ఉందా. అదే జ‌రిగితే ప్ర‌జ‌లు స‌హిస్తారా. వైసిపి ఎమ్మెల్యేలు ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసే ప్ర‌తిపాద‌న పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే వైసిపికి చెందిన ఎంపీలు రాజీనామా చేసారు. ఆమ‌ర‌ణ దీక్ష చేసారు. త‌రువాతి కార్యాచ‌ర‌ణ పై పార్టీ ఎంపీల‌తో అధినేత జ‌గ‌న్ సమావేశ‌మ‌య్యారు. ఈ నెల 22న పార్టీ నేత‌ల స‌మావేశంలో తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. ఇప్ప‌టికే వైసిపి ఎంపీల రాజీనామా తో ఢిఫెన్స్లో ప‌డిన టిడిపి ఒక, రోజుకు విస్తృత ప‌బ్లిసిటీ ద్వారా మైలేజ్ పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, వైసిపి మాత్రం టిడిపి వైఖ‌రి ఎలా ఉన్నా, ఎమ్మెల్యేల‌తో సైతం రాజీనామా చేయించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని అదే, స‌మయం లో కేంద్రం పైనా ఒత్తిడి పెంచాల‌ని భావిస్తుంది.
వైసిసి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే టిడిపి ఎమ్మెల్యేలు ఇక ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డు తుంది. అయితే, వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, టిడిపి కొత్త ఎత్తుగ‌డ ద్వారా వైసిపికి న‌ష్టం చేసేలా నిర్ణ‌యం తీసేకొనే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ ఇప్పుడు వినిపిస్తోంది. వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌గానే వాటిని ఆమోదించి వైసిపి నుండి టిడిపి లోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల‌తో తమ‌దే అసలైన వైసిపి అంటూ స్పీక‌ర్ లేఖ ఇప్పిస్తార‌ని దాన్ని, వెంట‌నే స్పీక‌ర్ ఆమోదిస్తార‌ని.  దీని ద్వారా వైసిపి గుర్తింపే స‌మ‌స్య‌గా మారుతుంద‌ని ఆ చ‌ర్చ సారంశం. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించినా ఎన్నిక‌లు వ‌చ్చే, అవ‌కాశం లేక‌పోవ‌టంతో టిడిపి, వైసిపి కి న‌ష్టం చేసేలా ఈ నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం, ఉంద‌నేది వాద‌న‌. అయితే, ప్ర‌త్యేక హోదా కోసం వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స‌మ‌యంలో టిడిపి ఇటువంటి రాజ‌కీయాలు చేస్తే, ఇక ప్ర‌జ‌లు స‌హిస్తారా టిడిపిని క్ష‌మిస్తారా.
అస‌లు, టిడిపి ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకో గ‌ల‌దా అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఒక వైపు వైసిపి నేత‌లు హోదా కోసం ప‌ద‌వులు వీడితే టిడిపి ఇటువంటి రాజీకీయాలు చేస్తే రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో భారీ డామేజ్ అవ్వ‌టం తో పాటుగా వైసిపి కి విప‌రీతంగా సానుభూతి పెర‌గ‌టానికి కార‌ణ‌మ‌వుతా ర‌నేది మ‌రో అభిప్రాయం. ఫిరాయిం పు ఎమ్మెల్యేలు త‌మ‌దే అస‌లైన వైసిపి అని స్పీక‌ర్ కు లేఖ ఇస్తే, మ‌రి అందులో మంత్రి ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్న న‌లుగురు ఆ ప‌ద‌వుల్లో కొన‌సాగ‌టానికి ఆర్హ‌త ఉంటుందా. టిడిపి ఇటువంటి కుయుక్తులు ప‌న్నితే ఇక్క‌డ, నిర్ణ‌యం తీసుకున్నా ఎన్నిక‌ల సంఘం వారి గుర్తింపును ఆమోదిస్తుందా. పార్టీ గుర్తు వ్య‌వ‌హారంలో ఇటు వంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఎన్నిక‌ల సంఘం న్యాయ‌స్థానాలు ఏం చెబుతున్నాయో గ‌త తీర్పులే స్ప‌ష్టం చేస్తు న్నాయి. టిడిపి ప్ర‌భుత్వం పై పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్న ఈ స‌మ‌యంలో, కేంద్రం సైతం ఆగ్ర‌హంగా ఉన్న ప‌రిస్థితుల్లో టిడిపి అంత తెగింపు ప్ర‌ద‌ర్శిస్తుందా.
ఇలాంటి, వెన్నుపోటు రాజ‌కీయాలు చేస్తే, ఏపి ప్ర‌జ‌లు టిడిపి ని ఆద‌రించే ప‌రిస్థితి ఉంటుందా. జ‌గ‌న్  పై అక్ర‌మంగా కేసులు పెట్టిన స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతి కార‌ణంగా 18 స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రిగితే 15 స్థానాల్లో వైసిపి గెలిచింది. ఎంత మంది జ‌త క‌ట్టినా ఎంత విష ప్ర‌చారం చేసినా, 2014 ఎన్నిక‌ల్లో వైసిపి ఓట‌మికి ఓట్ల తేడా కేవ‌లం 1.95 శాతమే. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా. ఇప్పుడు, ఏపి లో రాజ‌కీయంగా ఒంట‌రి పోరాటం చేయాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్న టిడిపి ఇంత‌టి కుట్ర‌కు దిగుతుందా అనే చ‌ర్చ సాగుతోంది. ఇటువంటి రాజ‌కీయ చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఏం జరిగినా, ముందుకే వెళ్లాల‌నేది వైసిపి ఆలోచ‌న గా క‌నిపిస్తోంది. టిడిపి కుయుక్తులు ప‌న్నుతుంద‌న్న అంచ‌నాల న‌డుమ‌ వైసిపి ఎమ్మెల్యేల రాజీనామాల‌ను ప్ర‌స్తుతాని కి వాయిదా వేసుకుంటుందా. లేక‌, ముందుకే వెళ్లి ప్ర‌జ‌ల్లోనే తేల్చుకోవ‌టానికి సిద్ద‌మ‌వుతుందా అనేది చూడాలి.

కౌంట్ డౌన్ స్టార్ట్.మూడో ఛార్జ్ షీట్‌లో చంద్ర‌బాబు – CBN name in 3rd Charge Sheet of Vote for Note Scam

0

కౌంట్ డౌన్ స్టార్ట్. వ‌చ్చే వార‌మే ముహూర్తం. మూడో ఛార్జ్ షీట్‌లో టిడిపి అధినేత చంద్ర‌బాబు. ఏపి-తెలంగాణ తో పాటుగా దేశ వ్యాప్తంగా సం చ‌ల‌నం సృష్టించిన ఓటు కు కోట్లు కేసులో కీల‌క అడుగులు ప‌డుతున్నాయి. తెలంగాణ ఏసిబి వ‌చ్చే వారం మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయ‌బోతోంది. అందులో ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును నిందితుడిగా చేర్చ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్ప‌టికే ఏ-1 గా పేర్కొంటూ ఏసిబి రెండు ఛార్జ్ షీట్లు దాఖ‌లు చేసింది. మూడేళ్ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ సుదీర్ఘ స‌మావేశం నిర్వ‌హిచటం..అప్ప‌టి విచార‌ణ అధికారుల‌ను పిలి పించ‌టం తో వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి 50 లక్ష‌లు ఎక్క‌డి నుండి వ‌చ్చాయ‌నే దాని పైనా ఏసిబికి ఆధారాలు ల‌భించిన‌ట్లు స‌మాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌స‌న్ తో మాట్లాడిన వాయిస్ టిడిపి అధినేతదిగా హైద‌రాబాద్, చంగీఘ‌డ్ కు చెందిన ఫోరెన్సిక్ విభాగాలు వెల్ల‌డించిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఫోరె న్సిక్ నివేదిక ఆధారంగా మూడో ఛార్జ్ షీట్లో చంద్ర‌బాబు పేరు చేర్చ‌బోతున్న‌ట్లు స‌మాచారం. దీని పై ఇప్ప‌టికే తెలంగాణ న్యాయశాఖ ప‌రిశీల‌నకు పంపుతున్నారు. అయితే, ఈ ఓటుకు కోట్లు కేసులో ఏ-1 గా చంద్ర‌బాబు అవుతార‌ని న్యాయనిపు ణులు చెబుతున్నారు. స్టీఫెన్ స‌న్ ను ప్ర‌లోభ‌పెట్ట‌ట్ఏ ఈ కేసులో కీల‌కం అవుతుంద‌ని న్యాయ నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రో వారం రోజుల్లో కర్నాట‌క ఎన్నిక‌లు సైతం ముగియ‌నున్నాయి.

ఇక‌, కేంద్రం ఏపిలో అధికారం మాటున సాగి న అవినీతి పైనా దృష్టి సారిస్తుంద‌నే వాద‌న టిడిపి నేత‌ల నుండే వినిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి వేగంగా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం కూడా టిడిపి నేత‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎటువంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. దీని పై ఇప్ప‌టికే టిడిపి లో ముఖ్య‌మైన నేత‌ల‌తో స‌మావేశం సైతం జ‌రిగింద‌ని..అయితే, హైకోర్టు త‌మ అధినేత పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ‌కు తిర‌స్క‌రించింద‌ని..ఈ కేసు కార‌ణంగా ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని పైకి చెబుతున్నా..లోలోప‌ల మాత్రం రాజ‌కీయంగా త‌మ‌కు న‌ష్టం క‌లించే విధంగా ప‌రి ణామాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో..వ‌చ్చే వారం ఈ కేసులో కీల‌క పరిణామాలు చోటు చేసుకొ నే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

జ‌గ‌న్ ధైర్యం చూసి ఆ నేత‌లు తెగ ముచ్చ‌ట ప‌డిపోతున్నారు – YS Jagan is Very Powerful Person in AP Politics

0

జ‌గ‌న్‌. ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారారు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్య‌క్తి. ఏపికి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో..ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు. ఢిల్లీలో..మంగ‌ళ‌గిరిలో..గుంటూరు లో ప్ర‌త్యేక హోదా కై దీక్ష చేసారు. ప్ర‌తీ జిల్లాలో యువ‌భేరీలు నిర్వ‌హించారు. శాస‌న‌స‌భ‌లో..బ‌య‌టా హోదా కోసం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఇక‌, తాజా గా ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోదీ తో ఢీ కొట్టేందుకు సిద్ద‌మ‌య్యారు. నాడు వైయ‌స్ హ‌ఠాన్మ‌ర‌ణంతో మృతి చెందిన అభిమాను ల‌ను ఓదార్చే ఉద్దేశంతో ముందుకు వ‌స్తే…కాద‌న్నందుకు సోనియా ను ధిక్క‌రించారు. ఫ‌లితంగా అక్ర‌మ కేసులు న‌మోద‌య్యాయి. అయినా..వెనుక‌డుగు వేయ‌లేదు.

కాంగ్రెస్ ను కాద‌ని వైసిపిని ఏర్పాటు చేసారు. అనేక అభియోగాల‌తో కేసుల్లో  ఇరికించారు. అయినా  అధైర్య ప‌డ‌లేదు. దేశం మొత్తం నాడు సోనియా కు భ‌య‌ప‌డే రోజుల్లో సోనియాకు ధిక్కిరించి కొత్త పార్టీ పెట్టిన తొలి వ్య‌క్తి గా గుర్తింపు పొందారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో  సైతం జ‌గ‌న్ అధికారంలోకి రాకుండా అనేక కుట్ర‌లు చేసారు. విష ప్ర‌చారం చేసారు. 1.95 శాతం ఓట్ల తేడాతో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మ‌య్యారు. అనుభ‌వం లేని ప్ర‌తిప‌క్ష నేత అంటూ టిడిపి నేత‌లు హేళ‌న చేసారు. అయినా..జ‌గ‌న్ ప‌రిణితి చెందిన వ్య‌క్తిగా ఎద‌గ‌టానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర బాబు ఏ రోజు జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండా ఉండ‌ని రోజు లేదంటే అతి శ‌యోక్తి లేదు. ఇక‌,ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు వైఖ‌రిని త‌ప్పు బ‌డుతూనే కేంద్రం తో ఢీ అన్నారు. దేశం మొత్తం సొంత పార్టీ నేత‌లు…ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు మోదీని చూసి భ‌య ప‌డుతున్న స‌మ‌యంలో…కాంగ్రెస్ కూడా చేయ‌ని ధైర్యం జ‌గ‌న్ చేసారు.

ఏపికి ఇచ్చిన హామీ ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాసం పెడుతున్న‌ట్లు ప్ర‌కిటించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇక‌, చెప్పిన‌ట్లుగా లోక్‌స‌భ‌లో ఇత‌ర ప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకొని ఏకంగా కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. ఒక‌వైపు టిడిపి పై ఒత్తిడి పెంచుతూ ..మ‌రోవైపు కేంద్రం తో ప్ర‌జ‌ల త‌ర‌పున పోటారానికి సిద్ద‌మ‌య్యారు. ఏపి ప్ర‌జ‌ల సెంటిమెంట్ గా మారిన ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ తొలి నుండి లీడ్ తీసుకున్నారు. అదే బాధ్య‌త‌తో పోరాడుతున్నారు. త‌న పార్టీకి చెందిన ఎంపీలు..ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెట్టి అధికార పార్టీ త‌మ వైపు కు తిప్పుకున్నా..ఎక్క‌డా నెర‌వ లేదు. నాడు సోనియా ను ..నేడు మోదీను ఎదిరించిన తెగువ ఉన్న వ్యక్తిగా వైసిపి అధినేత జ‌గ‌న్ ను ఏపి ప్ర‌జ‌లే కాదు..దేశ వ్యాప్తంగా గుర్తిస్తున్నారు.

వైసిపిని న‌డింపించిందెవ‌రు. జ‌గ‌న్ ఒక్క‌రేనా – Who Stands For YCP Jagan or Any Person?

0

వైసిపిని న‌డింపించిందెవ‌రు. జ‌గ‌న్ ఒక్క‌రేనా.ఇంకెవ‌రి పాత్ర అయినా ఉందా. ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌న్న చంద్ర‌బాబును ఈ ప‌రిస్థితికి తెచ్చిన వ్యూహాలు..ఆలోచ‌న‌లు వైసిపి ఎవ‌రు అమ‌లు చేసారు. కొంత కాలంగా రాష్ట్ర రాజ‌కీయాల పై వైసిపి పైచేయి సాధించిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏపికి బిజెపి అన్యాయం చేస్తుంద‌ని..బిజెపి మీద‌కు త‌న వైఫ‌ల్యాల‌ను నెట్టివేసి రాజ‌కీయంగా మైలేజ్ సాధించేందుకు ముఖ్య‌మంత్రి ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో వైసిపిత‌న వ్యూహాల‌ను ప‌దును పెట్టింది. ప‌రోక్షంగా టిడిపి పై ఒత్తిడి పెంచింది.

ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం..ఎంపీల రాజీనామాల కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేసింది. దీంతో..టిడిపి ఆత్మ‌ర‌క్ష ణ లో పడింది. వైసిపికి మైలేజ్ రాకుండా ఉండాలంటే..ముందుగా కేంద్రంలో టిడిపి మంత్రుల‌ను ఉప సంహ‌రించుకుంది. ఆ వెంట‌నే ఎన్డీఏ ఓ కొన‌సాగుతామని ప్ర‌క‌టించింది. వైసిపి మ‌రింత ఒత్తిడి పెంచే వ్యూహాల‌ను అమ‌లు చేసింది. టిడిపి ఇక ఎన్డీఏ లో సైతం కొన‌సాగ‌లేని ప‌రిస్థితిని క్రియేట్ చేసింది. ముందుగా ప్ర‌క‌టించిన తేదీ కంటే అవిశ్వాసం మ‌రింత ముందుగా పెట్టి..టిడిపి అధినాయ క‌త్వాన్ని ఒత్తిడికి గురి చేసింది .దంతో..త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తొలుత వైసిపి పెట్టే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పిన టిడిపి..ఆ త‌రువాత ఎన్డీఏ కు డ్ బై చెప్పింది. ఆ వెంట‌నే వైసిపికి పోటీగా అవిశ్వాసం నోటీసు ఇచ్చింది.

ఇక‌, మ‌ద్ద‌తు పొంద‌టంతోనూ రెం డు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. మ‌రో వైపె ప‌వ‌న్ పైనా చంద్బ‌రాబు పార్ట‌న‌ర్ అంటూ వైసిపి అధినేత ఒత్తిడి కొన‌సాగించారు. దీని ఫితంగా జ‌నసేన అధినేత త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం టిడిపికి మ‌ద్ద‌తుగా లేన‌ని నిరూపించుకోవ‌టం కోసం టిడిపి పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు చేసారు. దీంతో..ఇప్పుడు బిజెపి-జ‌న‌సేన రెండూ టిడిపికి దూర‌మ‌య్యాయి. ఇంత ప‌క్క‌గా వ్యూహాలు అమ‌లు చేయ‌టం తో పాటుగా వైసిపి ని టిడిపి అనున‌స‌రించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీని వెనుక పార్టీ అధినేత జ‌గ‌న్ తో పాటుగా వ్య‌హ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క రోల్ పోషించిన‌ట్లు స‌మాచారం. ఇక‌, క్షేత్ర స్థాయిలో విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించారు. మొత్తానికి వైసిపి అనుస‌రించిన వ్యూహాల చ‌ట్ర‌బంధంలో టిడిపి చిక్కుకున్న‌ట్లుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసిపి వ్యూహాల కార‌ణంగా తన ప్ర‌మేయం లేకుండానే చంద్ర‌బాబు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు ప‌రిష్కారం సైతం ఆయ‌న చేతుల్లో లేదు. దీంతో..ఇప్పుడు వైసిపి ఏం చేస్తే..అదే చేస్తూ..రాజ‌కీయంగా ప‌ట్టు నిరూపించుకొనేందుకు చంద్ర‌బాబు తిప్ప‌లు ప‌డుతున్నారు.

వైసిపి ఫిరాయింపు ఎంపీల చర్య‌లు ఉంటాయా – YCP to TDP Changed defective MPs have defective activities?

0

వైసిపి ఫిరాయింపు ఎంపీల చర్య‌లు ఉంటాయా. ఢిల్లీ నుండి అందుతున్న స‌మాచారం మేర‌కు వైసిపి నుండి గెలిచి టిడిపిలో చేరి న ఫిరాయింపు ఎంపీల పై చ‌ర్య‌ల పై అడుగులు వేగంగా ప‌డుతున్నాయి. 2014 లో వైసిపి నుండి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి..అర‌కు ఎంపి కొత్త ప‌ల్లిగీత టిడిపిలో చేరారు. కొంత కాలం క్రితం కర్నూలు ఎంపి బుట్టా రేణుక సైతం టిడిపి లో అన‌ధికారికంగా చేరారు. అయితే, ఎస్పీవై రెడ్డి, కొత్త‌పల్లి గీత పై చాలా కాలం క్రిత‌మే పార్టీ ఫిరాయింపు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అభ్య‌ర్ధిస్తూ స్పీక‌ర్ కు పిటీష‌న్ ఇచ్చారు. అయితే, ఈ పిటీష‌న్ ను స్పీక‌ర్ ఎథిక్స్ క‌మిటీకి రిఫ‌ర్ చేసిన‌ట్లు వైసిపి ఎంపీలు చెబుతు న్నారు. ఎస్పీవై రెడ్డి అనారోగ్యం తో ఉన్నారు. ఆయ‌న బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సైతం దూరంగా ఉన్నారు. ఇక‌, కొత్త‌ప‌ల్లి గీత సైతం తాను వైసిపి లో లేన‌ని ఒక‌సారి..టిడిపిలో సంబంధం లేద‌ని మ‌రొక‌సారి పేర్కొన్నారు. అయినా..పార్టీని ధిక్క‌రించిన వీరి పై చ‌ర్య లు తీసుకోవాల‌ని వైసిపి నేత‌లు తాజాగా స్పీక‌ర్ కు విజ్ఞ‌ప్తి చేసారు.

ఏపిలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మ‌రోసారి ఈ ప‌రిణ‌మాల పై చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. బిజెపిని డామేజ్ చేసే విధంగా ఏపిలో టిడిపి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బిజెపి నేత‌లు ఆరోపిస్తు న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుండి టిడిపి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా గ్యాప్ పెరిగింది. ఇంకా ఈ రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తి పరిణామాల‌పై ఢిల్లీలోనూ క‌ద‌లికలు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇదే స‌మ‌యంలో.. పార్ల‌మెంట్‌లో వైసిపి ఎంపీల ఆందోళ‌న స‌మ‌యంలో ఫిరాయిం పు ఎంపీల పై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే ఒత్తిడిని వైసిపి ఎంపీలు పెంచిన‌ట్లు తెలుస్తోంది. దీని ఫ‌లితం త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని వైసిపి నేత‌లు ధీమాగా చెబుతున్నారు. వైసిపి నేత‌లు చెబుతుంది ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే..త్వ‌ర‌లోనే ఫిరాయింపు ఎంపీల పై చ‌ర్య‌లు ఈ స‌మావేశాలు ముగిసే లోగా ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేషకుల అభిప్రాయం.

జ‌గ‌న్ పాద‌యాత్ర సంచ‌ల‌నాల‌కు కార‌ణం అవుతోంది – YS Jagan Padayatra Creates a History

0

జ‌గ‌న్ పాద‌యాత్ర సంచ‌ల‌నాల‌కు కార‌ణం అవుతోంది. ఇప్ప‌టికే పాద‌యాత్ర లో త‌న తండ్రి వైయ‌స్ మార్క్ ను జ‌గ‌న్ దాటేసారు. 2004 లో వైయ‌స్ఆర్ 1,470 కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసారు. జ‌గ‌న్ 111వ రోజు పాద‌యాత్ర లో భాగంగా 1500 మార్కు చేరా రు. అప్పుడ‌క సైతం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే. టిడిపి ప్ర‌భుత్వం..చంద్ర‌బాబు వైఖ‌రిని నిర‌సిస్తూ..మండుటెండ‌ల్లో వైయ‌స్ త‌న పాద యాత్ర ప్రారంభించారు. ఆ పాద‌యాత్రే మొత్తంగా వైయ‌స్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను మ‌లుపు తిప్పింది. ఇప్పుడు, అదే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  పాల‌న లోపాల‌ను ఎండ‌గ‌డుతూ..ప్ర‌జ‌ల‌తో క‌లిసి విప‌క్ష నేత హోదా జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆరు జిల్లాల్లో యాత్ర పూర్తి చేసారు. 2012లో నాటి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు 2,340 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర చేసారు. అయితే, వైయ‌స్‌-జ‌గ‌న్‌-చంద్ర‌బాబు పాద‌యాత్ర‌కు చాలా తేడా ఉంది. వైయ‌స్ మండుటెండ‌ల్లో కాలికి బొబ్బ‌ల తొ త‌న యాత్ర కొన‌సాగించారు.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ సైతం అదే విధంగా యాత్ర‌లో ముందడుగు వేస్తున్నారు. ఇక‌, చంద్ర‌బాబు పాద‌యా త్ర చేసిన స‌మ‌యంలో ఎక్కువ‌గా సాయంత్రం స‌మ‌యంలో యాత్ర ప్రారంభించి..అర్దరాత్రి వ‌ర‌కు కొన‌సాగించేవారు. ఇక‌, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ సైతం పాద‌యాత్ర చేసారు. ఒక మ‌హిళ ఏపిలో చేసిన పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డుగా నిలిచిపోయింది. అంద‌రి కంటే ఎక్కువ‌గా 3,112 కిలో మీట‌ర్లు ష‌ర్మిళ యాత్ర సాగింది. ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్న యాత్ర ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లాతో పాటుగా మ‌రో ఆరు జిల్లాల్లో కొన‌సాగాల్సి ఉంది. అంటే, దాదాపు 3,500 కిలో మీట‌ర్ల మేర..వ‌చ్చే ఆగ‌స్టు వ‌ర‌కు యాత్ర కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వైసిపి అధినేత జ‌గ‌న్ న‌డుం నొప్పి కార‌ణంగా బెల్టు తోనే త‌న యాత్ర‌లో ముందుకు క‌దులుతున్నారు. బ‌స్సులో బ‌స చేస్తూ..ప‌రిమిత ఆహారంతో…క‌సితో పాద‌యాత్ర చేస్తున్నారు. కాళ్ల‌కు బొబ్బ‌లెక్కినా ప్రాధ మిక చికిత్స చేసుకుంటూ వాటిని లెక్క చేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో..జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర కార‌ణంగా వైసిపి లో కొత్త జోష్ క‌నిపిస్తోంది. ఇక‌, పాద‌యాత్ర‌లో క‌వ‌ర్ చేయ‌ని నియోజ‌క‌వర్గాల్లో ఆగ‌స్టులో బ‌స్ యాత్ర చేయాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..జ‌గ‌న్ మ‌రింత క‌సిగా పాద‌యాత్ర సాగిస్తూ.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ..ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు

విజ‌య‌సాయిరెడ్డి TDP ని షేక్ చేస్తున్నారు…ఎలా? – TDP fear by Vijayasai Reddy.. How?

0

విజ‌య సాయి రెడ్డి. రాజ‌కీయాల్లో అంత‌గా సీనియార్టీ లేదు. జ‌గ‌న్ కు వీర విధేయుడు. వైసిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు. కానీ, ఇప్పుడు టిడిపి నేత‌లు జ‌గ‌న్ కంటే ఎక్కువ‌గా కార్న‌ర్ చేస్తున్న నేత‌. వైసిపి లో అంద‌రివాడుగా ఉంటున్న విజ‌య‌సాయ‌రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యు డు అయిన త‌రువాతి నుండి కేంద్ర స్థాయిలో అంద‌రితోనూ మంచి స‌త్సంబంధాలు న‌డ‌ప‌టంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు భాగ‌స్వామిగా ఉన్న టిడిపి కంటే..కేంద్రంలో ఏం జ‌రుగుతుందో ముంద‌స్తు స‌మాచారం ఆయ‌న‌కే వ‌స్తుంద‌ని టిడిపి నేత‌లే అంగీక‌రించే ప‌రిస్థితి.

కేంద్రంలో ప్ర‌ధాని మోదీ నుండి ఏ మంత్రి అయినా..విజ‌య సాయి రెడ్డి అడిగితే అ ప్పాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందే. ఆ స్థాయికి ఆయ‌న త‌న ప‌లుకుబ‌డి పెంచుకున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు సైతం ప్ర‌ధాని మోదీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌ని స్థితిలో జ‌గ‌న్ కు అప్పాయింట్‌మెంట్ ద‌క్కేలా సాయి రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. ఇక ఎన్డీఏ రాష్ట్రప‌తి, గ‌వ‌ర్న‌ర్ ల వంటి నియామ‌కాల విష‌యంలోనూ సాయి రెడ్డికి ముందుగానే స‌మాచారం ఇస్తున్నార‌ని టిడిపి నేత‌లు ఉక్రో షానికి గుర‌యిన సందర్భాలు ఉన్నాయి. విజ‌య సాయి రెడ్డి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన స‌మ‌యంలో..తాజాగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర రెడ్డి ఏక‌గ్రీవం అయ్యే విధంగానూ సాయిరెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. టిడిపి అంచ‌నాల‌ను తిప్పి కొడుతూ జ‌గ‌న్ సూచ‌న ల మేర‌కు టిడిపి పై పై చేయి సాధించారు. ఇక‌..తాజాగా..టిడిపి ని కేంద్రంలో కార్న‌ర్ చేయ‌టంలో విజ‌య సాయిరెడ్డి ప్ర‌ముఖ పాత్ర పోషించార‌ని టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌. ఎప్పుడూ ప్ర‌ధాని పేషీ వద్ద సాయి రెడ్డి ఉంటార‌ని..ఆయ‌న‌కు అక్క‌డ ఏం ప‌ని అన్న‌ది టిడిపి నేత‌ల ప్ర‌శ్న‌. అయితే, త‌మ‌కు ద‌క్క‌ని గౌర‌వం సాయి రెడ్డికి ప్ర‌ధాని ఇస్తున్నార‌నేది టిడిపి నేత‌ల ఆక్రోశానికి ప్ర‌ధాన కార‌ణం.

విజ‌య సాయి రెడ్డి రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా మీద అనేక సంద‌ర్భాల్లో  ప్ర‌స్తావించారు. రాజ్య‌స‌భ‌లో స్టేట్స్‌మెన్‌గా గుర్తింపు పొందారు. అతి త‌క్కువ కాలంలోనే కేంద్ర రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టు సాధించిన విజ‌య సాయి రెడ్డి పై టిడిపి నేత‌లు మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ మాత్ర‌మే టిడిపికి కొర‌క‌రాని కొయ్య‌గా క‌నిపించారు. ఇప్పుడు సాయి రెడ్డి సైతం టిడిపికి ప‌క్క‌లో బ‌ల్లెంగా మా రారు. దీంతో..విజ‌య సాయి రెడ్డి లాంటి స‌త్సంబంధాలు ఉన్న నేత మ‌న‌కు ఢిల్లీలో అవ‌స‌ర‌మ‌ని స్వ‌యంగా టిడిపి ముఖ్య‌నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారంటే వారు సాయి రెడ్డి స‌మ‌ర్ధ‌త‌ను ఏ విధంగా అంచ‌నా వేస్తున్నారో అర్దం అవుతోంది. ఇటువైపు జ‌గ‌న్ మాత్రం విజ‌య సాయి రెడ్డి కి అనేక బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు. సాయి రెడ్డి పార్టీకి చేస్తున్న సేవ ఎలాంటితో పార్టీ నేత‌లే చెబుతుంతారు.

జ‌గ‌న్ రాజ‌కీయం ముందు మోక‌రిల్లిన టిడిపి వ్యూహం -TDP was feared by YS Jagan Technique

0

న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం..వ‌ర్సెస్ ఎనిమిదేళ్ల పార్టీ. ఎత్తుల‌-పై ఎత్తులు. వ్యూహాలు- ప్ర‌తి వ్యూహాలు. ఏపిలో కొంత కాలంగా పూర్తిగా పైచేయి గా క‌నిపించిన టిడిపి రాజ‌కీయాన్ని..అదును చూసి దెబ్బ కొట్టారు వైసిపి అధినేత జ‌గ‌న్‌. ప్ర‌త్యేక హోదాతో సమ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారం కావ‌ని చెప్పిన చంద్ర‌బాబే..జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహంలో చిక్కుకున్నారు. జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం..ఎంపీల రాజీనామా అన‌గానే చంద్ర‌బాబు కు విషయం అర్ద‌మైపోయింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైపోయారు. అప్ప‌టి వ‌ర‌కు బిజెపి – టిడిపి మ‌ధ్య మేము కొట్టిన‌ట్లు న‌టిస్తాం..మీరు ఏడ్చిన‌ట్లు న‌టించ‌డి అనే విధంగా రాజీక‌యం సాగింది. కానీ, జ‌గ‌న్ పెంచిన ఒత్తి డితో టిడిపి త‌లొగ్గ‌క తప్ప‌లేదు.

కేంద్రం నుండి టిడిపి మంత్రుల‌ను విత్ డ్రా చేసారు. కానీ, టిడిపి త‌న అవ‌స‌రాల దృష్ఠ్యా ఎన్డీఏలో కొన‌సాగుతోంది. ఏపిలో త‌న వైఫ‌ల్యాల‌ను బిజెపి మీద‌కు మ‌ళ్లించి రాజ‌కీయంగా ల‌బ్ది పొందే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే స‌మ‌యం లో ఏపిలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి వైసిపికని ఇందులోకి లాగే ప్ర‌యత్నం చేస్తోంది టిడిపి. ఇందులో భాగంగా..ఒక వైపు తాను ఎన్డీఏ లో కొన‌సాగుతూనే..మ‌రో వైపు బిజెపితో జ‌గ‌న్ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌చారం చేస్తోంది.

జ‌గ‌న్ ఏపికి ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తే..వారితో క‌లిసి న‌డుస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. కానీ, టిడిపి మాత్రం తాము ఎన్డీఏ నుండి తొలిగే అంశంపై క్లారిటీ ఇవ్వ‌టం లేదు. కేంద్రం పై పోరాటం అంటూనే కేంద్రంలో అధికారంలో ఉన్న కూట‌మిలో భాగ‌స్వామిగా ఉంది. ఇదే స‌మ‌యంలో .. ఏపి ప్ర‌జ‌లు బిజెపి పై ఆగ్ర‌హంగా ఉండటంతో..బిజెపి తో పాటుగా వైసిపి ని కార్న‌ర్ చేసే ప‌నిలో ప‌డింది టిడిపి. ఈ విష‌యంలో టిడిపి డ‌బుల్ గేమ్ ను వైసిపి నుండి జ‌గ‌న్ మిన‌హా మిగిలిని నేత‌లు పెద్ద‌గా జ‌నంలోకి తీసుకుపోవ‌టం లేదు. ఈ ప్ర‌చారం ద్వారా వైసిపికి మైనార్టీలు..ద‌ళితుల‌ను దూరం చేయ‌టం..రాజ‌కీయంగా ఏపిలో ప్ర‌యోజ‌నం పొంద‌టం టిడిపి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. కానీ, జ‌గ‌న్ మాత్రం ధీమాగా క‌నిపిస్తున్నారు. తాము ప్ర‌త్యేక హోదా కోసం అవిశ్వాసం ప్ర‌తిపాదించే స‌మ‌యంలో టిడిపి మ‌ద్ద‌తు ఇవ్వ‌క పోయినా.. త‌మ ఎంపీలు రాజీనామా చేసే స‌మ‌యంలో క‌లిసి రాక‌పోయినా..టిడిపి ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల దృష్టిలో డామేజ్ అవుతుంద ని వైసిపి అధినేత అంచ‌నా వేస్తున్నారు. ఇదే విష‌యంలో వైసిపి అమ‌లు చేసే నిర్ణ‌యాలు బిజెపికి మేలు చేసేవిగా టిడిపి ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, ఇటు టిడిపి..అటు వైసిపి వేస్తున్న ఎత్తుగ‌డ‌లను బిజెపి సైతం నిశితంగా ప‌రిశీలిస్తోంది. కేంద్ర స్థాయిలో వైసిపి ఎంత చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించినా…టిడిపి చేస్తున్న విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌క‌పోతే..అది రానున్న రోజుల్లో వైసికి న‌ష్టం క‌లిగిస్తోంది. ఇ ప్ప‌టి వ‌ర‌కు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైసిపి..రానున్న రోజుల్లో టిడిపిని కార్న‌ర్ చేస్తూ ఎటువంటి కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తుందో చూడాలి.

రాటు తేలిన జ‌గ‌న్ రాజ‌కీయం – YS Jagan Is Fully experienced Person in AP Politics

0

జ‌గ‌న్ రాజ‌కీయల్లో రాటు తేలుతున్నాడు. న‌ల‌భై ఏళ్ల అనుభ‌నానికే టెన్ష‌న్ పుట్టిస్తున్నాడు. తాజాగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో జగ‌న్ అనుస‌రించిన వ్యూహం టిడిపిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి ప‌డేసింది. ఎన్నిక లేకుండానే రాజ్య‌స‌భ ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసిం ది. ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఏపిలో ఖాళీ అయిన మూడు రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి వైసిపి కి..రెండు టిడిపికి ద‌క్కాలి. అయితే, వైసిపి నుండి 23 మంది ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌పెట్టి త‌మ పార్టీలోకి చేర్చుకున్న టిడిపి నేత‌లు వైసిపికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌కుండా చేయాల‌ని తొలి నుండి భావించారు. వైసిపికి ఇక రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌టం క‌ష్ట‌మే అని అంద‌రూ భావించారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో..జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వైసిపి నుండి అన్ని ర‌కాలుగా స‌మ‌ర్ధ‌త ఉన్న వేమిరెడ్డి ప్ర‌భాక‌ర‌రెడ్డిని అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిపారు.

ప్ర‌భాక‌ర రెడ్డి సైతం జ‌గ‌న్ సూచ‌న‌ల‌తో జిల్లాల వారీగా అభ్య‌ర్దుల‌తో స‌మావేశం అయ్యారు. ఇక‌, ఒక ఉత్త‌రాంధ్ర మంత్రి ఏకంగా వైసిపి ఎమ్మె ల్యేల‌కు ఫోన్ చేసి ప్ర‌లోభాల‌కు ప్ర‌య‌త్నించిన ఆడియో త‌మ చేతుల్లో ఉందంటూ వైసిపి ఎంపి విజ‌య సాయి రెడ్డి లీక్ ఇచ్చారు. ఇక‌, బిజెపి నాలుగు ఓట్ల మ‌ద్ద‌తు టిడిపికి క‌ష్టంగా మారింది. వైసిపి ఖాళీ అవుతుంది..ఎమ్మెల్యేలంతా త‌మ‌తోనే ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడిన టిడిపికి..వైసిపి సైతం అదే స్థాయిలో మైండ్ గేమ్‌తో స‌మాధానం చెప్పింది. వైసిపి నుం డి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల్లో అనేక మంది అసంతృప్తితో ఉన్నార‌ని వారు వైసిపి నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం తెర మీద‌కు తీసుకొచ్చారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో వారు వేమిరెడ్డికి మ‌ద్ద‌తిచ్చేందుకు సిద్దంగా ఉన్నార‌ని వైసిపి నేత‌లు జోరుగా ప్ర‌చారం చేసారు. దీంతో, ఓటుకు నోటు వ్య‌వ‌హారం కార‌ణంగా ఇప్ప‌టికీ ఇబ్బందులు ప‌డుతున్న టిడిపి అధినాయ‌క‌త్వం..ప్ర‌స్తుతం వైసిపి వ్యూహాల‌కు బెండ్ కాక త‌ప్ప‌లేదు. అంతే..మూడు స్థానాలు త‌మ‌వే అంటూ ప్ర‌చారం చేసుకున్న టిడిపి అధినాయ‌క‌త్వం ఒక్క‌సారిగా వెన‌క్కు త‌గ్గింది. త‌మ‌కు ద‌క్కాల్సిన రెండు స్థానాల‌కే అభ్య‌ర్ధులను ఖ‌రారు చేసి మిన్ని కుండిపోయింది. దీంతో..వైసిపి కి అస‌లు ద‌క్కుతుందా లేదా అనే సందేహ‌ల న‌డుమ‌..రాజ్య‌స‌భ‌లోకి వైసిపి ఎంపిగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర రెడ్డి నేరుగా ప్ర‌వేశిస్తున్నారు. న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ముందు జ‌గ‌న్ ఎంత అనుకున్న టిడిపి నేత‌ల‌కు..జ‌గ‌న్ రాజ‌కీయాల్లో ఎంత‌గా రాటు తేలారో స్ప‌ష్ట‌మైంది

వైసిపి సీరియ‌స్ డెసిష‌న్. టిడిపి ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టే నిర్ణ‌యం – YCP Take Serious Decision About TDP

0

వైసిపి సీరియ‌స్ డెసిష‌న్. టిడిపి ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టే నిర్ణ‌యం. ప్ర‌త్యేక హోదా పై పోరుకు జోష్ తేవాల‌ని నిర్ణయించిన వైసిపి అధినేత‌. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా రాజీనామా చేసిన ఎంపీల కొత్త వ్యూహం. తొలి నుండి ప్ర‌త్యేక హోదా కోసమ‌ని ముందుండి పోరాడుతున్న వైసిపి మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే త‌మ ప‌దవుల‌కు రాజీనామా చేసి..ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష చేసిన ఎంపీల పోరాటానికి విలువ పెంచేలా ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యించింది. దీని కోసం రాజీనామాల ఆ మోదానికి స్పీక‌ర్ పై ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్ప‌టికే స్పీక‌ర్ ఫార్మాట్ లో వైసిపి కి చెందిన అయిదుగురి ఎంపీల రాజీనామాలు స్పీక‌ర్ వ‌ద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని స‌త్వరం ఆమోదించి… ఎన్ని క‌ల సంఘానికి నివేదించేం దుకు స్పీక‌ర్ ను క‌లిసి ఒత్తిడి తేవాల‌ని వైసిపి అధినాయ‌క‌త్వం ఆదేశించింది. ఎంపీల రాజీనామాలు..వారు చేసిన ఆమ‌ర ణ దీక్ష‌ల‌కు మ‌ద్ద‌తు రాకుండా చూసేందుకు టిడిపి నేత‌ల‌తో పాటుగా మ‌ద్ద‌తు మీడియా అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. డిల్లీ వేదిక‌గా చేసిన ఆమ‌ర‌ణ దీక్ష‌ల‌ను పోలీసులు భ‌గ్నం చేసారు. ఇక‌, టిడిపి సైతం ప్ర‌త్యేక హోదా పై యూ ట‌ర్న్ తీసు కుంది. ప్ర‌త్యేక హోదా కోస‌మ‌ని చెబుతూ తిరుప‌తిలో స‌భ ఏర్పాటు చేసింది. ఈ నెలాఖ‌రులోగా విశాఖ‌లో మరో స‌భ ఏ ర్పాటుకు నిర్ణ‌యిచింది. దీంతో…వైసిపి అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలోనే..ఏపి ప్ర‌భుత్వం పై ఒత్తిడి తె చ్చేలా ద్విముఖ వ్యూహానికి పావులు క‌దుపుతున్నారు. ఒక వైపు కర్నాట‌క ఎన్నిక‌ల తరువాత త‌మ పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారిస్తుంద‌ని..అవినీతి జ‌రిగిన అంశాల పై చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని టిడిపి నేత‌లే అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అంగీక‌రి స్తున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ప‌ట్టు బ‌ట్టి మ‌రీ ఓటు కు నోటు కేసు పై వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తు న్నారు. అంత‌టితో ఆగ‌కుండా ఆప‌ధ్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు హ‌యాంలో తీసుకున్న వివాదాస్ప‌ద భూ కేటాయిం పుల పైనా పున‌ర్విచార‌ణ జ‌రిపేలా కొత్త క‌మిష‌న్ ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. దీంతో…టిడిపి పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ లో ప‌డిన స‌మ‌యంలో..మ‌రింత ఒత్తిడి పెంచేలా క్షేత్ర స్థాయిలో ప్ర‌త్యేక హోదా కోసం పోరాటాలు చేయాల‌ని ప్రాధ‌మికం గా నిర్ణ‌యించారు. దీనికి తోడు..ఎంపీల ద్వారా ఒత్తిడి పెంచి స్పీక‌ర్ రాజీనామాల‌ను ఆమోదించేలా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. స్పీక‌ర్ రాజీనామాలు వెంట‌నే ఆమోదిస్తే..ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు. ఆల‌స్యం చేస్తే.. సాధార‌ణ ఎన్నిక‌లను సాకుగా చూపించి ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌ల‌కు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వైసిపి అంచ‌నా వేస్తోంది.

సాధార‌ణ ఎన్నిక‌ల ముందే టిడిపిని పూర్తి ఢిఫెన్స్‌లో ప‌డేయ‌టంతో పాటుగా అయిదు లోక్‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు వస్తే..టిడిపి పోటీ చేసినా..చేయ‌కున్నా..ఆ పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని వైసిపి లెక్క‌లు వేస్తోంది. దీంతో..రాజీనామాల ఆమోదం కోసం ఒక ఢిల్లీలోనే మ‌కాం వేయాల‌ని వైసిపి నిర్ణ‌యించింది.