Home Blog Page 4

బాబు గారి అడ్డగోలు పాలనలో జరిగిన వేల కోట్ల నష్టం ఇదీ..?

0

మార్కెట్లో టమాటాల రేటు కిలో 60 రూపాయలు ఉంది. అక్కడే కొన్నాళ్లపాటు అక్కడే టమాటాలు కొంటానని ఒప్పందం చేసుకున్నాడో పెద్దాయన. ఒప్పందం చేసుకున్న కొన్నాళ్లకు రేటు బాగా పడిపోయింది. కిలో పది రూపాయలకే మార్కెట్లో వేరే చోట దొరుకుతోంది. తెలివైన వాడు ఏం చేస్తాడు.. బాబూ.. టమాటా రేటు తగ్గింది.. నువ్వు రేటు తగ్గించకపోతే.. నేను వేరే ఎక్కడైనా కొనుక్కుంటాను అని బేరమాడతాడా.. లేదా.. అబ్బే మనం ఒప్పందం చేసుకున్నాం కదా.. నీ దగ్గరే రూ. 60 కే కొంటానులే అంటాడా..

ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా సింపుల్ గానే చెబుతారు. చౌకగా వస్తున్నప్పుడు ఎక్కువ రేటు పెట్టి ఎవరూ కొనరు. కానీ చంద్రబాబు వంటి నేతలు కొంటారంటోంది వైసీపీ. ఎందుకంటే ఆ కొనే సొమ్ము ప్రజలది కదా.. ఇందుకు విద్యుత్ ఒప్పందాల సంగతే వైసీపీ వివరిస్తోంది. విద్యుత్ కొనుకోలు ఒప్పందాలపై వైసీపీ వివరణ ఎలా ఉందంటే..

“ దేశంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ధరలు తగ్గాయి. కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది కూడా. 2010లో యూనిట్ రూ.18 ఉన్న సౌర విద్యుత్ ధర 2018లో రూ.2.18 పైసలకు చేరింది. పవన్ విద్యుత్ ఉత్పత్తి ధర సైతం మూడేళ్లలోనే గరిష్టంగా తగ్గి యూనిట్ రూ.4.20 నుంచి రూ.2.43 కు చేరింది. ఈ విషయాన్నిపార్లమెంట్లో ప్రస్తావించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 3వేల మెగావాట్ల పవన్ విద్యుత్ ను యూనిట్ రూ. 4.84 లకు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది.

అది కూడా ధర్మల్, హైడ్రో పవర్ తక్కువ ధరకే లభిస్తున్నప్పుడు కూడా ఇంత అధికంగా ప్రైవేటు సంస్థలకు ఎందుకు చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నారో బాబుగారికే తెలియాలి. చంద్రబాబు చర్యల వల్ల ప్రభుత్వ డిస్కంలు నష్టాల్లో కూరుకుపోయాయని, రోజుకు 7 కోట్లు నష్టం వస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసి చూపించారు.అధిక ధరల విద్యుత్ వల్ల పారిశ్రామిక రంగానికి భారంగా ఉందని తెలియజేసారు.

హైకోర్టు తాజా నిర్ణయంతో విద్యుత్ ఒప్పందాలపై సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. విచ్చలవిడి ఖర్చులతో ఖజానాను ఖాళీ చేసిన చంద్రబాబు తుగ్లక్ నిర్ణయాలను నేడు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో శ్రమలకు ఓర్చి సరిదిద్దుతోంది. కేంద్రం, పెట్టుబడి సంస్థల ఒత్తిడులను అధిగమిస్తూ పిపిఎల పునః సమీక్షకు మార్గం సుగమం చేసుకున్న సీఎం పంతం రాష్ట్రానికి గుదిబండగా మారిన ఖర్చులనుంచి ఉపశమనం కలిగించిందంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు.”.. ఇదీ వైకాపా వాదన

జగన్ కు ఒకటి కాదు.. రెండు గుడ్ న్యూస్.. దూకుడుకు అడ్డులేదుగా..?

0
గ్రామ సచివాలయాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది....!!

ఏదైనా నమ్మాడంటే.. ఇక ఎవరు చెప్పినా వినడు..ఇది జగన్ గురించి చాలా మంది నాయకులు చెప్పేమాట. అలా జగన్ నమ్మకం పెట్టుకున్న అంశాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. మొన్నటికి మొన్న పోలవరం రివర్స్ టెండర్లపై ఎన్ని విమర్శలు వచ్చినా వెరవకుండా ముందుకే వెళ్లాడు.. ఏకంగా ఒక్క టెండర్‌లోనే దాదాపు 700 కోట్ల రూపాయలు ఆదా చేశాడు.

ఇప్పుడు పీపీఏ ల విషయంలోనూ విజయం సాధించాడు. తన వాదనకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పునఃసమీక్ష అన్న రోజు నుంచీ ఇటు చంద్రబాబు, అటు కేంద్రం ఉలికులికి పడుతూనే ఉన్నాయి. అలా ఎలా చేస్తారంటూ అల్లరల్లరి చేస్తున్నాయి. కేంద్రం పిపిఎల పునః సమీక్ష చేస్తే పెట్టుబడిదారులు రారంటూ అడ్డుపుల్ల వేసే ప్రయత్నాలే చేసింది.

కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గ లేదు. చౌక ధరలకు విద్యుత్ లభించే అవకాశం ఉన్నా అత్యధిక ధరల్లో విద్యుత్ కొనుగోళ్లను జరిపి, ఖజానాకు 2600 కోట్లు ఎందుకు భారం పెట్టాలి అని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్షకు అవకాశమే లేదని కోర్టుకు వెళ్లాయి విద్యుత్ కంపెనీలు.

తాజాగా ఏపీ హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదననే సమర్థించింది. విద్యుత్ నియంత్రణమండలికి వెళ్తామన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుమతినిచ్చింది. విద్యుత్ ఒప్పందాల పునః సమీక్షపై వాదనలు ఏమున్నా ఏపీ ఈఆర్‌సీ ఎదుటే వినిపించమని హైకోర్టు విద్యుత్ సంస్థలకు సూచించింది. విద్యుత్ నియంత్రణా మండలి తీసుకునే నిర్ణయాలు తాము నిర్థారించలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఆరునెలల్లోగా ఈ అంశంపై పరిష్కారం సూచించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలిని ఆదేశించింది.

వైస్ జగన్‌ ప్రభుత్వ లక్యం అదే !

0
వైస్ జగన్‌ ప్రభుత్వ లక్యం అదే !

ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తన ప్రభుత్వ లక్యంగా జగన్‌ ముందుకు వెళ్తున్నాడు. కానీ మళ్లీ ఎలాగైనా సీఎం అవ్వాలనే అత్యాశతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. అంతెందుకు మహిళల విషయానికే వద్దాం ఓట్లుతో సంబంధం లేకుండా రిజర్వేషన్లలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైస్ జగన్‌ ప్రభుత్వమే.. ఇది కాదనలేని నిజం. ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని జగన్ ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నాడు. మరి బాబు ఏమి చేశాడు ? గత ఎన్నికల్లో ఓట్లు దండుకోనేందుకు పసుపు-కుంకుమ పేరుతో మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ చివరికీ వాళ్లే బాబును మోసం చేశారనుకోండి. వాళ్ళు అలా మోసం చేయడానికి ప్రధాన కారణం బాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మాటలు చెప్పి.. కాలం వెళ్లబుచ్చాడు. కానీ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ పాలనలో ఆ తరువాత మహానేత వైఎస్సార్‌ హయాంలో.. నేడు జగన్‌ పరిపాలనలో సామాన్య ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే జగన్ ప్రభుత్వం అక్టోబర్ 15న రైతు భరోసా, అలాగే ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నామని ప్రకటించింది. అదేవిధంగా జనవరి 15న అమ్మఒడి, పేదలకు ఉగాది నాటికి ఇంటి స్థలాలు, పక్కా ఇల్లు అందుతాయని జగన్ స్పష్టం చేశారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న జగన్.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వాటిని అవలీలగా ప్రకటించేయడం.. అమలు పరచడం.. ఈ తరంలో ఒక్క జగన్ కే చెల్లిందని చెప్పుకోవాలి. కాగా అభివృద్ధి కోసం ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, తన తండ్రి ప్రారంభించినటువంటి ఆరోగ్య శ్రీ పథకంలో ఎన్నో కీలకమైన మార్పులు చేసి, వైద్యాన్ని రాష్ట్ర ప్రజలందరికి మరింత చేరువ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం పై పూర్తిగా నిషేదించి.. అందుకుగాను వారందరికీ కూడా అధిక వేతనాలు ఇవ్వాటానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇకపోతే కేవలం ఇక్కడే కాకుండా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయనున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలతో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా

0

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫాస్ట్రక్చర్ సంస్థ.. క్లుప్తంగా ‘మెయిల్’.. ఎన్నో ఏళ్ల తెలంగాణ సాగునీటి కల.. కేసీఆర్ కలలుగన్న కాళేశ్వరాన్ని ప్రపంచమే అబ్బురపరిచేలా మూడేళ్లలో పూర్తి చేసింది ఇదే ‘మేఘా’ సంస్థ. మేఘా చేపట్టిన కాళేశ్వరం.. భూగర్భంలో పంప్ హౌస్ లు ఇలా ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్షాత్కారంగా ఈ ప్రాజెక్ట్ నిలిచింది. అలాంటి మేఘా చేతిలో ఇప్పుడు ఏపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రాజెక్టు పడింది.

టీడీపీ నాయకుల దోపిడీకి బలైపోయిన పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పూర్తికాకుండా ఏపీ ప్రజల ఆశలను నీరుగార్చింది. చంద్రబాబు అండ్ ఆయన కాంట్రాక్టర్ల ధనదాహానికి బలైపోయిందని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిగ్గుతేల్చింది. టీడీపీ తీరును ఎండగట్టింది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మిగిలిపోయిన పోలవరం పనులను రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్లారు. దీనిపై టీడీపీ సహా ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. పోలవరం హెడ్ వర్క్స్ తోపాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. ఆ పనుల విలువను రూ.4987 కోట్లుగా నిర్ణయించింది.

తాజాగా ఈ రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ పాల్గొంది. ఈ పనులను గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే -12.6% తక్కువకు శాతానికి అంటే 4358 కోట్ల మొత్తానికి చేపట్టేందుకు మేఘా సంస్థ బిడ్ వేసి ముందుకొచ్చింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.628 కోట్ల నిధుల ఆదా అయ్యింది. జగన్ సర్కారు చెబుతున్న రివర్స్ టెండరింగ్ దక్కిన ప్రతిఫలమిదీ..

ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయటంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మించిన మేఘా ఇప్పుడు ఏపీ కలల ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. . పోలవరం బిడ్ ఓపెన్ చేసిన ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్ధమౌతోంది. కాళేశ్వరంను రికార్డ్ స్థాయిలో పూర్తి చేసిన మేఘా ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోల‘వరం’గా మారనుంది..

కేసీఆర్, జగన్ సుదీర్ఘ భేటీ: ఏయే అంశాలపై చర్చించారంటే..?

0

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సుమారు మూడు గంటలకుపైగా సమావేశం కావడం గమనార్హం.

నదీ జలాల అనుసంధానం : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు గోదావరి జిలాలు శ్రైశైలానికి తరలింపు, విభజన అంశాలపై చర్చించారు. గోదావరి, కృష్ణా నదీ జలాల సంపూర్ణ వినియోగం కూడా వీరి మధ్య చర్చ వచ్చినట్లు తెలిసింది. గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని, వీలైనంత తక్కువ భూసేకరణతో నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రులు ఇద్దరు నిర్ణయించారు. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలనేదానిపై చర్చించారు.

రెండు రాష్ట్రాలకూ ప్రయోజనకరంగా ఉండేలా జలాల తరలింపు, నీటి వినియోగం ఉండాలని నేతలిద్దరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎంలు కేసీఆర్, జగన్‌లు నిర్ణయించారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లోని సంస్థలపైనా ఇద్దరు సీఎంలు చర్చించారు. విభజన సమస్యలు బకాయిల చెల్లింపులపై ఇద్దరు ముఖ్యమంత్రులు మంతనాలు జరిపారు.

బ్రహ్మోత్సవాలకు రండి.. ఇది ఇలావుంటే, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎం కేసీఆర్‌కు అందజేసి ఆహ్వానం అందించారు. జగన్ తోపాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.

ఆ ఒక్క కార్డుంటే చాలు.. అన్ని కార్డులున్నట్టే!

0
ఆ ఒక్క కార్డుంటే చాలు.. అన్ని కార్డులున్నట్టే!

వన్ నేషన్ వన్ ఎలక్షన్…వన్ నేషన్ వన్ లాంగ్వేజ్… ఈ జాబితాలోకి ఇప్పుడు మరో స్లోగన్ వచ్చి చేరింది. దేశంలోని పౌరులందరికీ ఒకేరకమైన గుర్తింపు కార్డు తెచ్చే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్… పాస్ పోర్టు… డ్రైవింగ్ లైసెన్స్.. ఓటరు కార్డు…వీటన్నింటినీ కలిపి ఒకే కార్డుగా తీసుకువచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. మరో రెండేళ్లలో చేపట్టే జనాభా లెక్కల నాటికి దీన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఒక్కో అవసరానికి ఒక్కో కార్డు… ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న విధానం ఇదే. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఆధార్ గుర్తింపు కార్డు ఉన్నా.. ఆధార్ అన్నది అన్నింటికీ ప్రత్యామ్నాయం కాదు. దేశం దాటాలంటే పాస్ పోర్టు ఉండాల్సిందే… ఓటు వేయాలంటే ఓటరు ఐడీ తప్పనిసరి. ఇక బండి నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒక వ్యక్తి పేరుతో ఇన్ని కార్డులు ఉండాల్సిన అవసరం ఉందా అన్న అలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఈ అన్ని కార్డులను కలిపి ఒకే కార్డుగా మార్చి దేశమంతా ఒకే గుర్తింపు కార్డును తేవాలనుకుంటోంది.

దేశవ్యాప్తంగా బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా… మల్టీపర్పస్ ఐడీ కార్డుపై మాట్లాడారు. జాతీయ పౌర రిజిస్టర్‌…అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని చెబుతున్న కేంద్రం…దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి డేటాతో మల్టీపర్పస్ ఐడీ కార్డును తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఓ వ్యక్తి చనిపోతే ఆ డేటా ఆటోమెటిక్‌గా అప్‌డేట్‌ అయ్యే వ్యవస్థను తీసుకురావాలన్నారు అమిత్ షా.

2021లో దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల కార్యక్రమం నాటికి బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. జనాభా లెక్కల సేకరణను ఈ సారి పూర్తిగా డిజిటల్ రూపంలో చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను కూడా తీసుకువస్తున్నారు. జనాభా లెక్కల సేకరణను మొక్కుబడిగా నిర్వహించకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేస్తామంటోంది బీజేపీ.

45 రోజుల్లోనే సీమ ప్రాజెక్టులను నింపేందుకు ప్రణాళిక

0

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కర్నూలు జిల్లా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. వరదల నేపథ్యంలో నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో జగన్‌ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో 33వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని… రెండు వేల హెక్టార్లలో వాణిజ్యపంటలు దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. పంట నష్టంపోయిన రైతుల పట్ల, నష్టపోయిన ప్రజల పట్ల అధికారులు ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. గీత గీసుకుని ఉండాల్సిన అవసరం లేదని… భారీ వర్షం వల్ల నష్టపోయిన వారిని అదుకునేందుకు ఉదారంగా ఉండాలన్నారు.

రాయలసీమలో ఈ స్థాయి వర్షాలు అరుదుగా వస్తుంటాయన్నారు. పది రోజుల క్రితం వరకు ఐదు జిల్లాల్లో వర్షాలు లేవని బాధపడుతుండేవారిమన్నారు. ఈ వర్షాలతో నీటి సమస్య తీరిపోయిందన్నారు. భూగర్భజలాలు పెరిగాయన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రమే కొద్దిగా లోటు ఉందని… మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైందన్నారు.

కర్నూలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయిందన్నారు. ఈ వర్షం వల్ల కొద్దిగా ఇబ్బందులు కూడా వచ్చాయన్నారు. కర్నూలు జిల్లాలోని 17 మండలాల్లో భారీ వర్షం పడడం వల్ల కొద్దిగా నష్టం జరిగిందన్నారు. భారీ వర్షాల వల్ల రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయన్నారు.

శాశ్వతంగా కరువు నివారణ కోసం రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 120 రోజుల పాటు శ్రీశైలంలోకి వరద వస్తుందన్న ఆలోచనతో ఇప్పుడు పనిచేయలేమన్నారు. శ్రీశైలంలోకి వస్తున్న నీరు రానురాను తగ్గిపోతోందన్నారు. గడిచిన పదేళ్లలో శ్రీశైలంలోకి వచ్చే నీరు 600 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఐదేళ్లలో 400 టీఎంసీలకే నీటి లభ్యత పడిపోయిందన్నారు. ఈ ఏడాది భారీగా వరద వచ్చిందని కానీ శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.

ఎగువున ఆల్మట్టి ఎత్తు కూడా పెంచుతున్నారని… దాని వల్ల మరో 100 టీఎంసీల నీరు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో కృష్ణా ఆయకట్టును రక్షించుకోవాలన్నా, రాయలసీమను కాపాడుకోవాలన్నా గోదావరి జలాలను శ్రీశైలంలోకి తీసుకురావడమే మార్గమన్నారు. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ చర్చలు జరుపుతున్నామన్నారు.

రాయలసీమలోని ప్రాజెక్టులను 120 రోజుల్లో కాకుండా 45రోజుల్లోనే నింపేలా కాలువలను వెడల్పు చేస్తామన్నారు. 45 రోజుల్లోనే రాయలసీమలోని ప్రాజెక్టులను నింపేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సీఎం వివరించారు.

బాబుకు బినామీయే కాదు, బాబుకి జిరాక్స్ కూడా

0

రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కల్యాణ్ తాను నటుడిని అన్న సంగతి అస్సలు మర్చిపోవడంలేదు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ యాక్షన్ అని చెబితేనే తన పని మొదలు పెడతారు, కట్ చెప్పిన వెంటనే సైలెంట్ అయిపోతారు. అప్పట్లో డైరెక్టర్లు చెప్పినట్టు వినే పవన్ కు ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ డైరక్టర్ గా మారారు చంద్రబాబు. బాబు చెప్పినట్టల్లా తలాడిస్తున్నారు పవన్. ఇప్పటికే పలుమార్లు వీరి చీకటి ఒప్పందాలు బైటపడ్డాయి. చంద్రబాబు ఇంటికి నోటీసులిస్తే పవన్ బాబు ఫీలయిపోతుంటారు.

చంద్రబాబు తనకు కేటాయించాలన్న అక్రమ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చేస్తే పవన్ కన్నీరు కారుస్తారు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు రెచ్చిపోతుంటే, ఏంటీ అన్యాయం అని పవన్, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇదీ జనసేనాని తీరు, బాబు కీ ఇస్తే ఆడే బొమ్మలా మారిపోయారు పవన్ కల్యాణ్. మధ్య మధ్యలో బీజేపీ సపోర్ట్ తీసుకుంటున్నా.. చంద్రబాబు పట్ల మాత్రం తన వీర విధేయతను చూపించుకుంటున్నారు. జగన్ 100 రోజుల పాలనపై విడుదల చేసిన నివేదిక కూడా ఈ విధేయతలో భాగమే.

అయితే తాజాగా పవన్ కల్యాణ్ గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామక ప్రక్రియపై తనదైన శైలిలో ట్వీట్లు పెడుతున్నారు. ఎంక్వయిరీ వేయాలని, నిజాలు నిగ్గు తేల్చాలని, ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో లోపాలున్నాయని ఏ నిరుద్యోగీ రోడ్డెక్కలేదు, కేవలం టీడీపీ ప్రేరేపిత, టీడీపీ-బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు మాత్రమే ఆందోళనలతో హడావిడి చేస్తున్నాయి. ఇవన్నీ చూసి పవన్ కల్యాణ్ కూడా ఏదో జరిగిపోతోందని భ్రమ పడుతున్నారు. అందుకే ఆయన కూడా స్పందించారు. ఏవేవో ట్వీట్స్ పెట్టేశారు.

ఇవన్నీ బాబు సూచనల మేరకే జరిగాయనే విషయం ఆ ట్వీట్స్ చూస్తేనే తెలుస్తోంది. ఎందుకంటే.. అవి చూస్తుంటే అచ్చం చంద్రబాబే గుర్తొస్తున్నారు మరి. కాకపోతే బాబు సీబీఐ ఎంక్వయిరీ కోరితే, జనసేనాని ఓన్లీ ఎంక్వయిరీతో సరిపెట్టారు. ఉద్యోగాలన్నీ అధికార పార్టీ నేతలు చెప్పినవారికే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్. పేపర్ లీకేజీపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఇలా పూర్తిగా చంద్రబాబుకి జిరాక్స్ లా మారారు పవన్ కల్యాణ్. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటే, అయితే ఆ విమర్శలు తమ పరువు తీసేలా ఉండకూడదనే విషయాన్ని మాత్రం పవన్ కల్యాణ్ గ్రహించాలి.

యెల్లో మీడియా ఉచ్చులో పడి పవన్ కూడా అదే నిజమనే భ్రమలో ఉన్నారు. చంద్రబాబు లేవనెత్తిన అంశాల్నే తిరిగి పవన్ కల్యాణ్ కూడా హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ ఇలా పసలేని ఆరోపణలు చేస్తే.. పాతికేళ్లు కాదు కదా.. యాభై ఏళ్లు వేచి చూసినా ప్రజాబలం సంపాదించలేరు. అసలే యువత మద్దతు ఎక్కువగా ఉందని ప్రతిసారి చెప్పుకుంటారు జనసేన. నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం చేస్తే ఆ యువతే ఆయనకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది.

రివర్స్ టెండరింగ్కు మరో ప్రాజెక్టు సిద్ధం…!

0

పోలవరం రివర్స్ టెండరింగ్ తో తొలి విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం మరో ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. పోలవరం రివర్స్ టెండరింగ్ తో దాదాపు రూ. 58 కోట్లు ఆదా చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రతిపక్షాల నోరు మూసి – ప్రపంచానికి చంద్రబాబు అవినీతి ఎలా?ఉందో కళ్ళకు కట్టినట్లుగా చూపిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో మరో ముందడు వేస్తోంది. కేంద్రం అడ్డు చెప్పినా – హైకోర్టులో పిటిషన్లు వేసినా దూకుడుగా ముందుకెళ్ళి ఫలితాలు సాధించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నివ్వెర పరిచింది.

దీంతో ఇదే ఊపులో ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. నిపుణుల కమిటీ సూచన మేరకు వెలిగొండ పనులకు తాజాగా 553.13 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. వెలిగొండ ప్రాజెక్టు పనులను మాజీ సీఎం చంద్రబాబు బినామీగా చెపుతున్న ఏపీ ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ సంస్థకు గత ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పనుల నుంచి రిత్విక్ ని తప్పించింది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.

ఈ ప్రాజెక్టు టన్నెల్ టెండర్లలో అవినీతి జరిగిందని రూ. 300 కోట్లకు పైగా కమీషన్ల రూపంలో తరలించారనే ఆరోపణలున్నాయి. దీంతో సీఎం జగన్ సర్కార్ రెండో టన్నెల్ పనులకు గాను రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించింది. వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్ లను స్వీకరించనుంది. బిడ్ ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది. అక్టోబర్ 11న బిడ్ – అదే రోజున మధ్యాహ్నం 2. 45 గంటలకు ఈ వేలం నిర్వహించనుంది.

ఈ ప్రాజెక్టులో కూడా సీఎం జగన్ సర్కారు ఇంతకు ముందుకన్నా తక్కువ ధరకు టెండర్ నిర్వహిస్తే ఇక జగన్ సర్కారుకు తిరుగే ఉండదు. ఎందుకంటే సర్కారు సొమ్మును అప్పనంగా దోచిపెట్టడం పాలకులకు అలవాటే. అయితే అవినీతిని రూపుమాపేందుకు ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ కు పోయి ప్రజాధనం ఆదా చేయడం అంటే గొప్పగా చెప్పుకోవాల్సిందే. జగన్ కు అనుభవం లేని పాలన అంటూ విమర్శలు గుప్పించే ప్రతిపక్ష నేతలకు ఈ రివర్స్ టెండరింగ్ తో పెద్ద గుణపాఠమే నేర్పుతున్నారు జగన్.

టీడీపీ నేత శివప్రసాద్ మృతితో వైసీపీ మంత్రి భావోద్వేగం – కన్నీళ్లు

0

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి పార్టీలకు అతీతంగా నాయకులు నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వైకాపా నేత – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శివప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఆయన – శివప్రసాద్ విలక్షణ రాజకీయ నాయకుడని ప్రతిభగల నటుడని అన్నారు. శివప్రసాద్ తో తనకున్న సంబంధం రాజకీయాలకు అతీతమైనదంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

శివప్రసాద్ అకాల మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని – ఆయన ఆత్మకు శాంతి చేరుకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు. తనను శివప్రసాద్ అన్నయ్యా అంటూ ప్రేమతో పలకరించేవారని – అటువంటి మిత్రుడిని తాను కోల్పోయానని అన్నారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు.

కాగా శివప్రసాద్ అంత్యక్రియలు నేడు చంద్రగిరి సమీపంలోని అగరాలలో జరగనున్నాయి. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్ తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసంతో ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం తరువాత అంతిమయాత్ర చేపడతారు.

శివప్రసాద్ కు పార్టీలకు అతీతంగా మిత్రులు ఉండడంతో ఆయన మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల నేతలూ సంతాపంవ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ శివప్రసాద్ కు మంచి సంబంధాలు ఉండడంతో రాజశేఖరరెడ్డి అనుచరులు – రాయలసీమ నేతలందరికీ శివప్రసాద్ సుపరిచితులే. ఆ కారణంగానే ఇప్పటికే పలువురు నేతలు చెన్నై వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి వచ్చారు. ఈ రోజు తిరుపతిలోని ఆయన నివాసానికి మిగతా నేతలు వెళ్లనున్నారు.