ఏపిలో ప్లాటినమ్ ప్లేట్లో జగన్ కు అధికారం..!!
ముఖ్యమంత్రికి తేల్చి చెప్పిన ప్రధాని..!! అసలు కారణం ఇదే..!!
ఏపిలో అధికారాన్ని ప్లాటినమ్ ప్లేట్లో పెట్టి జగన్ కు అందించినట్లే….ఈ మాట అన్నది వైసిపి నేతో..టిడిపి నాయకుడో కాదు . రాజకీయ విశ్లేషకులు కాదు. ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన సమయంలో టిడిపి అధినేతతో నేరుగా..స్పష్టంగా చెప్పిన మాట ఇది. అయితే, ఎన్డీఏతో ఉంటేనే జగన్ కు అవకాశం ఇచ్చిన వాడినవుతానని చంద్రబాబు బదులిచ్చారు…ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరోసారి తన కొత్త పలుకులో స్పష్టం చేసారు. 2014 ఎన్నికల్లో మోదీ-పవన్ సహకారం కారణంగానే టిడిపి అధికారంలోకి వచ్చిందని అనేక మంది అప్పట్లోనే విశ్లేషణ చేసారు.
ఇక, మోదీ ఈ వ్యాఖ్యలు చేయటం సాదా సీదాగా చేసినవి గా చూడకూడదనే వాదన వినిపిస్తోంది. జగన్ పాదయాత్ర స్పందన..ఏపి లో టిడిపి పాలన పైనా కేంద్రనిఘా సంస్థలు..స్వతంత్ర సర్వే సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు తమ కు కావాల్సిన సమాచారం తెప్పించుకుంటున్నారు. వారిచ్చిన నివేదికల ఆధారంగానే మోదీ..చంద్రబాబును హెచ్చిరిం చారనే అభిప్రాయం వినిపస్తోంది. అయితే, మొత్తం నెపాలను కేంద్రం పైకి నెట్టేయటం..బిజెపి తో వైసిపికి లింకు అంట కట్టటం ద్వారా రాజకీయంగా లబ్ది పొందవచ్చని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మోదీతో శత్రుత్వాన్ని పెంచుకోవటం ద్వారా రాజకీయంగా లాభించవచ్చని..కానీ, .మరోసారి మోదీ ప్రధానిగా అయతే పరిస్థితి ఏంటనే ఆలోచన చంద్రబాబు చేయటం లేదనే భావన కొత్త పలుకులో కనిపించింది.
మోదీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రారనే భావనలో చంద్రబాబు ఉన్నారని రాధాకృష్ణ విశ్లేషించారు. నీతి అయోగ్ సమా వేశంలో ప్రధాని మోదీ..చంద్రబాబు భుజం పై గట్టిగ చరిచారట..! మోదీ చరచటం వలన తన భుజం పై మంట పుట్టింద ని..దీన్ని బట్టి మోదీకి తనపై ఎంత కోపం ఉందో తెలుస్తుందని చంద్రబాబు పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానించారని ఆర్కే రాసుకొచ్చారు. ఇక, సాధారణ రీతిలోనే ఏపిలో చంద్రాబుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని..సరైప సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో జగన్ విఫలమవుతున్నారని విశ్లేషించారు. వైసిపి – బిజెపి మధ్య స్నేహం ఉందంటూ పరోక్షంగా టిడిపి నేతల వాదననే తన కొత్త పలుకులో చెప్పటానికి ఆర్కే ప్రయత్నించారు. దీని కారణంగా రాయలసీమ లో ముస్లింలు వైసిపికి దూరమవుతున్నారని.. ఈ నష్టాన్ని కోస్తా-ఉత్తరాంధ్రలో భర్తీ చేసుకోవాలని బిజెపి నేతలు ఇచ్చిన సల హా గా చెబుతున్నారంటూ పేర్కొన్నారు.