ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం..!
బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అనే చెప్పాలి.ఒకరకంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోడానికి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ప్రధాన కారణమని కూడా చెప్పుకోవచ్చు.అందుకే అతనంటే వైసీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన అభిమానం ఉంటుంది.అయితే ప్రశాంత్ కిషోర్ ను జగన్ తన సలహాదారుని సహా తన వ్యూహకర్తగా నియమించుకున్నప్పటి నుంచి జగన్ తన వైఖరి ఎన్నికల ప్రచార శైలి మొత్తం మార్చేశారు.దీనితో అస్సలు ఎవ్వరు ఊహించని స్థాయి విజయాన్ని జగన్ సొంతం చేసుకున్నారు.మరి జగన్ కు ఇంతటి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ మరియు అతని ఐప్యాక్ టీమ్ ఇప్పుడు మరో సంచలన వ్యక్తికి వ్యూహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారట.ఇతను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ పార్టీ అధినేత అయినటువంటి మమతా బెనర్జీకి వ్యూహకర్తగా నియమించబడినట్టు తెలుస్తుంది.
రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ నుంచి తన పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు మమతా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే మమతా మరియు ప్రశాంత్ కిషోర్ లు నబన్న రాష్ట్ర సెక్రటరియేట్ లోని కలుసుకున్నారు.అక్కడ దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆమెకు తాను మరియు అతని ఐప్యాక్ టీమ్ సాయ పడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.అలాగే మమతా కూడా తనకంటూ ఒక వ్యూహకర్తను నియమించుకోడం కూడా ఇదే మొట్టమొదటి సారని రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి.మరి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ కు అఖండ విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ మరి మమతకు ఎలాంటి ఫలితాలను అందిస్తారో చూడాలి.