ప్ర‌శాంత్ కిషోర్ – దేవ్ పోటీనా – Prashanth Kishore Vs Dev

0
451

ప్ర‌శాంత్ కిషోర్ – దేవ్ పోటీనా. వైసిపి – జ‌న‌సేన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌కు తేడా ఏంటి. రాజ‌కీయ వ్యూహాల్లో ఎవ‌రి అనుభ‌వం ఎంత‌. జ‌న‌సేన రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకుంది. ఆయ‌న పేరు వాసుదేవ్‌. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆయన్ను దేవ్ అని ప‌రిచయం చేసారు. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త అన‌గానే ఆయ‌న‌ది ప్ర‌శాంత్ కిషోర్ స్థాయి లో ఉంటారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. దేవ్ సైతం త‌న‌కు తెలుగు స‌రిగా రాద‌నే విధంగా త‌న ప్ర‌సంగంలో అంగ్ల భాష‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. అనేక పార్టీల‌కు ప‌ని చేసిన అనుభ‌వం ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, దేవ్ కు 350 మంది ఉద్యోగులు ఉన్న పొలిటిక‌ల్ స్ట్రాట‌జీస్ కంపెనీ ఉంద ని ప‌వ‌న్ చెబుతున్నారు. అయితే, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ద్వారా ఈ దేవ్‌కు సంబంధించి ఆస‌క్తి క‌ర అంశాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ వాసుదేవ్ పుట్టింది, పెరిగింది అంతా హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్ ప్రాంతానికి చెందిన చింత‌ల్ బ‌స్తీ. తెలంగాణ యాసలో తెలుగు బాగానే మాట్లాడుతారు. గ‌తంలో కిష‌న్ రెడ్డి నేతృత్వంలో ఆయ‌న బిజెపిలో చేరిన‌ట్లు చెబుతున్నారు. బిజెపి నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అనేక టివి చ‌ర్చ‌ల్లో బిజెపి ప్ర‌తినిధిగా హాజ ర‌య్యారు.

2014 ఎన్నిక‌ల్లో బిజెపికి అనుకూలంగా ప్ర‌చారం చేసారు. బిజెపి లో ప‌దేళ్ల పాటు ప‌ని చేసారు. ఇప్పుడు స‌డ‌న్ గా జ‌న‌సేన వ్యూహ‌క‌ర్త‌గా తెర మీద‌కు వ‌చ్చారు. ప్ర‌శాంత్ కిషోర్ తో దేవ్ కు కొంద‌రు పోలిక పెడుతు న్నారు. ప్ర‌శాంత్ కిషోర్ వృత్తి రీత్యా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌. ఓపెన్ గానే 2014 నుండి వివిధ పార్టీల‌కు స్ట్రాట‌జిస్ట్ గా వ్య‌వ‌హ రిస్తున్నారు. 2014 లో మోదీ కి అనేక ర‌కాలుగా ప్ర‌చారానికి సూచ‌న‌లు చేస్తూ, కొత్త త‌ర‌హా క్యాంపెయినింగ్ ద్వారా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకోవ‌టా నికి స‌హ‌క‌రించారు. ఆ త‌రువాత అదే బిజెపికి వ్య‌తిరేకంగా బీహార్ లో నితీష్ విజ‌యానికి స‌హ‌కారం అందించారు. బీహార్ లో నితీష్ గెలుపొందారు. త‌రువాత పంజాబ్ లో కాంగ్రెస్ గెలుపుకు స‌హ‌కారం అందించారు. కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ కు ప్ర‌చారానికి అనేక కొత్త వ్యూహాలు అమ‌లు చేసారు. విభిన్న త‌ర‌హాలో సాగిన ప్ర‌చారం ద్వారా అమ‌రీంద‌ర్ సింగ్ పంజాబ్ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇక‌, ఉత్త‌రప్ర‌దేశ్ లో ఎస్పీకి స‌ల‌హాదారు డిగా ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హ‌రించారు. అయితే, కాంగ్రెస్ తో పొత్తు పై ప్ర‌శాంత్ కిషోర్ వ‌ద్ద‌ని చెప్పినా, అఖిలేష్ యాద‌వ్ విన‌లేదు. అక్క‌డ ఎస్పీ ఓడిపోయింది.

ఏ పార్టీకి సంబంధించి అయినా స‌ల‌హాదారుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే ముందు ఆ పార్టీ పై క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ పై అభిప్రాయ సేక‌ర‌ణ చేయ‌టం, వారికి అధికారంలోకి వ‌చ్చే అవకాశం ఉంద‌ని నిర్దారించుకున్న త‌రువాత‌నే ఆ పార్టీకి సేవ‌లిందించ‌టం ప్ర‌శాంత్ కిషోర్ తొలి నుండి అనుస‌రిస్తున్న విధానం. ఏపిలో వైసిపి కంటే ముందుగానే మ‌రోపార్టీ నేత‌లు ప్ర‌శాంత్ కిషోర్ ను క‌లిసారు. అయితే, ప్ర‌శాంత్ కిషోర్ ను వైసిపి నేత‌లు క‌లిసిన స‌మ‌యంలో, ఏపి లో వైసిపి పై ప్ర‌జాభిప్రాయం తెలుసుకున్న త‌రువాత‌నే, ఆయ‌న వైసిపి రాజ కీయ స‌ల‌హాదారుడిగా సేవ‌లు అందించ‌టం మొద‌లు పెట్టారు. రాజ‌కీయం ఓపెన్ గా ప్ర‌జ‌ల ముందే చేసే జ‌గ‌న్, పార్టీ ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌శాంత్ కిషోర్ ను పార్టీ నేత‌ల‌కు – కార్య‌కర్త‌ల‌కు ప‌రిచ‌యం చేసారు. ఏడాది కాలంగా వైసిపి తీసుకుంటున్న ప్ర‌తీకీల‌క నిర్ణ‌యం తో జ‌గ‌న్ తో పాటుగా ప్ర‌శాంత్ కిషోర్ పాత్ర ఉంది. అయితే, జ‌న‌సేన స‌ల‌హాదారుడిగా నియ‌మితులైన‌ దేవ్ మాత్రం బిజెపి పార్టీలో ప‌ని చేసిన వ్య‌క్తి. మ‌రి, జ‌న‌సేన దేవ్ ను పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా జ‌న‌సేన ను ఎలా న‌డిపిస్తార‌నేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here