రాహుల్ వర్సెస్ జగన్..!!
టార్గెట్ వైసిపి ..అంత సీన్ రాహుల్ కు ఉందా..!!
రాహుల్ టార్గెట్ జగన్. అయితే ఏంటి? ఏపి రాజకీయాల్లో కాంగ్రెస్ టార్గెట్ వైసిపి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏపి కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసిన విషయం ఇదే. టిడిపిని కాదు..వైసిపిని టార్గెట్ చేయండని దిశా నిర్ధేశం చేసారు. టిడిపి ఏ వాయిస్ అయితే వినిపిస్తుందో అదే వాయిస్ కంటిన్యూ చేయండి. టిడిపి చేస్తున్న విధంగానే…వైసిపి- బిజెపి తో చెలిమి గా ఉందంటూ ముప్పేట దాడి చేయండని రాహుల్ గాంధీ..ఏపి కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. ఇక్కడే..మరోసారి టిడిపి -కాంగ్రెస్ ఉమ్మడి లక్ష్యం ఏంటో..ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఏంటో అర్దమైపోతోంది. ఏ విధంగా అయితే 2014 లో వైసిపికి వ్యతిరేకంగా జగన్ లక్ష్యంగా అందరూ ఒక్కటయ్యారో..తిరిగి అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, అసలు..కాంగ్రెస్ కు అంత సీన్ ఉందా. ఏపిలో జగన్ ను టార్గెట్ చేయగల సత్తా ఉందా?ఇవే అసలు ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.
ఇక, కాంగ్రెస్ పై జగన్ కక్ష్య కట్టారని రాహుల్ ప్రచారం చేయమని చెబుతున్నారంటూ కధనాలు వచ్చాయి. ఎవరి మీద ఎవరు కక్ష్య కట్టారు. వైయస్ మరణం తరువాత తాను నల్లకాల్వ సాక్షిగా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్రకు అనుమతి కోరితే నిరాకరించింది ఎవరు. తాను ప్రజలకు ఇచ్చిన మాట కోసం..తన తండ్రి కోసం మరణించిన వారిని ఓదార్చాల్సిన బాధ్య త ఉందని చెప్పిన జగన్ మీద కేసులు పెట్టించెందవరు. జగన్ అరెస్ట్ తరువాత ఆయన కుటుంబ సభ్యులను వేధించింది ఎవరు. వైయస్ కుటుంబం పై కక్ష్య పూరితంగా వ్యవహరించదెవరో ఏపిలోని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషమయే. అయితే , రాహుల్ ఎక్కడా కూడా టిడిపిని లక్ష్యంగా చేసుకోమని చెప్పకుండా..కేవలం జగన్ పైనే విమర్శలు చేయటం..అందునా మన టార్గెట్ వైసిపి ని తేల్చి చెప్పటం ఏపిలో మారుతున్న రాజకీయ సమీకరణాలను స్పష్టం చేస్తోంది. వైయస్ ను – జగన్ ను వేర్వేరుగా చూపిస్తూ..జగన్ ఇమేజ్ ను డామేజ్ చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతల వ్యూహం కనిపిస్తోంది. ఫలితంగా టిడిపికి మేలు చేయటమే అందులోని పరమార్ధం అనే విషయం స్పష్టమవుతోంది. నిజంగా ఏపిలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ ను ఎదుర్కోవటం కాంగ్రెస్ కు సాధ్యమయ్యే పనేనా..నేరుగా రాహుల్ రంగంలోకి దిగినా..జగన్ సత్తాను అడ్డుకనే శక్తి ఉందా..ఏపి ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు…రాహుల్ పగటి కలలు కంటున్నారా.. రాహుల్ వర్సెస్ జగన్ అనే పరిస్థితి వస్తే….ఏపి రాజకీయాల్లో ఏం జరుగుతుంది..