ఆ సర్వే తేల్చింది ఇదే..
సర్వే వెనుక వాస్తవం ఇదేనా..!!
ఆ సర్వే వాస్తవ రిపోర్ట్ ఏంటి. టిడిపి కి కొత్త టానిక్. జగన్ జనాదరణ ఏం ప్రభావం చూపించటం లేదని టిడిపి కేడర్ లో భరోసా నింపాలి. అంతే..వెంటనే అనుకూల సర్వేలు వచ్చేస్తాయి. టిడిపి నేతలే నమ్మలేని వాస్తవాలు ఆ సర్వేలో వండి వార్చేస్తారు. ఇప్పటికిప్పుడు ఏపిలో ఎన్నికలొస్తే ఏం జరుగుతోంది…అంటూ ఆంధ్రజ్యోతి -ఆర్జీస్ ఫ్లాష్ టీం సర్వే ఒకటి ప్రచురించారు. వారి సర్వే ప్రకారమే చూసినా..ఈ సర్వేలో కొన్ని సందేహాలు నివృత్తి కావాల్సిన అవసరం కనిపిస్తోంది. తాజాగా ఆర్జీస్ ఫ్లాష్ టీం చేసిన సర్వే ఏపిలో 19 నియోజకవర్గాల్లో చేసామని చెబుతున్నారు. ఎన్ని శాంపిల్స్ సేకరించింది స్పష్టత ఇవ్వలేదు. సర్వే చేసిన అన్ని నియోజకవర్గాల పేర్లు ఇవ్వలేదు.
పాదయాత్ర ప్రభావం లేదని చెప్పే ప్రయత్నం చేసారు. అదే సమయంలో ప్రస్తుతం పాదయాత్ర సాగుతున్న తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, రాజమండ్రి లో వైసిపి కి అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ రెండు సిట్టింగ్‌లు వైసిపివి కావు. ఇక, ఓట్లు యధాతధం అంటూనే సీట్లలో మాత్రం టిడిపికి అదనంగా మరో ఎనిమిది వస్తాయని వివరించారు. కానీ, రెండు పార్టీల మధ్య ఓట్ల వృత్యాసం ఏడు శాతం అంటూనే జనసేనకు 8.9 శాతం మంది జై కొట్టారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారం-ప్రతిపక్షం మధ్య ఓట్ల తేడా కేవలం 1.95 శాతం. ఇక, బిజెపి పై ఉన్న వ్యతిరేకత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో..గతంలో 2016 నవంబర 29న ఇదే ఆంధ్రజ్యోతి-ఆర్జీస్ ఫ్లాష్ టీం ప్రచురించిన సర్వేను గుర్తు చేసుకోవాలి. అప్పుడు టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే టిడిపికి 46.47 శాతం ఓట్లతో 140 సీట్లు వస్తాయని నాడు పేర్కొంది. అదే సర్వేలో వైసిపికి 35.91 శాతం ఓట్లతో 30 సీట్లు వస్తాయని నాడు తేల్చింది. మరి.. అప్పటి కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగెందవరికి. గతంలో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఓట్ల శాతం 46.47 కాగా, ఇప్పుటి సర్వేలో వచ్చింది 44.04 శాతం. అంటే టిడిపి ఓటింగ్ శాతం తగ్గిందని సర్వేనే తేల్చింది. ఇక, నాటి సర్వేలో వైసిపికి 35.91 శాతం గా ఓటింగ్ శాతం నేటి సర్వేలో 37.46 శాతానికి పెరిగింది. మరి..ఎవరి ఓటింగ్ శాతం పెరిగినట్లు. ఇక, నాడు జనసేనకు 3.86 శాతంగా ఉన్న ఓట్ల శాతం..ఇప్పుడు 8.90 శాతానికి పెరిగిందని తేల్చారు. ఇదే ఆంధ్రజ్యోతి-ఆర్జీస్ ఫ్లాష్ టీం 2016 నవంబర్ లో చేసిన సర్వే..తాజా సర్వే మధ్య తేడా చూస్తే..ఇటువంటి సందేహాలు రాక మానవు. దీనిని లోతుగా పరిశీలి స్తే..అసలు జరుగుతుంది ఏంటో ఇట్టే అర్దమైపోతుతంది. ఇక, ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. మరి..నిజంగా ప్రజల్లో అంతగా బలం ఉంటే..ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలకు..ఉప ఎన్నికలకు ఇంత కాలంగా అధికార పార్టీ ఎందుకు వెనుకాడుతుందో అర్దం కాని విషయం. ఇక, ఈ సర్వేను లోతుగా అధ్యయనం చేసిన ప్రతీ ఒక్కరు దీని పై కామెంట్ల రూపం లో స్పందించండి..