సీన్ రివర్స్..దెబ్బ‌కు దెబ్బ‌. 2014 కు ప్ర‌తీకారం 2019 – Sean Rivers Revenge for 2014 is 2019 Elections

0
445

సీన్ రివర్స్..దెబ్బ‌కు దెబ్బ‌. 2014 కు ప్ర‌తీకారం 2019

దెబ్బ‌కు దెబ్బ‌. 2014 కు ప్ర‌తీకారం 2019. నాడు రాజ‌కీయంగా ఉమ్మ‌డి ప్ర‌త్య‌ర్ధి వైసిపి అధినేత జ‌గ‌న్‌. నేడు అంద‌రికీ రాజ‌కీయంగా టార్గెట్ టిడిపి అధినేత చంద్ర‌బాబు. నాడు జ‌గ‌న్ అధికారంలోకి రాకూడ‌దు. చంద్ర‌బాబు సీయం అవ్వాలి. ఇదే ల‌క్ష్యంతో అనేక స‌మీక‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. నేడు ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. అదే స‌మ‌యం లో ల‌క్ష్యం సైతం మారిపోయింది. నాడు టిడిపి కి మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌..బిజెపి లు నేడు టిడిపి కి ప్ర‌త్య‌ర్ధులుగా మారిపోయారు. నాడు చంద్ర‌బాబు కోసం జ‌గ‌న్ ను విమ‌ర్శించిన వారే నేడు చంద్ర‌బాబు కంటే బెట‌ర్ అంటున్నారు.  నాడు జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ఉన్న వారంద‌రినీ టిడిపి అక్కున చేర్చుకుంది. నేడు అదే చంద్రబాబుకు వ్య‌తిరేకంగా మారు తున్న‌వారంతా జ‌గ‌న్ కు జై కొడుతున్నారు. .కానీ, .అప్పుడూ..ఇప్పుడూ తేడా ఒక్క‌టే. జ‌గ‌న్ అవ‌కా శ‌వాద రాజ‌కీయాలు చేయ‌లేదు. ప్రోత్స‌హించ‌లేదు. 2014 ఎన్నిక‌ల ముందు స‌బ్బం హ‌రి జ‌గన్ కు వ్య‌తిరేకంగా మాట్లాడారు. వెంట‌నే టిడిపి నేత‌లు ఆయ‌న్ను విశాఖ లో విజ‌య‌మ్మ ప‌రాజ‌యానికి పావుగా వాడుకున్నారు. ఇప్పుడు తెలంగాణ నేత మోత్కుప‌ల్లి టిడిపి అధినేతకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. జ‌గ‌న్ పాద‌యాత్ర లో సైతం పాల్గొని మ‌ద్ద‌తిస్తానని ప్ర‌క‌టించారు.

ఏ ప‌వ‌న్ క‌ళ్యాన్ అయితే జ‌గ‌న్ పై 2014 లో ఆరోప‌ణ‌లు చేసారో..ఇప్పుడు వాస్త‌వాలు తెలుసుకొని చంద్ర‌బాబు క్యాంపు అవినీతి పై ఫైర్ అవుతున్నారు. ఇక‌, బిజెపి నేత‌లు సైతం గ‌తంలో చంద్ర‌బాబు ను ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు అస‌లు విష‌యం బోధ‌ప‌డిన త‌రువాత టిడిపి ప్ర‌భుత్వంలో అవినీతి పై మాట్లాడుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే సమ‌ర‌శంఖం పూరించారు. సామాజిక స‌మీక‌ర‌ణాల్లో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. అమ‌లు చేసే అవ‌కాశం ఉన్న హామీల‌నే ప్ర‌క‌టిస్తూ వాటిని ఏ ర‌కంగా అమ‌లు చేసేదీ వివ‌రిస్తున్నారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ..ఓపిక తో అంద‌రి బాధ‌లు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా 2014 కు దెబ్బ దెబ్బ తీయాల‌నేది జ‌గ‌న్ ల‌క్ష్యం. అందులో భాగం గానే అడుగులు ప‌డుతున్నాయి. ఏనాడు ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌ని టిడిపి..ఈ సారి దాదాపు ఒంట‌రి పోరుకే దిగాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంఇ. అయితే, బ‌హుముఖ పోరులో త‌మ‌కు క‌లిసి వ‌స్తుందనే అంచ‌నాలు వేస్తోంది. కానీ, త‌న ఓటు బ్యాంకు తో పాటుగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును వైసిపి న‌మ్ముకుంటుంది. అయితే, పోల్ అండ్ పొలిటిక‌ల్ మేనేజ్ మెంట్ లో మాత్రం వైసిపి అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. అదే జ‌రిగితే..ఇక జ‌గ‌న్ ల‌క్ష్యం ఎంతో దూరంలో లేద‌నేచెప్పుకోవాలి. అందుకు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వ‌స్తున్న శుభ సూచిక‌లే కార‌ణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here