అఖిల ప్రియ కు ఎవరిని చూసి ఇంత ధైర్యం – Severe Rift Between Akhila Priya and AV Subba Reddy

0
579

టిడిపిలో వారిద్ద‌రిలో ఉండేది ఒక‌రే. మంత్రి అఖిల ప్రియా, ఏవి సుబ్బారెడ్డి. ఈ ఇద్ద‌రిలో టిడిపి లో ఉండేదెవ‌రు. పార్టీ ని వీడేదెవ‌రు. ఇప్పుడు ఇదే కర్నూలు తో పాటుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గంలో ఈ ఇద్దరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ప‌తాక స్థాయికి చేరింది. ముఖ్య‌మంత్రి వ‌ద్ద గ‌తంలోనే రాజీ స‌మావేశం జ‌రిగింది. తాజాగా, ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏవి సుబ్బారెడ్డి పై రాళ్ల దాడి జ‌రిగిన త‌రువాత ముఖ్య‌మంత్రి త‌న వద్ద‌కు రావాల్సిందిగా ఇద్ద‌రి కి స‌మాచారం పంపారు. కానీ, అఖిల ప్రియ హాజ‌రు కాలేదు. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు వెళ్లక అఖిల‌కు త‌ప్ప‌లేదు. అదే స‌మావేశానికి ఏవి సుబ్బారెడ్డి సైతం వ‌చ్చారు. త‌న పై జ‌రిగిన రాళ్ల దాడితో త‌న‌కు భూమా కుటుంబం తో స‌త్సం బంధాలు ఇక లేన‌ట్టేన‌ని ఏవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పేసారు.

అఖిల ప్రియ గురించి మాట్లాడ‌టానికి పెద్ద‌రికం అడ్డు వ స్తోంద‌ని ఏవి అంటున్నారు. ఇక, అఖిల సోద‌రి మౌనిక ఏవి సుబ్బారెడ్డికి హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. తాము భూమా వార సుల‌మ‌ని త‌మ కుటుంబం అంతా అఖిల‌కు అండ‌గా ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. ఏవి సుబ్బారెడ్డి రాజీక‌యంగా ఎద గాల‌నుకుంటే తాము స‌హ‌క‌రిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇక‌, ఆళ్ల‌గ‌డ్డ‌లో సైతం టిడిపి శ్రేణులు ఈ ఇద్దరికి మ‌ద్ద‌తు దారులు గా రెండు వ‌ర్గాలుగా క‌నిపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా పోటీ చేయాల‌నేది ఏవి సుబ్బారెడ్డి ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఆళ్ల‌గ‌డ్డ లేదా నంద్యాల నుండి పోటీ చేయాల‌నేద ఆయ‌న ల‌క్ష్యంగా ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు అఖిల కు స్థానికంగా ఉన్న నేత‌ల‌తో పొస‌గ‌టం లేదు.

పార్టీ నేత‌ల‌తో అఖిల తీరు పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వారు ముఖ్య‌మంత్రి వ‌ద్దే ఈ విష‌యం తేల్చుకుంటామ‌ని చెబుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఏవి సుబ్బారెడ్డిని సైకిల్ యాత్ర‌కు ఎలా అనుమ‌తి ఇస్తార‌ని, అస‌లు ఆళ్ల‌గ‌డ్డ పార్టీ స‌మావేశానికి ఏవి సుబ్బారెడ్డిని ఎందుకు ఆహ్వానిస్తున్నార‌ని అఖిల కుటుంబ స‌భ్యులు పార్టీ నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. టిడిపి లో మాత్రం అఖిల పై అంత సానుకూల‌త క‌నిపించ‌టం లేదు. దీంతో ఈ ఇద్ద‌రి పోరులో ఖచ్చితంగా ఎవ‌రో ఒక‌రే టిడిపిలో ఉండే ప‌రిస్థితి కనిపిస్తోంది. ముఖ్య‌మంత్రి సైతం ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త కుదిర్చే ప‌రిస్తితులు క‌నిపించ‌టం లేదు. పార్టీ అధినేత స్థాయిలో ఆయ‌న సూచ‌న‌లు ప‌ట్టించుకొనే ప‌రిస్థితులు ఆళ్ల‌గ‌డ్డ‌లో లేవు. ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరు నియంత్రించ‌లేని స్థాయిలో చేరింది. ఇద్ద‌రిలో ఎవ‌రి పైనా చ‌ర్య‌లు తీసుకొనే ప‌రిస్థితుల్లో టిడిపి అధినాయ‌క‌త్వం సైతం లేదు. దీంతో..త్వ‌ర‌లోనే ఆళ్ల‌గ‌డ్డ టిడిపిలో అస‌మ్మ‌తి కుంప‌టి కొత్త రాజ‌కీమ స‌మీక‌ర‌ణాల‌కు కార‌ణం అయ్యే ప‌రిస్థితులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here