టిడిపి మహానాడు సంబరాల్లో ఉంటే..ఓ షాకింగ్ న్యూస్ పచ్చ శిబిరాన్ని కలవరపెడుతోంది. ఆ వార్తను సైతం టిడిపికి మద్దతుగా నిలిచే ఓ ప్రధాన పత్రిక బిజెపికి అనుకూలంగా రాస్తే..మరో పత్రిక మోదీ వద్దే వద్దు అనే శీర్షికతో టిడిపి శ్రేణుల్లో ఆ ప్రభావం పడకుండా ప్రయత్నాలు చేసింది. దేశంలో పేరున్న ఏబీపీ-సీఎస్‌డీఎస్ చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్.. సర్వేలో ఎన్డీయే వైపు మొగ్గు ఉన్నట్టుగా తేలింది. ఎన్డీఏ కూటమి 274 ఎంపీ సీట్లను సొంతం చేసుకోగలదని సర్వే తేల్చి చెప్పింది. అయితే, ఇది కేవలం బిజెపి కాకుండా..ఎన్డీఏ కూటమి సాధించే సీట్లుగా స్పష్టం చేసింది. ఇక యూపీఏ కూటమిలో భాగస్వామ్యులు అయిన పార్టీలు కలిసి 164సీట్లను సంపాదించగలవని ఈ సర్వే అంచనా వేసింది. ఇక యూపీ యేతర, ఎన్డీయేతర పార్టీలుగా ఉన్నవి 105సీట్లను సొంతం చేసుకోగలవని ఈ సర్వే అభిప్రాయపడింది. ఎన్డీఏ నుండి శివసేన, టిడిపీ లు బయటకు వచ్చిన తరువాత చేసిన సర్వే ఇది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తేల్చారు. దక్షిణాది లో ఉన్న 132 సీట్లలో ఎన్డీఏకి 18-22, యూపిఏ కి 67-75, ఇతరలకు 38-44 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే, తృణమూల్, ఎస్పీ, బిఎస్పీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు కాంగ్రెస్ తో జత కడుతాయో లేక, థర్డ్ ఫ్రంట్ అంటూ కలుస్తాయో చెప్పలేని పరిస్థితి. టిఆర్‌యస్, టిడిపి లదీ అదే పరిస్థితి. ఇక, యూపి లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయగలవా అనేది పూర్తిగా తేలాల్సిన విషయం. ఇప్పటికే మోదీ పై తీవ్ర వ్యతిరేకత ఉం దని టిడిపి నేతలు భారీ ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లొ తిరిగి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాదనే నమ్మకం తో టిడిపి నేతలు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. కానీ, తాజా సర్వేలో ఎన్డీఏకు 37 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఇంకా ఎన్నికలకు దాదాపు సంవత్సర కాలం ఉండటంతో పాటుగా..ఈ నాలుగేళ్ల పాలన ఆధారంగా సర్వే చేసినట్లు స్పష్టం చేసారు. దీంతో..రాజీకయ సమీకరణాలు మరింతగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ సర్వే టిడిపి పై ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
మహానాడు వేడుకల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఈ సర్వే బిజెపికి అను కూలంగా ఉందనే వార్తను ఈనాడు ప్రాధాన్యత లేకుండా చివరి పేజీలో ప్రచురించింది. ఇక, ఆంధ్రజ్యోతి ఈ సర్వే వార్త నే పూర్తిగా బిజెపికి వ్యతిరేకంగా ఉందనే భావన కలిగించేలా మళ్లీ మోదీ వద్దే వద్దు అంటూ బ్యానర్ కధనాన్ని ప్రచురించింది. ఇదే సమయంలో తమ కధనంలో సీట్ల గెలుపు అంచనాలను సైతం జాగ్రత్తగా పేర్కొంది. అయితే, కర్నాటకలో బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం..రాజీనామా వరకు నోరు మెదపని టిడిపి నేతలు..యడ్యూరప్ప రాజీనామా తరు వాత తమ కారణంగానే కర్నాటకలో బిజెపి ఓడిపోయిందనే ప్రచారం మొదలు పెట్టారు. నిజంగా అక్కడ ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక, వచ్చే ఎన్నికల్లో బిజెపికి అడ్రస్ ఉండదని భావించిన టిడిపి నేతలకు..ఇప్పుడు ఈ సర్వే వార్త నిజంగా షాకింగ్ న్యూసే