రామోజీ తో అమిత్ షా ఆకస్మిక భేటీ..!!
అసలు లక్ష్యం నెరవేరేనా..!!
టిడిపి కి మద్దతు లేకుండా చేయటమే అమిత్ షా లక్ష్యమా. అదే జరిగితే టిడిపి పరిస్థితి ఏంట. రాజకీయంగా నష్ట పోవా ల్సిందేనా. బిజెపి చీఫ్ అమిత్ షా ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుతో ఎందుకు భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ఏ అంశాలు చ ర్చకు వచ్చాయి. ముందస్తు ఎన్నికలు ఖాయం అనుకుంటున్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబుకు మద్దతుగా నిలిచే రామోజీతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవ్వటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా ఎన్డీఏ సారథ్యంలోని బీజేపీ సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తు న్న`సంపర్క్ ఫర్ సమర్థన్` ప్రచార పర్వంలో భాగంగా ఈ భేటీ జరుగుతుందని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే, రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన అమిత్ షా ఏ వ్యూహం లేకుండా రామోజీ నివాసానికి వెళ్లరనే చర్చ జరుగుతోంది. ఏపి – తెలంగాణల్లో రెండు ప్రభుత్వాలకు ఈనాడు అండగా నిలుస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కంటే ఏపిలో తాము ఎంత చేసినా టిడిపి కే ఎక్కువగా ప్రచారం లభిస్తుందనే భావన లో బిజెపి నేతలు ఉన్నారు. గతంలో గుజరాత్ లో ఈ టివి గ్రూపు బిజెపి కే మద్దతుగా నిలిచింది. ఇప్పుడు ఏపి – తెలంగాణల్లో సైతం బిజెపి అదే రకమైన మద్దతు కోరుకుంటోంది. ముఖ్యంగా ఏపిలో టిడిపికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న రామోజీరావు ను తమ వైపు తిప్పుకొనేందుకు అమిత్ షా ఈ భేటీ ఎంచుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అమిత్ షా తమకు సహకరించమని కోరితే చంద్రబాబు ను కాదని బిజెపికి రామోజీ సహకరించే పరిస్థితులు ఉన్నాయా అనేదే ఇప్పు డు హాట్ టాపిక్. టిడిపి కి అండగా నిలిచే పత్రికల్లో మరకొటి ఆంధ్రజ్యోతి. అయితే, బిజెపి నేతలు తన మీద దృష్టి సారిం చారని స్వయంగ ఆంధ్రజ్యోతి ఎండీ తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. ఇక, ఈనాడు వద్దకు ఇప్పుడు స్వయంగా బిజెపి జాతీయాధ్యక్షుడి హోదా లో అమిత్ షా వెళ్లటంతో టిడిపి శిబిరంలో ఆందోళన మొదలైంది. గతంలో వైసిపి అధినేత జగ న్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలిసిన సమయంలో టిడిపి వర్గాలు టెన్షన్ పడ్డాయి. అయితే, బిజెపికి అనేక సంద ర్భాల్లో మీడియా పరంగా అండగా నిలిచిన ఈనాడు గ్రూపు ఇప్పుడు ఏపి లో మాత్రం అమిత్ షా కోరితే ఆ విధంగా సహక రించటానికి సిద్దపడుతుందా అంటే ప్రధా