స్వామి రంగంలోకి దిగారు..
ఇక ఊచలు లెక్క పెట్టాల్సిందే.
ఆయన రంగంలోకి దిగితే ఎంత పెద్దవారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఇప్పుడు ఆ వ్యక్తే తిరుమల తిరుపతి దవేస్థానం వివాదం ..రమణ దీక్షితులు తొలిగింపు పై సుప్రీం కు వెళ్తానని ట్వీట్ చేసారు. దీంతో పాటుగా మొత్తం వ్యవహారం పై సిబిఐ విచారణ కోరుతానని స్పష్టం చేసారు. తమిళనాడు కు చెందిన సుబ్రమణ్య స్వామి స్వతహాగా న్యాయవాది. ఆయన ఏ అంశం టేకప్ చేసినా..అది దేశ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అన్నా డిఎంకె అధినేత్రి..తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తులపై కేసు దాఖలు చేసింది ఇదే సుబ్రమణ్య స్వామి. ఆ కేసు అనేక సంవత్సారాల పాటు కోర్టులో విచారణ జరిగింది. ఇదే కేసులో జయలలిత-శశికళ ఇద్దరూ జైలు శిక్ష అనుభవించారు. ముఖ్యమంత్రి పదవిని తాత్కాలికంగా జయలలిత వదులుకోవాల్సి వచ్చింది ఈ సుబ్రమణ్య స్వామి కారణంగానే. ఇక, బీహార్ ముఖ్యనేత లాలూ ప్రసాద్ యాదవ్ పై గడ్డి స్కాం కేసు దాఖలు చేసింది.. సిబిఐ విచారణకు వచ్చేలా చేసింది ఇదే సుబ్రమణ్య స్వామి . సుబ్రమణ్య స్వామి వెంట పడి మరీ ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు పదవీ గండంతో పాటుగా జైలు శిక్షకు కారణం అయ్యారు.
ప్రస్తుతం లాలు జైళ్లో ఉంది కూడా ఇదే కేసులో. ఇక, వీరినే కాదు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రిని సైతం కోర్టు మెట్లు ఎక్కించిని ఘనత సుబ్రమణ్య స్వామిదే. నేషనల్ హెరాల్డ్ కేసు దాఖలు చేసిన సుబ్రమణ్య స్వామి సోనియా కుటుంబం పై అభియోగాలు దాఖలు చేసారు. అవి విచారణ కోసం సోనియా తో పాటు రాహుల్ సైతం పాటియాలా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పటికే కేంద్రం ఏ రకంగా తమపై విరుచుకు పడుతుందో అనే టెన్షన్ తో ఉన్న టిడిపి ప్రభుత్వ ముఖ్యులను సుబ్రమణ్య స్వామి మరింత టెన్షన్ కు గురి చేస్తూ ట్వీట్ చేసారు. రమణ దీక్షితులు తొలిగింపు పై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తేల్చి చెప్పారు. అదే సమయంలో టిటిడి చేసిన అధికార దుర్వినియోగం పైనా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తానని కుండ బద్దలు కొట్టారు. ఇదే వ్యవహారం ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని పై రమణ దీక్షితులు సైతం ఆమరణ నిరాహార దీక్షకు సిద్దం అవుతున్నారు. కాగా, బిజెపి ఎంపి..అందునా సుబ్రమణ్య స్వామి.. ఇప్పుడు న్న పరిస్థితుల్లో ట్వీట్ చేసిన విధంగా రంగంలోకి దిగితే..తమకు తిప్పలు తప్పవని టిడిపి నేతలకు అర్దమైంది. దీంతో.. ఇక సుబ్రమణ్య స్వామి ఏ రకంగా ముందుకు వెళ్తారో…టిటిడి తో పాటుగా ప్రభుత్వం పై ఎటువంటి ప్రభావం పడుతుందో అనే టెన్షన్ మొదలైంది.