జగన్ పాదయాత్ర పై కృష్ణ ఇలా స్పందించారేమిటి – Super Star Krishna Comments on Jagan Padayatra

0
463

రియ‌ల్ హీరో కు సూప‌ర్ స్టార్ సూప‌ర్ స‌పోర్ట్‌. ఏపికి కాబోయే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. ఇది జ‌గ‌న్ అభిమానులో..వైసిపి కార్య‌క ర్త లో చెబుతున్న విష‌యం కాదు. సినీ సూప‌ర్ స్టార్ గానే కాదు.. రాజ‌కీయంగానూ రాణించిన హీరో కృష్ణ మ‌నోసులోని మాట‌. ఆయ‌న సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరి రావు వైసిపి లో ఉన్నారు. అల్లుడు గ‌ళ్లా జ‌య‌దేవ్ టిడిపిలో ఉన్నారు. వారితో త‌న అభిప్రాయానికి సంబంధం లేద‌ని జ‌గ‌న్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అని కృష్ణ అభివ‌ర్ణించారు.

జ‌గ‌న్ ను అభినం ద‌న‌ల‌తో ముంచెత్తారు. జ‌గ‌న్ ఏ మారుమూల స‌భ ఏర్పాటు చేసినా..ఇసుకేస్తే రాల‌నంత మంది జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని..ఆ ఆద‌ర‌ణ చూస్తుంటే ముచ్చటేస్తోంద‌ని కృష్ణ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ట్రెండ్ చూస్తుంటే ఈ సారి జ‌గ‌న్ వ‌చ్చేట‌ట్టు న్నార‌ని కృష్ణ అంటున్నారు.  జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నార‌ని..జ‌నం బాగా రిసీవ్ చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ బాగా క‌ష్ట‌ప‌డు తున్నారు..మే నెల ఎండ‌ల‌ల్లో ఇన్ని రోజులు న‌డ‌వ‌టం..ప్ర‌జ‌ల కోసం కష్ట‌ప‌డ‌టం అంటే మాటలు కాదు..ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే జ‌గ‌న్ సీయం అవ్వ‌టం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని సూప‌ర్ స్టార్ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. జ‌గ‌న్ మంచివాడ‌ని కితాబిచ్చారు. ఇప్ప‌టికే సినీ గ్లామ‌ర్ టిడిపి కంటే వైసిపి లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. గతంలో మ‌హేష్ సైతం జ‌గ‌న్ పై ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. కొద్ది రోజుల క్రిత‌మే పోసాని, పృధ్వీ లు జ‌గ‌న్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. సినీ గ్లామ‌ర్ గ‌తంలో ఎక్కువ‌గా క‌నిపించే టిడిపి లో ఇప్పుడు అది త‌గ్గి..వైసిపి లో పెరుగుతోంది. రోజా ఇప్ప‌టికే హీరో యిన్ గా ఉన్నారు. నాగార్జున సైతం జ‌గ‌న్ వైపే ఉన్నారు. ఇక‌, మోహ‌న్ బాబు సైతం వైసిపి లోకి రావ‌టం దాదాపు ఖాయం గా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో కష్టాల‌ను అనుభ‌వించి..వాటిని ఎదుర్కొని రియ‌ల్ హీరోగా నిలిచారు. దీంతో..రీల్ హీరోలు సైతం జ‌గ‌న్ వెంటే ఉంటున్నారు. రోజు రోజుకీ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతార‌నే న‌మ్మ‌కం సాధార ణ ప్ర‌జానీకం మొద‌లు ప్ర‌ముఖుల వ‌ర‌కు వ్య‌క్తం అవుతోంది. దీంతో..రానున్న రోజుల్లో ఏపి రాజ‌కీయాల్లో వైసిపికి మరింత మ‌ద్ద‌తు పెర‌గ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. పెయిడ్ ప్ర‌చారం న‌మ్ముకొనే టిడిపి నేత‌ల‌కు ఇప్పుడు స‌నీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు సైతం జ‌గ‌న్ కు అండ‌గా నిల‌వ‌టాన్ని టిడిపి జీర్ణించుకోలేక పోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here