వైసిపి చేతికి బ్రహ్మాస్త్రం. వైసిపి చేతికి చిక్కిన రెండు పార్టీలు. అవిశ్వాసంతో ఆత్మరక్షణలో పడుతోంది ఎవరు. టిడిపి నా లేక బిజెపినా. అవిశ్వాసం చర్చలో పాల్గొనే అవకాశం కోల్పోయి న వైసిపికి నష్టం జరుగుతోందా. ఢిల్లీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో అమరావతిలో మారుతున్న సమీకరణాలు ఏంటి. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాసం. సభలో వైసిపి లేకుండా తాము ఇచ్చిన నోటీసు అనుమతించటం.
మోదీ ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టిన ఘనత తమకే దక్కిందనే ఆనందంలో ఉన్న టిడిపిని మరో టెన్షన్ కూడా వెం టాడుతోంది. కొంత కాలంగా బిజెపిని బూచి గా చూపించి ఏపిలో టిడిపి రాజకీయాలు చేస్తోంది . వైసిపి, జనసేన పార్టీలను బిజెపి కి మద్దతుగా పార్టీలుగా ప్రచారం చేస్తోంది. ఇక, సభలో అవిశ్వాసం చర్చ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదయటం వరకు ఓకే. కానీ, కేంద్రం ఎటువంటి సమాధానాలు చెబుతుంది. ముఖ్యంగా ఏపికి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజి ముద్దు అంటూ ఏపి అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేస్తూ కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని సమాధానం లో భాగంగా కేంద్రం ప్రస్తావిస్తుందనే సమాచారం టిడిపిలో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో ఏపి లోని బిజెపి నేతలు టిడిపి ప్రభుత్వం పై చేస్తున్న అవినీతి ఆరోపణలను బిజెపి కేంద్ర నాయకత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రస్తా విస్తుందా లేదా అనే చర్చ కూడా మొదలైంది. అయితే, బిజెపి నేతలు మాత్రం విమర్శలకు అది సమయం కాదని కేంద్ర ప్రభుత్వం పై సభలో మాట్లాడిన అంశాలకే కేంద్ర ప్రభుత్వ సమాధానం పరిమితం అవుతుందని బిజెపి నేతలు సమర్ధిం చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సభలో అవిశ్వాసం చర్చ సమయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తాం, చూస్తాం అని తప్ప పెద్దగా నిర్దిష్ఠ హామీలు ఇచ్చే పరిస్థితి లేదనే అంచనా ఉంది. దీంతో, అవిశ్వాసం ముగిసిన తరువాత ఇప్పటి వరకు వైసిపి ఎంపీల రాజీనామాల పై విమర్శలు చేస్తూ వచ్చిన తాము ఇక రేపటి నుండి ఏం చేయాలే ఆందోళన టిడిపి నేతల్లో కనిపిస్తోంది.
గతంలో కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన వైసిపి చివరకు చెప్పిన మాట ప్రకారం తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామా చేయించింది. ఇక, ఇప్పుడు లోక్‌సభలో చర్చ ముగిసిన తరువాత టిడిపి నేతలు మాత్రం తమ మద్దతు మీడియా మీదేనే ఇక ఆధార పడనున్నారు. ఇక, రాజ్యసభలోనూ ఏపి అంశాల పై చర్చ జరగనుంది. ఆ సమయంలో వైసిపి సైతం తమ వాయిస్ వినిపించటానికి సిద్దంగా ఉన్నారు. ఇక, ఇప్పటి వరకు వైసిపి ఎంపీలను విమర్శిస్తూ వచ్చిన టిడిపి పై ఇక, వైసిపి ఎదురుదాడి చేయటానికి అస్త్రం దొరికింది. బిజెపి నేతలు ఏపిలో చేస్తున్న విమర్శలు కేంద్ర పెద్దలు చేయకపోయినా, బిజెపి పై టిడిపి కఠిన వైఖరితో లేకపోయినా వైసిపి చేతికి రెండు పార్టీలు చిక్కినట్లే. మరి వైసిపి తమ చేతికి దొరికిన ఈ అస్త్రాలను ఎలా సంధిస్తుందనేదే ఇప్పుడు అసలు చర్చ.