విజయ సాయి రెడ్డి. రాజకీయాల్లో అంతగా సీనియార్టీ లేదు. జగన్ కు వీర విధేయుడు. వైసిపి రాజ్యసభ సభ్యుడు. కానీ, ఇప్పుడు టిడిపి నేతలు జగన్ కంటే ఎక్కువగా కార్నర్ చేస్తున్న నేత. వైసిపి లో అందరివాడుగా ఉంటున్న విజయసాయరెడ్డి రాజ్యసభ సభ్యు డు అయిన తరువాతి నుండి కేంద్ర స్థాయిలో అందరితోనూ మంచి సత్సంబంధాలు నడపటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో నిన్న మొన్నటి వరకు భాగస్వామిగా ఉన్న టిడిపి కంటే..కేంద్రంలో ఏం జరుగుతుందో ముందస్తు సమాచారం ఆయనకే వస్తుందని టిడిపి నేతలే అంగీకరించే పరిస్థితి.
కేంద్రంలో ప్రధాని మోదీ నుండి ఏ మంత్రి అయినా..విజయ సాయి రెడ్డి అడిగితే అ ప్పాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందే. ఆ స్థాయికి ఆయన తన పలుకుబడి పెంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం ప్రధాని మోదీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వని స్థితిలో జగన్ కు అప్పాయింట్‌మెంట్ దక్కేలా సాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక ఎన్డీఏ రాష్ట్రపతి, గవర్నర్ ల వంటి నియామకాల విషయంలోనూ సాయి రెడ్డికి ముందుగానే సమాచారం ఇస్తున్నారని టిడిపి నేతలు ఉక్రో షానికి గురయిన సందర్భాలు ఉన్నాయి. విజయ సాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సమయంలో..తాజాగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఏకగ్రీవం అయ్యే విధంగానూ సాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టిడిపి అంచనాలను తిప్పి కొడుతూ జగన్ సూచన ల మేరకు టిడిపి పై పై చేయి సాధించారు. ఇక..తాజాగా..టిడిపి ని కేంద్రంలో కార్నర్ చేయటంలో విజయ సాయిరెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని టిడిపి నేతల ఆరోపణ. ఎప్పుడూ ప్రధాని పేషీ వద్ద సాయి రెడ్డి ఉంటారని..ఆయనకు అక్కడ ఏం పని అన్నది టిడిపి నేతల ప్రశ్న. అయితే, తమకు దక్కని గౌరవం సాయి రెడ్డికి ప్రధాని ఇస్తున్నారనేది టిడిపి నేతల ఆక్రోశానికి ప్రధాన కారణం.
విజయ సాయి రెడ్డి రాజ్యసభలో ప్రత్యేక హోదా మీద అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. రాజ్యసభలో స్టేట్స్‌మెన్‌గా గుర్తింపు పొందారు. అతి తక్కువ కాలంలోనే కేంద్ర రాజకీయాల్లో మంచి పట్టు సాధించిన విజయ సాయి రెడ్డి పై టిడిపి నేతలు మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు జగన్ మాత్రమే టిడిపికి కొరకరాని కొయ్యగా కనిపించారు. ఇప్పుడు సాయి రెడ్డి సైతం టిడిపికి పక్కలో బల్లెంగా మా రారు. దీంతో..విజయ సాయి రెడ్డి లాంటి సత్సంబంధాలు ఉన్న నేత మనకు ఢిల్లీలో అవసరమని స్వయంగా టిడిపి ముఖ్యనేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే వారు సాయి రెడ్డి సమర్ధతను ఏ విధంగా అంచనా వేస్తున్నారో అర్దం అవుతోంది. ఇటువైపు జగన్ మాత్రం విజయ సాయి రెడ్డి కి అనేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. సాయి రెడ్డి పార్టీకి చేస్తున్న సేవ ఎలాంటితో పార్టీ నేతలే చెబుతుంతారు.