య‌డ్యూర‌ప్ప కు వైసిపి జంప్ మ్మెల్యే కు లింక్.- TDP head in Karnataka Politics

0
418

టిడిపి అధినేత క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో చిక్కుకున్నారా. య‌డ్యూర‌ప్ప కు వైసిపి జంప్ జిలానీల‌కు లింక్. క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో బిజెపి ఓడిపోవాల‌ని టిడిపి అధినేతతో స‌హా పార్టీ నేత లంతా కోరుకున్నారు. అది సాధ్య‌ప‌డ‌లేదు. కాంగ్రెస్‌-జెడిఎస్ మైత్రితో బిజెపికి ప్ర‌భుత్వ ఏర్పాటు ఛాన్స్ లేకుండా పోవటం తో మ‌రోసారి టిడిపి శిబిరంలో జోష్ అందుకుంది. కానీ, య‌డ్యూర‌ప్ప‌కే ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ద‌క్క‌టం తో ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ పై మాట్లాడుతున్నారు. ప్ర‌జాస్వామ్యంలో కొనుగోళ్ల‌కు తెర లేపేలా బిజెపి వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని టిడిపి నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రి..టిడిపి చేసిందేంటి. బిజెపి కి సాధార‌ణ మెజార్టీ కంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు త‌గ్గారు.

కాంగ్రెస్‌-జెడిఎస్ నుండి వారిని చీల్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని ఆరోపిస్తున్నారు. మ‌రి..పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా..వైసిపి ఎమ్మెల్యేలు 23 మందిని టిడిపి ఎందుకు ప్ర‌లోభాల కు గురి చేసి త‌మ పార్టీ కండువా క‌ప్పందో స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక‌, గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ గురించి మాట్లాడుతు న్న టిడిపి..వైసిపి నుండి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను మంత్రులుగా చేయ‌టం..గ‌వ‌ర్న‌ర్ వారితో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌టం పైనా వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో…క‌ర్నాట‌క రాజ‌కీయాల పై స్పందించాలా వ‌ద్దా అనే మీమాంస లో టిడిపి అధినేత ఉన్నారు. కుమార‌స్వామి … టిడిపి అధినేత‌కు ఫోన్ చేసి అండ‌గా నిల‌వాల‌ని కోరార‌ని టిడిపి శ్రేణులు ప్ర‌చారం చేసుకుంటున్నాయి. మంత్రులు సైతం క‌ర్నాట‌క లో బిజెపి చేస్తున్న రాజ‌కీయం పై ఓపెన్ గా మాట్లాడాల‌ని తమ పార్టీ అధినేత‌కు సూచిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..క‌ర్నాట‌క ఫ‌లితాలు త‌రువాత చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ బిజె పి సీనియ‌ర్ నేత‌లు వ్యాఖ్య‌లు చేసారు. ఇక‌, త‌మ దృష్టి ఏపి పైనే ఉంటుంద‌ద‌ని..ఏపి లో కొంద‌రి పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌నే వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. ఇటువంటి స‌మ‌యంలో క‌ర్నాట‌క వ్య‌వ‌హారాల పై ఏం మాట్లాడినా..గ‌వ‌ర్న‌ర్ ద్వారా త‌మ ఫిరాయింపు మంత్రుల పై చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఓ సీనియ‌ర్ టిడిపి నేత వ్యాఖ్యానించారు. అయితే, ఆ విష‌యం కంటే ముందుగా..క‌ర్నాట‌క పై స్పందిస్తే..రాజ‌కీయంగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌తామ‌ని..బిజెపి మరింత సీరియ‌స్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని టిడిపి నేత‌లు ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో..ఇప్పుడు బిజెపి ఫిరాయింపుల‌ను ప్రో త్స‌హించినా..40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం.. జాతీయ రాజకీయాల్లో చ‌క్రం తిప్పిన నేత నిస్స‌హ‌స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక‌, బిజెపి సైతం టిడిపి నేత‌లు ఎవ‌రైనా స్పందిస్తే…సీరియ‌స్‌గా కౌంట‌ర్‌గా ఇవ్వ‌టానికి సిద్దంగా ఉంది. ఇలా..వైసిపి జంప్ జి లానీలు ఇప్పుడు స‌మ‌స్య‌గా మారారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here