జ‌గ‌న్ అడుగుల్లో 40 ఏళ్ల అనుభ‌వం – TDP Leader Chnadrababu Fallows YS Jagan

0
493

40 ఏళ్ల అనుభ‌వానికి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు. ప్ర‌తిప‌క్ష నేత బాట‌లో ముఖ్య‌మంత్రి. హోదా వ‌ద్దు ప్యాకేజి ముద్దు అంటూ ఊద‌ర గొట్టిన ముఖ్య‌మంత్రి..త‌న వాద‌నే వినిపించేలా చేయ‌టంలొ విప‌క్ష నేత జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. తొలి నుండి ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ పోరాటం చేస్తున్నారు. దీక్ష‌లు చేసారు. యువ‌భేరీలు నిర్వ‌హించారు. కానీ, అధికార‌ప‌క్షం మాత్రం హోదాతో ప్ర‌త్యేకంగా వచ్చే లాభాలు ఏమున్నాయో చెప్పాల‌ని..హోదా పేరుతో యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని వాదించింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. జ‌గ‌న్ ర‌చించిన వ్యూహం స‌క్సెస్ అయింది. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ క‌ళ్యాన్ తో స‌హా అనేక సంఘాలు స‌పోర్టింగ్ వాయిస్ వినిపిస్తున్నాయి. ఇక‌,నిన్నటి దాకా ప్యాకేజి అంటూ దాట‌వేసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించిన టిడిపి నేత‌లు సైతం జ‌గ‌న్ బాట ప‌ట్టారు.

ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్‌గా మార‌టం..దీనికి వైసిపి అధినేత నాయ‌క‌త్వం వ‌హించ‌టంతో..టిడిపిలో క‌ల‌క‌లం మొద‌లైం ది. ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం..పార్ల‌మెంట్‌లో నిర‌స‌న‌లు..కేంద్రం పై అవిశ్వాస తీర్మానం..చివ‌ర‌గా ఎంపీల రాజీనామా ద్వారా..ప్ర‌జ‌ల్లో వైసిపి ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోవ‌టంతో..టిడిపి దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది. క్ర‌మ‌క్ర‌మంగా జ‌గ‌న్ వాయిస్ నే వినిపిస్తూ…ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ఫాలో అవుతున్నారు. వైసిపి కి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పెరుగుతున్న అంశాన్ని గ‌మ‌నించిన టిడిపి అప్ర‌మ‌త్త‌మైంది. బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌లో సైతం ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించారు. వైసిపి ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్న వేళ‌..టిడిపి పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో ప‌డిపోయింది. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టా నికి టిడిపి నేత‌లు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ నే ఫాలో అవుతున్నారు టిడిపి నేత‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here