మంత్రి అఖిల ప్రియ పెళ్లి పీటలెక్కబోతున్నారు. మంత్రి అఖిలప్రియ ప్రేమించిన భార్గవ్ తో ఆగస్టు 29న వివాహం జరగనుంది. హైదరాబాద్‌లోని అఖిల నివాసంలో స్నేహితులు, బంధుమిత్రల సమక్షంలో అఖిల, భార్గవ్ల వివాహ నిశ్చితార్దం జరిగింది. వరుడు బార్గవ్ మాజీ డిసిజి సాంబశివరావు అల్లుడుగా తెలుస్తోంది. మంత్రి నారాయణ పెద్దల్లుడు సోదరుడైన భార్గవ్ను అఖిల తో వివాహ జరపటానికి పెద్దలు నిర్ణయించారు.
ఎంగేజ్‌మెంట్‌లో రెండు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. అఖిల తల్లి తండ్రుల ఫొటో ముందు ఇద్దరు దండలు మార్చుకొన్నారు. సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి, సోదరి మౌనిక ఎంగేజ్ మెంట్‌లో అఖిల పక్కనే ఉన్నారు. అఖిల తల్లి తండ్రులు ఉన్న సమయంలోనే వైయస్ బంధువుల కుటుంబం తో సంబంధం ఏర్పడింది. అయితే, ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్న అఖిల వివాహాం చేసుకోబోతున్నారు. దీంతతో మంత్రులు నారాయణ, గంటా మధ్య ఇప్పటికే వియ్యం ఉంది. కాగా, తాజాగా అఖిల వివాహంతో ఈ ఇద్దరు మంత్రులకు సైతం బంధుత్వం ఏర్పడనుంది. ఆగస్టు 29న వివాహం కోసం ఇప్పటి కే నిర్ణయం జరిగింది.