జ‌గ‌న్ రాజ‌కీయం ముందు మోక‌రిల్లిన టిడిపి వ్యూహం -TDP was feared by YS Jagan Technique

0
483

న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం..వ‌ర్సెస్ ఎనిమిదేళ్ల పార్టీ. ఎత్తుల‌-పై ఎత్తులు. వ్యూహాలు- ప్ర‌తి వ్యూహాలు. ఏపిలో కొంత కాలంగా పూర్తిగా పైచేయి గా క‌నిపించిన టిడిపి రాజ‌కీయాన్ని..అదును చూసి దెబ్బ కొట్టారు వైసిపి అధినేత జ‌గ‌న్‌. ప్ర‌త్యేక హోదాతో సమ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారం కావ‌ని చెప్పిన చంద్ర‌బాబే..జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహంలో చిక్కుకున్నారు. జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం..ఎంపీల రాజీనామా అన‌గానే చంద్ర‌బాబు కు విషయం అర్ద‌మైపోయింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైపోయారు. అప్ప‌టి వ‌ర‌కు బిజెపి – టిడిపి మ‌ధ్య మేము కొట్టిన‌ట్లు న‌టిస్తాం..మీరు ఏడ్చిన‌ట్లు న‌టించ‌డి అనే విధంగా రాజీక‌యం సాగింది. కానీ, జ‌గ‌న్ పెంచిన ఒత్తి డితో టిడిపి త‌లొగ్గ‌క తప్ప‌లేదు.

కేంద్రం నుండి టిడిపి మంత్రుల‌ను విత్ డ్రా చేసారు. కానీ, టిడిపి త‌న అవ‌స‌రాల దృష్ఠ్యా ఎన్డీఏలో కొన‌సాగుతోంది. ఏపిలో త‌న వైఫ‌ల్యాల‌ను బిజెపి మీద‌కు మ‌ళ్లించి రాజ‌కీయంగా ల‌బ్ది పొందే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదే స‌మ‌యం లో ఏపిలో త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి వైసిపికని ఇందులోకి లాగే ప్ర‌యత్నం చేస్తోంది టిడిపి. ఇందులో భాగంగా..ఒక వైపు తాను ఎన్డీఏ లో కొన‌సాగుతూనే..మ‌రో వైపు బిజెపితో జ‌గ‌న్ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌చారం చేస్తోంది.

జ‌గ‌న్ ఏపికి ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తే..వారితో క‌లిసి న‌డుస్తామ‌ని స్ప‌ష్టంగా చెప్పారు. కానీ, టిడిపి మాత్రం తాము ఎన్డీఏ నుండి తొలిగే అంశంపై క్లారిటీ ఇవ్వ‌టం లేదు. కేంద్రం పై పోరాటం అంటూనే కేంద్రంలో అధికారంలో ఉన్న కూట‌మిలో భాగ‌స్వామిగా ఉంది. ఇదే స‌మ‌యంలో .. ఏపి ప్ర‌జ‌లు బిజెపి పై ఆగ్ర‌హంగా ఉండటంతో..బిజెపి తో పాటుగా వైసిపి ని కార్న‌ర్ చేసే ప‌నిలో ప‌డింది టిడిపి. ఈ విష‌యంలో టిడిపి డ‌బుల్ గేమ్ ను వైసిపి నుండి జ‌గ‌న్ మిన‌హా మిగిలిని నేత‌లు పెద్ద‌గా జ‌నంలోకి తీసుకుపోవ‌టం లేదు. ఈ ప్ర‌చారం ద్వారా వైసిపికి మైనార్టీలు..ద‌ళితుల‌ను దూరం చేయ‌టం..రాజ‌కీయంగా ఏపిలో ప్ర‌యోజ‌నం పొంద‌టం టిడిపి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. కానీ, జ‌గ‌న్ మాత్రం ధీమాగా క‌నిపిస్తున్నారు. తాము ప్ర‌త్యేక హోదా కోసం అవిశ్వాసం ప్ర‌తిపాదించే స‌మ‌యంలో టిడిపి మ‌ద్ద‌తు ఇవ్వ‌క పోయినా.. త‌మ ఎంపీలు రాజీనామా చేసే స‌మ‌యంలో క‌లిసి రాక‌పోయినా..టిడిపి ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల దృష్టిలో డామేజ్ అవుతుంద ని వైసిపి అధినేత అంచ‌నా వేస్తున్నారు. ఇదే విష‌యంలో వైసిపి అమ‌లు చేసే నిర్ణ‌యాలు బిజెపికి మేలు చేసేవిగా టిడిపి ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, ఇటు టిడిపి..అటు వైసిపి వేస్తున్న ఎత్తుగ‌డ‌లను బిజెపి సైతం నిశితంగా ప‌రిశీలిస్తోంది. కేంద్ర స్థాయిలో వైసిపి ఎంత చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించినా…టిడిపి చేస్తున్న విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌క‌పోతే..అది రానున్న రోజుల్లో వైసికి న‌ష్టం క‌లిగిస్తోంది. ఇ ప్ప‌టి వ‌ర‌కు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైసిపి..రానున్న రోజుల్లో టిడిపిని కార్న‌ర్ చేస్తూ ఎటువంటి కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here