వైసిపి తో ట‌చ్‌లోకి టిజి..!! – TG may join YCP?

0
450

వైసిపి తో ట‌చ్‌లోకి టిజి..!!
జ‌గ‌న్ ఓకె అంటే..ఇక క్యూ నే..!!

రాజ్య‌స‌భ స‌భ్యుడు టిజి వెంక‌టేష్ రూటు మారిందా? ఆయ‌న త‌న త‌న‌యుడితో స‌హా కలిసి పార్టీ మార‌టానికి సిద్దమ‌య్యారా? క‌ర్నూలు టిడిపిలో ఏం జ‌రుగుతోంది? క‌ర్నూలు ఎమ్మెల్యే టిడిపి అభ్య‌ర్ధిగా ఎస్వీ మోహ‌న్ రెడ్డిని మంత్రి లోకేష్ ప్ర‌క‌టిం చ‌టంతో ఒక్క‌సారిగా టిజి వెంక‌టేష్..ఆయ‌న త‌న‌యుడు అసంతృప్తికి గుర‌య్యారు. దీని పై టిజి సీరియ‌స్ వ్యాఖ్య‌లే చేసా రు. లోకేష్‌ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశాడని అనుకుంటున్నానని త‌న లోని ఆగ్ర‌హాన్నిబ‌య‌ట పెడుతున్నారు. దీని పై ఎస్వీ మోహ‌న్ రెడ్డి సైతం ధీటుగానే స్పందిస్తున్నారు.

టిజి వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టిజి వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పు పట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని  టిజి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే త‌న కుమ‌రుడు భ‌ర‌త్ కు క‌ర్నూలు సీటు పై ముఖ్య‌మంత్రిని క‌ల‌వాల‌ని, అక్క‌డి నుండి సానుకూల స్పంద‌న రా క‌పోతే పార్టీ మారేందుకైనా వెనుకాడ‌న‌ని టిజి త‌న స‌న్నిహిత‌లుతో చెబుతున్న‌ట్లు స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో టిజి వెంక‌టేష్ ఇద్ద‌రు వైసిపి నేత‌ల‌తో ట‌చ్ లోకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టిజి ప్ర‌స్తుతం రాజ్య‌సభ స‌భ్యుడిగా ఉండ టంతో, ఆయ‌న పార్టీ మార‌క‌పోయినా, కుమారుడు భ‌ర‌త్ ను వైసిపి లో పంపించేందుకు ఆలోచన చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్నూలు ఎమ్మెల్యే సీటు పై టిజి వ‌ర్గం హామీ కోరుతోంది. అయితే, ష‌ర‌తుల‌తో కాకుండా ముందుగా పార్టీలో చేరాల‌ని.. టిక్కెట్ల కేటాయింపు స‌మ‌యంలో త‌గిన విధంగా నిర్ణ‌యం ఉంటుంద‌ని వైసిపి ప్ర‌తినిధులు చెప్పిన‌ట్ల స‌మాచారం. టిక్కె ట్ల విష‌యంలో వైసిపి అధినేత జ‌గ‌న్ దే తుది నిర్ణ‌య‌మ‌ని…క‌ర్నూలు ఎమ్మెల్యే సీటు ముస్లిం మైనార్టీకి వైసిపి నుండి ఇస్తా ర‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో..వైసిపి నుండి టిజి కుమారుడికి ఎంత వ‌ర‌కు హామీ ల‌భిస్తుంద‌నేది వేచి చూడా ల్సిందే. అయితే, టిజి మాత్రం వైసిపి నుండి హామీ వ‌స్తే పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. టిజి తో పాటుగా మ‌రి కొంత మంది క‌ర్నూలు టిడిపి నేత‌ల సైతం వైసిపి లో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి, క‌ర్నూలు విష‌యంలో జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here