ఆ ఇద్దరే వైసిపి ప్రతిష్ఠ పెంచాలి..!
వైసిపి గౌరవం – ప్రతిష్ఠ ఇప్పుడు వారిద్దరి చేతుల్లోనే ఉంది. పార్లమెంట్ సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వైసిపి లోక్‌సభ సభ్యులు రాజీనామా చేయటంతో వారు సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. ఈ సమావేశాల్లో ఏపికి సంబంధించిన పెండింగ్ హామీల అమలు మరో సారి కీలకం కానున్నాయి. లోక్‌సభ లో వైసిపికి ఇప్పు డు ప్రాతినిధ్యం లేకపోవటంతో..రాజ్యసభలో ఉన్న వైసిపి కి చెందిన ఇద్దరు సభ్యులు కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఏర్పడింది. ఇప్పటికే బిజెపి తో వైసిపి పొత్తు కుదుర్చుకుందని..కలిసి రాజకీయాలు చేస్తున్నారని టిడిపి తో పాటుగా మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది. వైసిపి లోక్‌సభ సభ్యులు ఏపికి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసినా..అవి ఆమోదించినా టిడిపి వాటిని కుమ్మక్కు రాజకీయాలంటూ విమర్శిస్తోంది. ఇక, వైసిపి ఎంపీల త్యాగాల మైలేజ్ తమకు డామేజ్ కాకుండా ఎదురుదాడిని లక్ష్యంగా ఎంచుకుంది. ఇదే సమయంలో విజయ సాయి రెడ్డి లక్ష్యంగా చేసుకొని టిడిపి అనేక విమర్శలు చేస్తోంది. దీనికి ప్రతిగా విజయ సాయిరెడ్డి సైతం టిడిపిని ఇరకాటంలో పెడుతూ..ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని అనేక సవాళ్లు చేస్తున్నారు. వీటికి టిడిపి నుండి సమాధానం లేదు. ఇక, ఈ సమావేశాల్లోనే కీలక ఘట్టం ఒకటి చోటు చేసుకోబోతోంది. ఎంతో కాలంగా ఏకగ్రీవంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరుగుతోంది. అయితే, ఈ సారి విపక్షాలు తమ అభ్యర్ధిని బరిలో దించాలని భావిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన అభ్యర్ధిని రంగంలోకి దించాల ని ఆలోచ చేస్తున్నాయి.
ఈ సమయంలో..ఎన్డీఏ కూటమికి బిజెడి-వైసిపి-టిఆర్‌యస్ మద్దతు ఇస్తే సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇద్దరు సభ్యులు ఉన్న వైసిపి ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి అభ్యర్ధికి మద్దతు ఇస్తే మరింతగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కంటే..తటస్థ వైఖరి తో వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఎన్నిక పై ఇంకా మంతనాలు ప్రారంభం కాలేదు. ఈ నెల 7,8 తేదీల్లో అన్ని పార్టీలతో జరిగే సమావే శాల్లో జమిలి ఎన్నికలతో పాటుగా..రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక పైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పు డు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇద్దరు వైసిపి కి మౌత్ పీస్‌లుగా వ్యవహరించాల్సి ఉంది. ఇద్దరిలోనూ ఇప్ప టికే ఢిల్లీలో విస్తృత సంబంధాలు..తన వాగ్ధాటితో టిడిపిని ఆత్మరక్షణలో పడేస్తున్న విజయ సాయి రెడ్డి పాత్ర ఈ సమావే శాల్లో వైసిపి పరువు- ప్రతిష్ఠ కాపాడటంలో కీలకం కానుంది