గవర్నర్ తేల్చి చెప్పేసారు…!!
ఫిరాయింపు దార్లకు ఇక నో ఛాన్స్..!!
గవర్నర్ తేల్చి చెప్పేసారా? ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తన వైఖరి స్పష్టం చేసారా? మరి..ఆ నలుగురి మంత్రుల పరిస్థితి ఏంటి? వైసిపి నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి..టిడిపిలోకి ఫిరాయించి..మంత్రి పదవులు పొందిన వారికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఒక వైపు రాజకీయంగా విమర్శల, మరో వైపు న్యాయస్థానాల్లో పోరాటాలు, కోర్టుల వ్యాఖ్యలు, ఈ నడుమ మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది.
మొత్తం 22 మందిని వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలను టిడిపి తమ పార్టీలోకి ప్రలోభాల ద్వారా ఫిరాయింపులకు ప్రోత్సహించింది. ఇక, ఎన్నికల ఏడాది కావటంతో ముఖ్యమంత్రి మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణ లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ముస్లిం-మైనార్టీ తో పాటుగా ఎస్టీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో..వైసిపి నుండి ఫిరాయించిన ఆ రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. వారు వైసిపి నుండి ఫిరాయించి టిడిపిలోకి వచ్చే సమయంలోనూ కొందరికి మంత్రి పదవి పై హామీ లభించిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. అందులో ఉత్తరాంధ్ర కు చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే సైతం ఉన్నారు. అయితే, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ప్రభుత్వం కోరుకున్న విధంగా చేయటానికి వీలు లేకుండా పోయింది.
గతంలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఇక..ఇలా ఫిరాయించి వచ్చిన ఇక మంత్రులుగా అవకాశం ఇవ్వటానికి సహకరించటం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సైతం పార్టీ నేతలతో స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి ఈ సంకేతాల ద్వారా వైసిపి నేతలకు ఇక మంత్రులుగా అవకాశం లేదని..కేవలం సొంత పార్టీ నేతలకే అవకాశం కల్పిస్తానని తేల్చి చెప్పినట్లుగా భావిస్తున్నారు. అయితే, ఆ నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకార సమయంలో వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయిస్తామని కొందరు టి డిపి ముఖ్య నేతలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ వ్యవహారం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. దీంతో గరవ్నర్ వైఖరి ఇప్పుడు ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రప్రభుత్వం పై పోరాటం చేస్తున్నామని చెబు తున్న రాష్ట్రప్రభుత్వానికి..కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ ఎలా సహకరిస్తారనేది మరో ప్రశ్న. దీంతో..ఇప్పటి వరకు ఫిరాయింపు మంత్రుల విషయంలో సహకరించిన గవర్నర్ ఇక,,సహకరించే పరిస్థితి కనిపించటం లేదు. రానున్న రోజు ల్లో ఇది ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.