జగన్ కేసుల వ్యవహారంలో టిడిపి ముసుగు తొలిగింది. జగన్ కేసుల పై తొలి నుండి జగన్ చేస్తున్న వాదనే నిజమని టిడిపి నేతలే మరో సారి రుజువు చేస్తున్నారు. జగన్ కేసులు కొట్టివేస్తున్నారా. అదే భయం టిడిపిని వెంటాడుతోందా. జగన్ పై కేసులు కొట్టివేస్తే తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని టిడిపి మంత్రులే స్ప ష్టం చేస్తున్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత కాంగ్రెస్-టిడిపి కలిసి తన మీద రాజకీయ కుట్రతో కేసులు నమోదు చేసారని జగన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. జగన్ పై కాంగ్రెస్ నేత శంకరరావు కేసు వే స్..అందులో టిడిపి నేతలు ఇంప్లీడ్ అయ్యారు. ఆ కేసులను చూపిస్తూ టిడిపి-మద్ద తు మీడియా జగన్ లక్ష కోట్ల అక్రమార్జ న కు పాల్పడ్డారని విష ప్రచారం చేసారు. అయితే, ఇప్పుడు ఆ కేసులు విచారణ లో ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం సీయం చంద్రబాబు సైతం జగన్ సోనియాకు ధిక్కరించినందుకు కేసులు నమోదు చేసా రని ఓపెన్ అయిపోయారు. ఇప్పుడు ఆ పార్టీకే చెందిన డిప్యూటీ సీయం చినరాజప్ప, సీనియర్ మంత్రి యనమల తమ పార్టీ ఉద్దేశాన్ని బయట పెట్టేసారు. జగన్ పై ప్రస్తుతం విచారణ లో ఉన్న కేసులు కొట్టివేస్తే..తాము సుప్రీం కోర్టు కు వెళ్తా మని తేల్చి చెప్పారు. జగన్ పై రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేయటానికి అవకాశం లేకపోవటంతో..ఇప్పటి వరకు ఏపిలో ఏం జరిగినా..ఆ నెపాలను వైసిపి మీద .. జగన్ మీద నెట్టేస్తూ టిడిపి పాలన సాగిస్తోంది. ఇక, న్యాయ పరంగానూ జగన్ ను వెంటాడుతామని టిడిపి నేతలు హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ కేసుల వ్యవహారంలో సిబిఐ అభియోగాలు మోపిన పులువురు అధికారులకు కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. జగన్ కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని న్యాయనిపుణులతో పాటుగా..వైసిపి తొలి నుండి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో..టిడిపి నేతలు తమ ఆక్రోశాన్ని బయట పెట్టారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న జగన్ ప్రతీ వారం ఇదే కేసులకు సంబంధించి కోర్టుకు హాజరవుతున్నారు. ఇక, ఇప్పుడు టిడిపి నేతలు ఇప్పటి వరకు జగన్ కేసులు సిబిఐ నమోదు చేసిందని..తమకు సంబంధం లేదని చెబుతూ వచ్చింది. ఇప్పుడు, జగన్ కేసుల పై సుప్రీం కు వెళ్తామని చెప్పటం ద్వారా..టిడిపి తెర తొలిగిపోయింది. మరి..దీని పై వైసి పి అధినేత జగన్..వైసిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.