ఏపికి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం లేదు.. టిడిపి వేడుక‌లు మాత్రం ఘ‌నంగా.- There is no Formation day for AP But TDP celebrations are great.

0
436

ఏపి ప్ర‌జ‌లు ఏం పాపం చేసారు. టిడిపి పండుగ‌ల‌కు ఘ‌నంగా నిర్వ‌హిస్తూ..రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఎందుకు నిర్వ హించ‌టం లేదు.సెంటిమెంట్ పేరుతో రాజ‌కీయంగా ప‌బ్బం గుడుపుకుంటున్నారా. ఏపికి రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం ఎందుకు లేదు. దీనికి బాధ్యులెవ‌రు. ముఖ్య‌మంత్రి త‌న జ‌న్మ‌దినం నాడు కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసుకొని పొలిటిక‌ల్ మైలేజ్ పొందాలి. కానీ, అయిదు కోట్ల మంది ఉన్న ఏపికి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం వ‌ద్ద‌నే హ‌క్కు ఎవ‌రు ఇచ్చారు. తెలంగాణ తో కూడిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు న‌వంబ‌ర్ 1న రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం నిర్వ‌హించేవారు. రాష్ట్ర విభ‌జ‌న తరువాత తెలంగాణ ఏపి నుండి విడిపోయింది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ..దేశంలో 29న రాష్ట్రంగా ప్ర‌క‌టించారు. ఈ విభ‌జ‌న లో ఏపి ప్ర‌జ‌ల‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇక‌, ఏపిలో టిడిపి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ త‌రువాత‌..ప్ర‌తీ ఏడాది జూన్ 2న న‌వ నిర్మాణ దీక్ష పేరుతో బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌ను..ఉద్యోగుల‌ను అందులో భాగ‌స్వాముల‌ను చేస్తున్నారు. గ‌త ఏడాది ఇదే రోజున విజ‌య‌వాడ లో ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించిన ఈ స‌భ‌కు జ‌నస్పంద‌న లేదు. అప్ప‌టికైనా ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నార‌నేది ప్ర‌భుత్వం అర్దం చేసుకోవాలి. ఏపిలో క‌సిగా అభివృద్ది చేసుకొని..విభ‌జ‌న చేసిన వారే ఈర్ష్య ప‌డేలా చేయాల‌ని ప‌దే ప‌దే ఊక దంపుడు ప్ర‌సంగాలు చేస్తున్నారు.

ఏపి ప్ర‌జ‌ల్లో నాలుగేళ్లుగా విభ‌జ‌న సెంటిమెంట్ ను రగిలిస్తూ ఓటు బ్యాంకును ప‌దిలం చేసుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. గ‌తంలో ఏపికి రాష్ట్ర అవ‌త‌ర‌న దినోత్స‌వం పై కేంద్ర ప్ర‌భుత్వానికి ఓ లేఖ వెళ్లింది. ఆ స‌మ‌యంలో.. కొత్తగా ఏర్ప‌డిన రాష్ట్రం తెలంగాణ కాబ‌ట్టి..ఏపి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం న‌వంబ‌ర్ ఒక‌టినే జ‌ర‌పుకోవాల‌ని కేంద్రం సూచిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. అయినా..పొలిటిక‌ల్ మైలేజ్ కోసం సెంటిమెంట్ ను ర‌గిలిస్తూ…రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం జ‌ర‌ప‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుయుక్తుల పై నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. నాలుగేళ్లుగా జూన్ 8న టిడిపి ప్ర‌భుత్వ ఏర్పాటు వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు..ప్ర‌తీ ఏడాది మార్చి 28 న టిడిపి అవిర్భావ వేడుక‌ల‌ను కొన‌సాగిస్తున్నారు…ప్ర‌తీ ఏడాది మే 27,28,29 తేదీల్లో మ‌హానాడు నిర్వ‌హిస్తున్నారు. మ‌రి.. ఏపి ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే..ఈ వేడుల‌కు అంత ఘ‌నంగా ఎందుకు నిర్వ‌హిస్తున్నారు. ఏపికి అన్యాయం జ‌రిగితే టిడిపికి అది ప‌ట్ట‌టం లేదు. ఈ వేడుక‌ల నిర్వ‌హ‌ణ ఎలా స‌మ‌ర్ధించుకుంటారు. దీని పై రాజ‌కీయ పార్టీలు..ప్ర‌జా సంఘాలు ఎందు కు స్పందించ‌వు. ఏపికి పుట్టిన రోజు లేకుండా చేసిన పాపం ఎవ‌రిది. ఏపి వాసులుగా మీరు దీని పై ఏం కోరుకుంటున్నారో.. మీ అభిప్రాయాలేంటే కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి..ఏపికి గౌర‌వం ద‌క్కేలా చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here