ఉమా భయానికి కారణం ఆయనేనా ! తేల్చి చెప్పిన ఆంధ్రజ్యోతి – Uma Fears of Vasanta Krishna

0
467

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు పై మంత్రి దేవినేని ఉమా కు భ‌యం ప‌ట్టుకుందా. అంధ్ర‌జ్యోతి క‌ధ‌నం సారాంశం అదేనా. కృష్ణా జిల్లాలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు వైసిపి లో  చేరిక పై వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని టిడిపిలో ఆవ్యూహం లోపించింద‌ని ఆంధ్ర‌జ్యోతి పేర్కొనటం ఇప్పుడు టిడిపి నేత‌ల‌కు రుచించ‌టం లేదు. జ‌గ‌న్ కృష్ణా జిల్లాలో ఎంట్రీకి ముందే అక్క‌డ టిడిపి కి మద్ద‌తు ఇచ్చే ఒక బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను వైసిపి లో చేర్చుకోవ‌టం పై ఆ పార్టీ నేత‌లు దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యేల య‌లమంచిలి ర‌వి వైసిపి లో చేరారు. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వైసిపి లో చేరనున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇదే అంశం పై ఆంధ్ర‌జ్యోతి త‌న వెబ్‌సైట్ లో పొలిటిక‌ల్ ఇన్‌సైడ్ స్టోరిని ప్ర చురించింది. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ మైల‌వ‌రం నుండి పోటీ చేస్తార‌ని పేర్కొంది. కృష్ణ ప్ర‌సాద్ ఆర్దికంగా స్థితి మంతుడ‌ని ఆయ‌న వైసిపి నుండి పోటీ చేసినా రాకీయంగా నిల‌బ‌డ‌గ‌ల‌గాలి అనే ఉద్దేశంతో మంత్రి ఉమా ప‌ని చేసుకుంటున్నార‌ని వివ‌రించింది.

2014 ఎన్నికల్లో ఇక్కడ అతి తక్కువ మెజారిటీతో ఉమ గెలుపొందారు. మంత్రిగా ఉన్న ఉమ రెండున్నరేళ్ల పాటు నియోజకవర్గంపై అంతగా దృష్టి సారించలేదని స్ప‌ష్టం చేసింది. గత సంవత్సర కాలంనుంచి నియోజకవర్గంపై పట్టుపెంచుకునే ప్రయత్నాన్ని ప్రారంభించారని వివ‌రించింది. ప్రతి రోజూ నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారంటూ ఉమ లో మొద‌లైన ఆందోళ‌న‌ను చెప్ప‌క‌నే చెప్పేసింది. గ్రామప్రాంతాల్లోని పార్టీ నేతల మధ్య ఉండే విభేదాలను పరిష్కరిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల పట్టాలను మంజూరు చేయించారని ఆంధ్ర‌జ్యోతి ఆ క‌ధ‌నంలో పేర్కొంది. సంస్థాగ‌తంగా ఉన్న లోపాల‌ను సైతం ప‌రిష్క‌రించ‌టానికి ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ఈ క‌ధ‌నంలో విశ్లేషించింది. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టిడిపి నేత‌లే వైసిపి వైపు వెళ్తుడ‌టం టిడిపి నేత‌ల్లో నెల‌కొన్న విబేధాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌నేది ఆ క‌ధ‌నంలో భావ‌న‌గా క‌నిపిస్తోంది.

ఎన్నికల సంవత్సరంలో సమష్టిగా కదలాల్సిన తెలుగుదేశం శ్రేణులు విభేదాలతో సతమతమవడం, అధికారం కేంద్రీకృతం కావడం పార్టీ సీనియర్ నేతలను కలవర పెడుతోందని ఆంధ్ర‌జ్యోతి స్ప‌ష్టం చేసింది. జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్ త‌మ పార్టీ పై ఏమీ లేద‌ని టిడిపి నేత‌లు బ‌య‌ట‌కు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా, అంత‌ర్గ‌తంగా ఉన్న దుస్థితిని ఆంధ్ర‌జ్యోతే బ‌య‌ట పెట్ట‌టం తో టిడిపి నేత‌లు త‌ల‌లు ప‌ట్టు కుంటున్నారు. ఇక‌, మైల‌వ‌రం నుండి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జోగి ర‌మేష్ ను పెడ‌న నుండి పోటీ చేయించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, కృష్ణ ప్ర‌సాద్ మాత్రం త‌న‌కు వైసిపి నుండి టిక్కెట్ రాక‌పోయినా, జ‌గ‌న్ తోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here