అసంతృప్తుల ఆకస్మిక కలయిక..దీని వెనుక అసలు కధ..!!
టిడిపి లో వైసిపి అనుకూల సమీకరణాలు..ఊహించగలరా..!!
టిడిపిలో జరుగుతున్న పరిణామాలు వైసిపికి కలిసి వస్తాయా. వైసిపి వీటిని అనుకూలంగా మలచుకోగలదా. టిడిపి లో అసమ్మతి నేతలు ఒక్కటవుతున్నారా. వీరంతా టిడిపి హైకమాండ్ కు ఇస్తున్న సంకేతాలేంటి. కొద్ది రోజులుగా టిడిపిలో సీనియర్ నేతల్లో అసంతృప్తలు బాగా కనిపిస్తున్నారు.
గతంలో క్యాబినెట్ విస్తరణ సమయంలో ఎవరైతే అసం తృప్తితో ఉన్నారో వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్దులో స్థానం కల్పించి బుజ్జగించే ప్రయత్నాలు టిడిపి అధి నాయకత్వం చేసింది. కానీ, ఇప్పుడు చాప కింద నీరులా సాగుతున్న పరిణామాలు టిడిపికి మింగుడు పడటం లేదు. ముఖ్యంగా కర్నూలు-అనంతపురం వంటి జిల్లాల్లో టిడిపి నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా సాగుతున్నారు. స్వయంగా పార్టీ అధినేత వీరితో పలుమార్లు భేటీలు ఏర్పాటు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించటం లేదు. ఇక, ముందస్తుగానే ఎన్నికలు వస్తాయని భావిస్తున్న సమయంలో ఇవి మరింతగా టిడిపిని టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏకంగా క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు తాత్కాలికంగా మొత్తబడినట్లు కనిపిస్తున్నప్పటికీ..సమస్
ఆనం ను బుజ్జగించేందుకు గంటాను పంపారని టిడిపి మద్దతు మీడియా చెబుతున్నా..ఆనం ను బుజ్జగించేంత సాన్నిహిత్యం వారిద్దరి మధ్య లేదనేది పార్టీ నేతలే చెబుతున్నారు. గంటా పార్టీ నేతల తీరుపై అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆనం రామనారాయణ రెడ్డి సైతం టిడిపి అధినాయకత్వం పై ఓపెన్ గా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు, తమ వైఖరి ఏంటో తెలియచేయటానికే గంటా వ్యూహాత్మకంగా ఆనంతో సమావేశం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే నెల్లూరు జిల్లాలో ఆదాల, ప్రకాశంలో మాగుంట శ్రీనివాసరెడ్డి, కడప-కర్నూలు-అనంతపురం జిల్లాల్లోని పలువురు నేతలు పార్టీ తీరు పై అసంతృప్తితో ఉన్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉండటంతో సమయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారనే చర్చపార్టీలో జరుగుతోంది.
గంటా రాజకీయంగా ఏదైన నిర్ణయం తీసుకుంటే..విశాఖ లో ఆయ నను అనుసరించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇక, నెల్లూరు లో ఆనం టిడిపిని అధికారికంగా వీడటమే మిగిలింది. ఇప్పుడు వీరిద్దరి ఆకస్మిక కలయిక అనేక సందేహాలకు అవకాశం ఇస్తోంది. ఎన్నికలు సమీపించే వేళ..టిడిపిలో పెరుగుతున్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు వైసిపి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆనం, గంటా లాంటి వారు వైసిపి తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో..అధికార పార్టీని టెన్షన్ పెట్టేందుకు వైసిపి రానున్న రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.