ఎంపి విజయ సాయిరెడ్డి అన్నంత పని చేస్తారా. ముఖ్యమంత్రి చంద్రబాబు ను జైళ్లో పెట్టిస్తానని పదేపదే ఆయన అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు. విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రిన చంద్రబాబు ను నీడలా వెంటాడుతున్నారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుపై ఢిల్లీలో చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని విజయ సాయి గట్టిగా చెబుతున్నారు. ప్రతి ఆరోపణకు తన వద్ద రుజువులు ఉన్నాయని తెలిపారు. తాను ప్రధానినని కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారనని అన్నారు. తాను ప్రధానిని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. ప్రజా సమస్యల గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రధానని కలిశా అవసరమైతే మరో 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తానని చెబుతున్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రికి ఆధారాలను సమర్పిస్తానని తేల్చి చెప్పారు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబా బును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని అన్నారు.
చంద్రబాబు, లోకేష్ చేసిన అవినీతే ఆ భయానికి కారణమని ఆరోపించారు. అయితే, విజయ సాయిరెడ్డి రాజకీయం కోసమో, లేక మైండ్ గేమ్‌లో భాగంగానే ఇప్పటి వరకు చంద్రబాబు టార్గెట్ గా సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో అనేక సార్లు సాయి రెడ్డి ఏపి వ్యవహారాల పై ప్రధానికి, కేంద్రాని కి పలు ఫిర్యాదులు చేసారని టిడిపి నేతలే విమర్శలు చేసారు. ఇప్పుడు స్వయంగా సాయిరెడ్డే ఆ విషయాన్ని తేల్చి చెప్పేసారు. తన వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే ప్రధాని కార్యాలయంలో ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. టిడిపి-బిజెపి మధ్య సాగుతున్న రాజకీయయ యుద్దం, ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని చేస్తున్న విమర్శలు ఇద్దరి మధ్య గ్యాప్ ను మరింతగా పెంచుతున్నాయి. ఇక, కేంద్రం ఏం చేస్తుందో అనే భయం టిడిపి ముఖ్య నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
కర్నాటక ఎన్నిక ల తరువాత ఏపి పై కేంద్రం దృష్టి సారిస్తుంని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంపి విజయ సాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్య లు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయి రెడ్డి ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారనేదే ఇప్పుడు వైసిపి తో పాటుగా టిడిపి శ్రేణుల్లో చర్చకు కారణమైంది. దీంతో, టిడిపి సైతం విజయసాయిరెడ్డి ప్రతీ కదలిక పైనా నిఘా పెట్టినట్లు అర్దమవుతోంది. దీనికి ప్రతి స్పందనగా విజయ సాయిరెడ్డి సైతం ముఖ్యమంత్రి లక్ష్యంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, తాజాగా విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో టిడిపి-వర్సెస్ విజయ సాయిరెడ్డి వయా ఢిల్లీ రాజకీయాలు ఏపి వేదికగా వేడి పుట్టిస్తున్నాయి.