నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా. ముఖ్యమంత్రి చేస్తున్న సవాళ్లు మేకపోతు గాంభీర్య మా..నిజంగానే ఛాలెంజ్ కు నిలబడతారా. ఏడాది లోగా ఎన్నికలు ఉంటే ఉప ఎన్నికలు రావనే లెక్కలు వేసుకున్న తరువాత సీయం చేస్తున్న వాదన ఇది. వైసిపి ఎన్నికలకు ఎప్పుడూ సిద్దమే. ఏప్రిల్ ఆరో తేదీన తమ రాజీనామా లేఖలను స్వయంగా వైసిపి ఎంపీలు..స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేసి స్వయంగా స్పీకర్ కే అందచేసారు. ఆరోజే ఆమోదించమని కోరారు. కానీ, ఇప్పుడు మరోసారి స్పీకర్ తో సమావేశం కోసం వైసిపి ఎంపీలు వర్తమానం అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి సైతం ఉప ఎన్నికలు వచ్చినా..రాకున్నా పార్టీ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజీనామాల ఆమోదం నిర్ణయం..ఎన్నికల విషయం అటు స్పీకర్..ఇటు ఎన్నికల సంఘం చేతిలో ఉంది. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్ని కలు కావాలని ముఖ్యమంత్రికి కుతూహలంగా ఉంటే ఆయన చేతిలోనే నిర్ణయాధికారం ఉంది.
వైసిపి నుండి టిడిపి లోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేల పై వేటు వేసి..ఖాళీలను నోటిఫై చేయవచ్చు. ఎన్నికలకు సిద్దం కావచ్చు. మరి..తన చేతిలోని నిర్ణయాన్ని సీయం ఎందుకు అమలు చేయటం లేదు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం ఆలస్యాన్ని..బిజెపి-వైసిపి మధ్య ఒప్పందంగా అభూత కల్పన చేస్తూ..రాజకీయం చేస్తున్నారు. మరి..తన చేతిలోని నిర్ణయాన్ని అమలు చేయకుండా ఏ బంధం ఆపుతుందో టిడిపి నేతలు సమాధానం చెప్పాలి. ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా నిజంగా 80 శాతం సంతృప్తి స్థాయి ఉంటే..ఉస ఎన్నికలకు వెళ్లటానికి జంకు ఎందుకు. ప్రజల్లో లేని బలాన్ని ఉన్నట్లుగా చిత్రీకిరించే ప్రయత్నాలు చేస్తున్న టిడిపి నేతలు..తమ ఎంపీలతోనే రాజీనామాలు చేయించి..ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఎందుకు చే యటం లేదు. నిజంగా ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలే రాజీనామా చేస్తే ఆ క్రెడిట్ వారికే వస్తుంది కదా. కానీ, ఆ ధై ర్యం చేయలేరు. ఎందుకంటే నిజం ఏంటో…ఎన్నికలు జరిగితే ఎదురయ్యే ఫలితాలేంటే టిడిపి నేతలకు బాగా తెలుసు. కేవలం బిజెపి పై ఏపి ప్రజలకు ఉన్న కోపాన్ని ఆయుధంగా మలచుకొని..వైసిపితో లింకు పెట్టి..పబ్బం గడుపుకోవాలని టిడిపి భావిస్తోంది. నిన్ని మొన్నటి వరకు తాము చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందని ప్రచారం చేస్తూ వచ్చిన టిడిపి నేతలు ఇప్పుడు పూర్తిగా బిజెపిపై తుపాకి పెట్టి..వైసిపిని కార్నర్ చేస్తూ..ఓట్లు దండుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇది 1990 దశకం కాదు, 2014 అంతకంటే కాదు…ఇది..2019. అక్కడ జగన్ రాటు తేలాడు..ప్రజలు పూర్తిగా బాబు అండ్ సపోర్టింగ్ మీడియా చేస్తున్న జిమ్మిక్కులు తెలుసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే జగన్..ఎన్నికలకు భయపడే పరిస్థితి లేదని వైసిపి నేతలు చెబుతున్నారు. మరి..చంద్రబాబు చేస్తున్న ఈ కొత్త తరహా ప్రచారాన్ని ప్రజలు నమ్మతారా.. జగన్ ఎన్నికలంటే భయపడే రకమా అనేది మీరే కామెంట్ల రూపంలో తెలియచేయండి..