మ‌న‌వాళ్లు భ్రీప్‌డ్ మీ, బిగుస్తున్న ఉచ్చు, ఏ-1 ఆయనే – Who is A1 and Who Will Fall in Gripping Trap?

0
431

మ‌న‌వాళ్లు భ్రీప్‌డ్ మీ దేశ వ్యాప్తంగా అంద‌రికీ వెంట‌నే గుర్తొచ్చే ఘ‌ట‌న‌. మూడేళ్ల క్రితం సంచ‌న‌లం సృష్టించిన ఈ కేసు కీల‌క ద‌శ‌కు చేరుకుంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ ని  ప్ర‌లోభ పట్టేందుకు ప్ర‌య‌త్నించార‌నే అభియోగం పై విచార‌ణ మ‌రోసారి ఊపందుకుంది. కొంత కాలంగా కామ్ అయిపోయిన ఈ కేసు పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఉన్న‌తాధికారుల‌తో కీల‌క సుదీర్ఘ స‌మావేశం నిర్వ‌హించారు. నామినేటేడ్ ఎమ్మెల్సీతో మాట్లాడింది టిడిపి అధినేత చంద్ర‌బాబు అని ఫోరెన్సిక్ తేల్చిన‌ట్లుగా పోలీసు అధికారులు ముఖ్య‌మంత్రికి నివేదిక ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల చివ‌రి వారంలో ఈ వివరాల‌తో తుది ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. దీం తో ఇప్పుడు ఈ కేసు ఏపి ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న టిడిపి అధినేత మెడ‌కు ఏ ర‌కంగా  చుట్టుకుంటుందో అనే ఉ త్కంఠ క‌నిపిస్తోంది. అయితే, చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోండి ఎలాంటి ఒత్తిళ్లు ఉండ‌వ‌ని ముఖ్య‌మంత్రి పోలీసు అధికారుల‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఓట్లు కు ఓట్లు వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబే ఏ-1 అని పోలీసుల అధికారులు తేల్చిన‌ట్లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో కోర్టుల్లో ఈ కేసు పై ప్ర‌స్తుతం ఉన్న స్టేట‌స్ పైనా చ‌ర్చ జ‌రిగింది. ఓటు కు నోటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తదితరులపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీని ప్రత్యేక ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనిని హైకోర్టు పక్కనబెట్టింది.

హైకోర్టు ఆదేశాన్ని కూడా ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. సుప్రీం చీఫ్‌ జస్టి స్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంలో కేసు విచారణలో ఉంది. ఈ కేసులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో, ఈ కేసుపై గత వారం రోజులుగా పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేప థ్యం లోనే సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కౌంటర్‌ దాఖలు చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. ఒక వైపు న్యాయ‌ప‌రంగా కోర్టుల్లో దాఖ‌లు చేయాల్సిన కౌంట‌ర్ తో పాటుగా తుది ఛార్జ్‌షీట్ దాఖ‌లు పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇప్ప‌టికే కేంద్రం ఎటువంటి చ‌ర్య‌ల‌కు దిగు తుందో అనే టెన్ష‌న్ తో ఉన్న టిడిపి నేత‌ల‌కు ఇప్పుడు స‌డ‌న్ గా తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో జ‌రిగిన స‌మా వేశంతో ఉచ్చు బిగుస్తోంద‌నే విష‌యం అర్ద‌మ‌వుతోంది. ఇక‌, గ‌తంలో ఈ కేసుకు కౌంట‌ర్ గా తెలంగాణ ముఖ్యుల పై నాడు ఏపి ప్ర‌భుత్వం టెలిపోన్ ట్యాపింగ్ అంశం తెర మీద‌కు తెచ్చింది. మ‌రి ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం టిడిపి ముఖ్యులు దీని పై ఏ ర‌కంగా రియాక్ట్ అవుతారో ఎటువంటి ప‌రిణామాలు జ‌రుగుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here