2014 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన తర్వాత ఈసారి ఎలా అయినా సరే గెలుపు తనది కావాలని గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ చెయ్యకూడదను అని పక్కా ప్రణాళిక వేసుకున్నారు. అందుకోసం తనకి సలహాదారునిగా మరియు రాజకీయ వ్యూహకర్తగా బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ను తన సలహాదారునిగా దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం నియమించుకున్నారు. అప్పటికే ఎంతో మంది కీలక రాజకీయ నాయకుల గెలుపుకు వూహ్యాలు రచించిన ప్రశాంత్ కిషోర్ జగన్ కు గెలుపును మరింత చేరువ చేసారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎన్నికలు ముగిసి ఫలితాలు అయ్యిన తర్వాత జగన్ నుంచి అతను వేరయ్యారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు జగన్ మరో కీలక వ్యక్తిని తన సలహాదారునిగా నియమించుకున్నారట.
ఆంధ్ర రాష్ట్ర మాజీ కార్యదర్శి అజయ్ కల్లామ్ జగన్ ముఖ్య సలహాదారునిగా నియమించుకున్నారట. ఆయనకు క్యాబినెట్ హోదా ఇచ్చి ముఖ్యమంత్రి కార్యాలయం లో ఉన్నటువంటి కార్యదర్శుల అందరికీ నేతృత్వం వహించనున్నట్టు తెలుస్తుంది. ఈయన దాదాపు మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సలహాలు మరియు సూచనలు అందించనున్నారు అని సమాచారం.