వైసిపిని న‌డింపించిందెవ‌రు. జ‌గ‌న్ ఒక్క‌రేనా – Who Stands For YCP Jagan or Any Person?

0
452

వైసిపిని న‌డింపించిందెవ‌రు. జ‌గ‌న్ ఒక్క‌రేనా.ఇంకెవ‌రి పాత్ర అయినా ఉందా. ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌న్న చంద్ర‌బాబును ఈ ప‌రిస్థితికి తెచ్చిన వ్యూహాలు..ఆలోచ‌న‌లు వైసిపి ఎవ‌రు అమ‌లు చేసారు. కొంత కాలంగా రాష్ట్ర రాజ‌కీయాల పై వైసిపి పైచేయి సాధించిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏపికి బిజెపి అన్యాయం చేస్తుంద‌ని..బిజెపి మీద‌కు త‌న వైఫ‌ల్యాల‌ను నెట్టివేసి రాజ‌కీయంగా మైలేజ్ సాధించేందుకు ముఖ్య‌మంత్రి ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో వైసిపిత‌న వ్యూహాల‌ను ప‌దును పెట్టింది. ప‌రోక్షంగా టిడిపి పై ఒత్తిడి పెంచింది.

ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం..ఎంపీల రాజీనామాల కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేసింది. దీంతో..టిడిపి ఆత్మ‌ర‌క్ష ణ లో పడింది. వైసిపికి మైలేజ్ రాకుండా ఉండాలంటే..ముందుగా కేంద్రంలో టిడిపి మంత్రుల‌ను ఉప సంహ‌రించుకుంది. ఆ వెంట‌నే ఎన్డీఏ ఓ కొన‌సాగుతామని ప్ర‌క‌టించింది. వైసిపి మ‌రింత ఒత్తిడి పెంచే వ్యూహాల‌ను అమ‌లు చేసింది. టిడిపి ఇక ఎన్డీఏ లో సైతం కొన‌సాగ‌లేని ప‌రిస్థితిని క్రియేట్ చేసింది. ముందుగా ప్ర‌క‌టించిన తేదీ కంటే అవిశ్వాసం మ‌రింత ముందుగా పెట్టి..టిడిపి అధినాయ క‌త్వాన్ని ఒత్తిడికి గురి చేసింది .దంతో..త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తొలుత వైసిపి పెట్టే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పిన టిడిపి..ఆ త‌రువాత ఎన్డీఏ కు డ్ బై చెప్పింది. ఆ వెంట‌నే వైసిపికి పోటీగా అవిశ్వాసం నోటీసు ఇచ్చింది.

ఇక‌, మ‌ద్ద‌తు పొంద‌టంతోనూ రెం డు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. మ‌రో వైపె ప‌వ‌న్ పైనా చంద్బ‌రాబు పార్ట‌న‌ర్ అంటూ వైసిపి అధినేత ఒత్తిడి కొన‌సాగించారు. దీని ఫితంగా జ‌నసేన అధినేత త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం టిడిపికి మ‌ద్ద‌తుగా లేన‌ని నిరూపించుకోవ‌టం కోసం టిడిపి పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు చేసారు. దీంతో..ఇప్పుడు బిజెపి-జ‌న‌సేన రెండూ టిడిపికి దూర‌మ‌య్యాయి. ఇంత ప‌క్క‌గా వ్యూహాలు అమ‌లు చేయ‌టం తో పాటుగా వైసిపి ని టిడిపి అనున‌స‌రించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. దీని వెనుక పార్టీ అధినేత జ‌గ‌న్ తో పాటుగా వ్య‌హ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క రోల్ పోషించిన‌ట్లు స‌మాచారం. ఇక‌, క్షేత్ర స్థాయిలో విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించారు. మొత్తానికి వైసిపి అనుస‌రించిన వ్యూహాల చ‌ట్ర‌బంధంలో టిడిపి చిక్కుకున్న‌ట్లుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసిపి వ్యూహాల కార‌ణంగా తన ప్ర‌మేయం లేకుండానే చంద్ర‌బాబు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు ప‌రిష్కారం సైతం ఆయ‌న చేతుల్లో లేదు. దీంతో..ఇప్పుడు వైసిపి ఏం చేస్తే..అదే చేస్తూ..రాజ‌కీయంగా ప‌ట్టు నిరూపించుకొనేందుకు చంద్ర‌బాబు తిప్ప‌లు ప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here