టిటిడి ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు..ఏపి ప్రభుత్వం మధ్య వైరం ఎందుకు. ఎక్కడ మొదలైంది. ఏపి సీయం మీద సంచలన ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు. కొద్ది రోజులుగా ఏపిలో వివాదాస్పదంగా మారిన రమణ దీక్షితుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇప్పటికే రమణ దీక్షితులు శ్రీవారి ఆభరణాలు..స్వామి వారి ప్రసాదం పోటులో త్రవ్వకాల పై ఆరోపణలు చేసారు. వీటిని టిటిడి ఈవో ఖండించారు. అయితే, రమణ దీక్షితులు ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పై రాజకీయ విమర్శలు చేయటానికి కారణాలను బయట పెట్టారు. గత వారం బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు తాను ఆలయ పద్దతుల ప్రకారం స్వాగతం పలికి..ప్రసాదం-ఆశీర్వాదం ఇచ్చానని వివరించారు. అదే సమయంలో శ్రీవారి ప్రసారం పోటు వద్దకు తీసుకెళ్లి..అక్కడ జరిగిన త్రవ్వకాల గురించి అమిత్ షా కు వివరించి చెప్పానని..అదే తన పై రాజకీయంగా ఇప్పుడు చేస్తున్న విమర్శలకు కారణమని రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు.
ఇక, టిటిడి లో ముఖ్యమంత్రికి ఇష్టమైన వ్యక్తులే కీలక స్థానాల్లో ఉంటున్నారని వివరించారు. ఇక, టిటిడి నిధులు కేవలం తిరుమలలో స్వామి వారి ఉత్సవాలకు..అన్నదానం..ఆభరణాల తయారీకి మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని..అయితే టిటిడి నిధులను వంద కోట్ల వరకు ఒంటిమిట్టలో దేవాలయం అభివృద్ది కి మంజూరు చేసారని..సైన్స్ కాంగ్రెస్ కోసం ప్రధాని తిరుపతి వచ్చిన సమయంలో తిరుపతి బ్యూటిఫికేషన్ కోసం తిరుమ ల నిధులు వినియో గించారని సంచలన ఆరోపణ చేసారు. తిరుపతిలో కాంక్రీట్ రోడ్డు కోసం పది కోట్లు వాడారని..నిధులు ఇలా తీసుకోవటానికి నిబంధనలు అంగీకరించవని తెలిపారు. వేల కోట్ల రూపాయాలు విలువ చేసే ఆభరణాలు రిటైర్డ్ ఉద్యోగి డాలర్ శేషాద్రి వద్ద పెట్టారని రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. గత ఏడాది జూన్ -డిసెంబర్ మధ్య కాలం దేవుడి ప్రసాదాల కోసం వినియోగించే కిచెన్ మూసివేసారని..గత వెయ్యేళ్ల కాలంలో ఎప్పుడూ అలా జరగలేదని..ఆ ప్రాంతాన్ని చూస్తే భూకంపం వచ్చిన ప్రదేశం ఎలా ఉంటుందో అలా అనిపించి..ఈ వో దృష్టికి తీసుకెళ్తే..తనకు తెలియదని సమాధా నం ఇచ్చారని వివరించారు. ఇదే సమయంలో రమణ దీక్షితులకు లెక్కకు మించి స్థలాలు..ఇళ్లు ఉన్నాయని..ఆడి కార్ లో తిరుగుతారని టిడిపి శ్రేణులు తమ మద్దతు మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈవో, టిటిడి ఛైర్మన్ సైతం అంతా పారదర్శకంగా ఉందని చెప్పుకొస్తున్నారు. రమణ దీక్షితుల ఆరోపణల వెనుక బిజెపి ఉందని టిడిపి నేతలు ఆరోపి స్తున్నారు. అయితే, అమిత్షా కు శ్రీవారి ప్రసాదం కిచెన్ చూపించినందుకే రమణ దీక్షితుల పై పదవీ విరమణ పేరుతో వేటు..ఆ తరువాత రాజకీయంగా విమర్శలు ప్రారంభం అయ్యాయనే విషయం అర్దమవుతోంది. కోట్లాది మంది ప్రజల మనోభాలతో ముడి పడి ఉన్న టిటిడి వ్యవహారం..రానున్న రోజుల్లొ ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.