వైసిపి ఆ విష‌యం నిర్ల‌క్ష్యం చేస్తోందా. అందులో వెనుక బ‌డి ఉందా? – YCP neglect that matter?or Is it backwards?

0
446

వైసిపి ఆ విష‌యం నిర్ల‌క్ష్యం చేస్తోందా. లేక అందులో వెనుక బ‌డి ఉందా. టిడిపి..వారి మ‌ద్ద‌తు మీడియా వైసిపి లక్ష్యంగా 2014 ఎన్నిక‌ల్లో చేసిన ప్ర‌చారాన్నే ఇప్పుడు 2019 ఎన్నికల ముందు మ‌రోసారి ప్రారంభించింది. నాడు జ‌గ‌న్ బెయిల్ కోసం కాంగ్రెస్ తో లాలూచీ ప‌డ్డాడ‌ని..త‌ల్లి కాంగ్రెస్ -పిల్ల కాంగ్రెస్ అంటూ ప్ర‌చారం చేసింది. కాంగ్రెస్ తో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా..ఎదురు నిలిచ‌నందుకే జ‌గ‌న్ పై కేసులు న‌మోదైన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కానీ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టించేందుకు టిడిపి తో పాటుగా స‌పోర్టింగ్ మీడియా శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేసారు. జ‌గ‌న్ పై కేసుల విష‌యంలో నూ త‌ప్పు దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

విజ‌య్ మాల్యా..నీవ‌ర్ మోదీ తో జ‌గ‌న్ ను పోలుస్తున్నారు. వారి పై తీవ్ర ఆర్దిక నేరాల అభియోగాలు ఉన్నాయి. కానీ, జ‌గ‌న్ పై సిబిఐ న‌మోద చేసిన అభియోగాల్లో దాదాపు 700 కోట్ల విలువైన             అభియోగాల‌ను కోర్టు కొట్టివేసింద‌ని..మ‌రో అయిదు వంద‌ల కోట్ల మేర అభియోగాల పై విచార‌ణ జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయవాదులు చెబుతున్నారు. ఇక‌, జ‌గ‌న్ కేసుల్లోని అధికారుల‌కు ఒక్కొక్క‌రికి క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఇక‌, పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ను డామేజ్ చేసేందుకు టిడిపి మ‌రో సారి విష ప్ర‌చారానికి తెర తీసింది. వైసిపి- బిజెపి కి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ జోరుగా ప్ర‌చారం చేస్తోంది. త‌మ వైఫ‌ల్యాల‌ను బిజెపి నైకి నెట్టేసి..వారితో తెగ తెంపులు చేసుకున్న టిడిపి..ఇప్పుడు బిజెపి పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను వైసిపికి అంట‌గ‌ట్టే ప్ర‌య త్నాలు చేస్తోంది. అందులో భాగంగా..పార్టీ అధినేత మొద‌లు కింది స్థాయి నేత‌ల వ‌ర‌కు ఒకే వాయిస్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకె ళ్తున్నారు.

వైసిపి నేత‌లు అప్పుడ‌ప్పుడు టిడిపి విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొడుతున్నా..అది స‌మ‌ర్ధ‌వంతంగా క‌నిపించ‌టం లేదు . దీంతో..టిడిపి మ‌రింత‌గా ఆరోప‌ణ‌ల స్థాయిని పెంచుతోంది. అవ‌స‌రానికి త‌గిన‌ట్లుగా పొత్తులు..సంబంధాలు మార్చుకొనే టిడిపి గురించి ఏ మీడియా రాయ‌టం లేదు. దీనిని ఎత్తి చూప‌టంలో వైసిపి నేత‌లు అంత యాక్టివ్ గా క‌నిపించ‌టం లేదు. అన్నీ జ‌గ‌న్ చూసుకుంటారులే..అనే ఉదాసీన‌త పార్టీకి న‌ష్టం చేస్తోంది. టిడిపి ఏ స్థాయిలో ఈ ర‌క‌మైన ప్ర‌చారం చేస్తోందో అదే స్థాయిలో వైసిపి నుండి రియాక్ష‌న్ ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రి..వైసిసి నేత‌లు ఇప్ప‌టికైనా ఈ ప్ర‌చారాన్ని ఏ ర‌కంగా తిప్పి కొడ‌తారో..టిడిపి ని ఏ ర‌కంగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తారో చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here