జనసేన అధినేత పవన్ కళ్యాన్ తాజా లక్ష్యం ఎవరు. ప్రజల్లోకి వచ్చి ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి పవన్ చేపడుతున్న బస్‌యాత్ర పై అనేక అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాన్ దాదాపు 40 రోజుల పాటు రాజకీయ యాత్ర చేయాలని నిర్ణయించారు. తన యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్ ను సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం 13 జిల్లా లు కవర్ అయ్యేలా పవన్ టూర్ షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. నాలుగేళ్లుగా టిడిపి మిత్రుడుగా ఉన్న పవన్ పార్టీ ఆవిర్భావ సభ ద్వారా టిడిపి ని టార్గెట్ చేయటం మొదలు పెట్టారు.
ఇక, ఈ నలబై రోజుల యాత్రలో సైతం టిడిపి లక్ష్యంగా జనసేన అధినేత ప్రసంగాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. కొన్ని మీడియా సంస్థల పైన వపన్ తీవ్ర విమర్శలు చేసారు. దీంతో..పవన్ టూర్ కు మీడియా నుండి గతంలో మాదిరి భారీ కవరేజ్ ఉండే అవకాశాలు కనిపించటం లేదు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయం..టిడిపి జిల్లాల సభలు పెడుతున్న ఈ పరిస్థితుల్లో పవన్ సైతం ప్రజల్లోకి వస్తున్నారు. టిడిపి – మీడియా సంస్థల మధ్య సంబంధాలను ట్విట్టర్ ద్వారా బయట పెడుతు న్న పపవన్..ఇక ప్రజల్లోనే ఆ విషయాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల పర్యటనలో పార్టీ జిల్లా స్థాయి కార్యవర్గాలను సైతం ప్రకటించనున్నారు. టిడిపి అవినీతి పై తన బహిరంగ సభ ద్వారా అస్త్రాలను సంధించటం మొదలు పెట్టిన పవన్..ఇప్పుడు ముఖ్యమంత్రి తనయుడితో పాటుగా మంత్రులు..వారి కుటుంబ సభ్యుల అవినీతి వ్యవహారాలను బయట పెట్టటానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు టిడిపి నేతలు బిజెపి ని టార్గెట్ చేస్తూ.. జగన్-పవన్ బిజెపికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తిప్పి కొట్టేలా..టిడిపి ప్రభుత్వం చేసిన నిర్వాకాలను పవన్ ఆధారాలతో సహా బయట పెట్టటానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఇక, జగన్ పై పవన్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
పవన్ కు మద్దతుగా ఇప్పటకే మెగా కుటుంబం మొత్తం ఒక్కటయింది. దీంతో..సినీ పరిశ్రమలో నూ పవన్ రాజకీయ యాత్ర పై ఆసక్తి పెరిగింది. సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణా మాలు..నెలకొన్ని పరిస్థితులతో పాటుగా..అధికార పార్టీకి కొందరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల మీద పవన్ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..పవన్ టూర్ పై టిడిపి – వైసిపి శ్రేణులు ఆసక్తిగా ఉన్నాయి. పవన్ ను రాజకీయ ప్రత్యర్ధిగా కాకుండా..ఇప్పటికీ సినీ యాక్టర్ గానే జగన్ భావిస్తున్నారు. అయిత, జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలోనే పవన్ ప్రజల మధ్యకు వస్తున్నారు. ఆ సమయంలో వైసిపిని లక్ష్యంగా చేసుకొని ఏమైనా విమర్శలు..ఆరోపణలు చేస్తే…తిప్పి కొట్టేందుకు వైసిసి సైతం సమాయత్తం అవుతోంది