గుట్టు ర‌ట్టు..వైసిపి చేతికి టిడిపి బ్ర‌హ్మ‌స్త్రం – YCP Revenge on TDP

0
467

గుట్టు ర‌ట్టు అయింది. వైసిపి చేతికి టిడిపి బ్ర‌హ్మ‌స్త్రం అందించింది. ఏపిలో ఒంట‌రి అయిన టిడిపి ఇక‌, కాంగ్రెస్ తో దోస్తీకి బెంగుళూరు వేదిక‌గా క్లియ‌ర్ ఇండికేష‌న్ ఇచ్చేసారు. విక్ట‌రీ సింబ‌ల్ కాదు..హ‌స్తం తోటో మేము అనే సంకేతాలు స్ప‌ష్టంగా చూపించారు. బిజెపి తో తెగ తెంపుల తరువాత త‌మ‌ది నాన్ కాంగ్రెస్‌- నాన్ బిజెపి పార్టీ అని టిడిపి నేత‌లు చెప్పుకొస్తున్నా రు. థ‌ర్డ్ ఫ్రంట్ అనే నినాదం ఎత్తుకున్న టిఆర్‌య‌స్ అధినేత సైం బెంగుళూరు వ‌చ్చారు. కానీ, అక్క‌డ కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి వేదిక‌ను పంచుకోవ‌టం ఇష్టం లేక ముందుగానే కుమార స్వామి ని క‌లిసి తిరుగు ప్ర‌యాణ మ‌య్యారు. కానీ, టిడిపి అధినేత మాత్రం కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి వేదిక పంచుకోవ‌ట‌మే కాదు…త‌న విక్ట‌రీ సింబ‌ల్ ను ప‌క్క‌న పెట్టేసి మీర రాహు ల్ ప‌క్క‌నే నిల‌బ‌డి మరీ త‌న హ‌స్త‌వాసి ని చూపించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ తో క‌ర‌చాల‌నంతో స‌రిపెట్ట‌కుండా.. వె న్ను త‌ట్టి మ‌రీ ప్రోత్స‌హించారు. మీకు మేము..మాకు మీరు అనే సంకేతాల‌ను బెంగుళూరు వేదిక‌గా స్ప‌ష్టంగా ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు బిజెపి ఏపికి ద్రోహం చేసింద‌ని..త‌న పిలుపు మేర‌కే క‌ర్నాట‌క లో బిజెపి ని ఓడించారంటూ టిడిపి అధినేత ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే, అక్క‌డ బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ..కాంగ్రెస్ అధికారం కోల్పోయింద‌నే విష‌యాన్ని ప క్క దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు.

ఇక‌, ఏపి రాజ‌కీయాల్లో గ‌త ఎన్నిక‌ల్లో క‌లిసి వ‌చ్చిన బిజెపి- వ‌ప‌న్ ఇద్ద‌రూ ఇప్పుడు దూర‌మ‌య్యారు. ఏ ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగా ఫైట్ చేసి గెలిచిన చ‌రిత్ర టిడిపికి లేదు. దీంతో..ఇక కాంగ్రెస్ తో జ‌త క‌ట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి టిడిపికి ఏర్పడింది. ఇందులో భాగంగానే..తెలంగాణ టిడిపి నేత‌ల‌ను ముందుగానే కాంగ్రెస్ లోకి పంపార‌నే వాద‌న ఉంది. ఇక‌, ఏపికి అన్యాయం చేసిన కాంగ్రెస్ కు అడ్ర‌స్ గ‌ల్లంతు చేసిన ఏపి ప్ర‌జ‌లు..ఇప్పుడు టిడిపి అదే పార్టీతో అంట‌కాగితే ప్ర‌జ‌లు స‌హిస్తారా అంటే..మేము ఏది చేసినా ప్ర‌జ‌లు సైతం అంగీక‌రించాల్సిందే అనే విధంగా టిడిపి వ్య‌వ‌హ‌ర శైలి క‌నిపిస్తోంది. ఇక‌, ఏపికి అన్యాయం చేసిన బిజెపి తో వైసిపి లోపాయి కారీగా మైత్రి కొన‌సాగిస్తుంద‌ని.. బిజెపి-వైసిపి మ‌ధ్య అవ‌గాహ‌న ఉంద‌ని ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్న టిడిపి నేత‌లు..ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ఇది..వైసిపి చేతికి టిడిపి యే ఇచ్చిన బ్ర‌హ్మ‌స్త్రం. త‌మ కు బిజెపి తో లింకులు అంట‌గ‌డుతూ డామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న టిడిపిని ప్ర‌జ‌ల్లో నిల‌దీసే అవ‌కాశం ఇప్పుడు వైసిపికి వ‌చ్చింది. వైసిపి అధినేత ఇప్ప‌టికే కొత్త పెళ్లికూత‌రు కోసం టిడిపి..కాంగ్రెస్ వైపు చూస్తోంద‌ని విమర్శించారు. ఇదే విధంగా..టిడిపి-కాంగ్రెస్ మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధం మ‌రో సారి బ‌య‌ట ప‌డ‌టంతో..దీనిని వైసిపి నేత‌లు విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించారు. దీంతో..టిడిపి కి మ‌ద్ద‌తుగా వెంట‌నే మీడియా రంగంలోకి దిగింది. అమ‌రావతిలో 5 ల‌క్ష‌ల  మందితో ధ‌ర్మ పోరాటం చేయాల‌ని టిడిపి డిసైడ్ అయిందని..ఈ స‌భ‌కు కాంగ్రెస్-బిజెపి మిన‌హా ఇత‌ర పార్టీల నేత‌ల‌కు ఆహ్వానం అంటూ మొద‌టి పేజీ క‌ధ‌నం తో డామేజి కంట్రోల్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. అయితే, బెంగుళూరు లో కుమాస్వామి ప్ర‌మాణ స్వీకారం కు వ‌చ్చే నేత‌ల‌తో ఫొటోలు దిగి..ఇది త‌న బ‌ల‌మ‌ని ప్ర‌చారం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన టిడిపి కి..ఇప్పుడు అదే ఏపి లో డామేజ్ అవ్వ‌టానికి కార‌ణ‌మైంది. బిజెపి పై ఏపి ప్ర‌జ‌లు ఎంత ఆగ్ర‌హంతో ఉన్నారో..కాంగ్రెస్ పైనా అదే ఆగ్ర‌హం తో ఉన్నారు. ఇక‌, రాకీయంగా టిడిపిని ఇరుకున పెట్టే అవ‌కాశం ద‌క్కించుకున్న వైసిపి..ఈ బ్ర‌హ్మ‌స్త్రాన్ని ఏ ర‌కంగా ప్ర‌యోగిస్తుందో..ఎలా స‌క్సెస్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here