వైసిపి సీరియస్ డెసిషన్. టిడిపి ని ఆత్మరక్షణలోకి నెట్టే నిర్ణయం. ప్రత్యేక హోదా పై పోరుకు జోష్ తేవాలని నిర్ణయించిన వైసిపి అధినేత. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా రాజీనామా చేసిన ఎంపీల కొత్త వ్యూహం. తొలి నుండి ప్రత్యేక హోదా కోసమని ముందుండి పోరాడుతున్న వైసిపి మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసి..ఆమరణ నిరహార దీక్ష చేసిన ఎంపీల పోరాటానికి విలువ పెంచేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. దీని కోసం రాజీనామాల ఆ మోదానికి స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్ లో వైసిపి కి చెందిన అయిదుగురి ఎంపీల రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని సత్వరం ఆమోదించి… ఎన్ని కల సంఘానికి నివేదించేం దుకు స్పీకర్ ను కలిసి ఒత్తిడి తేవాలని వైసిపి అధినాయకత్వం ఆదేశించింది. ఎంపీల రాజీనామాలు..వారు చేసిన ఆమర ణ దీక్షలకు మద్దతు రాకుండా చూసేందుకు టిడిపి నేతలతో పాటుగా మద్దతు మీడియా అనేక ప్రయత్నాలు చేసింది. డిల్లీ వేదికగా చేసిన ఆమరణ దీక్షలను పోలీసులు భగ్నం చేసారు. ఇక, టిడిపి సైతం ప్రత్యేక హోదా పై యూ టర్న్ తీసు కుంది. ప్రత్యేక హోదా కోసమని చెబుతూ తిరుపతిలో సభ ఏర్పాటు చేసింది. ఈ నెలాఖరులోగా విశాఖలో మరో సభ ఏ ర్పాటుకు నిర్ణయిచింది. దీంతో…వైసిపి అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే..ఏపి ప్రభుత్వం పై ఒత్తిడి తె చ్చేలా ద్విముఖ వ్యూహానికి పావులు కదుపుతున్నారు. ఒక వైపు కర్నాటక ఎన్నికల తరువాత తమ పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని..అవినీతి జరిగిన అంశాల పై చర్యలు తీసుకుంటుందని టిడిపి నేతలే అంతర్గత చర్చల్లో అంగీకరి స్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి పట్టు బట్టి మరీ ఓటు కు నోటు కేసు పై వరుస సమీక్షలు నిర్వహిస్తు న్నారు. అంతటితో ఆగకుండా ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో తీసుకున్న వివాదాస్పద భూ కేటాయిం పుల పైనా పునర్విచారణ జరిపేలా కొత్త కమిషన్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో…టిడిపి పూర్తిగా ఆత్మరక్షణ లో పడిన సమయంలో..మరింత ఒత్తిడి పెంచేలా క్షేత్ర స్థాయిలో ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయాలని ప్రాధమికం గా నిర్ణయించారు. దీనికి తోడు..ఎంపీల ద్వారా ఒత్తిడి పెంచి స్పీకర్ రాజీనామాలను ఆమోదించేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ రాజీనామాలు వెంటనే ఆమోదిస్తే..ఉప ఎన్నికలు తప్పవు. ఆలస్యం చేస్తే.. సాధారణ ఎన్నికలను సాకుగా చూపించి ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని వైసిపి అంచనా వేస్తోంది.
సాధారణ ఎన్నికల ముందే టిడిపిని పూర్తి ఢిఫెన్స్‌లో పడేయటంతో పాటుగా అయిదు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే..టిడిపి పోటీ చేసినా..చేయకున్నా..ఆ పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని వైసిపి లెక్కలు వేస్తోంది. దీంతో..రాజీనామాల ఆమోదం కోసం ఒక ఢిల్లీలోనే మకాం వేయాలని వైసిపి నిర్ణయించింది.