వైసిపి ఫిరాయింపు ఎంపీల చర్య‌లు ఉంటాయా – YCP to TDP Changed defective MPs have defective activities?

0
438

వైసిపి ఫిరాయింపు ఎంపీల చర్య‌లు ఉంటాయా. ఢిల్లీ నుండి అందుతున్న స‌మాచారం మేర‌కు వైసిపి నుండి గెలిచి టిడిపిలో చేరి న ఫిరాయింపు ఎంపీల పై చ‌ర్య‌ల పై అడుగులు వేగంగా ప‌డుతున్నాయి. 2014 లో వైసిపి నుండి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి..అర‌కు ఎంపి కొత్త ప‌ల్లిగీత టిడిపిలో చేరారు. కొంత కాలం క్రితం కర్నూలు ఎంపి బుట్టా రేణుక సైతం టిడిపి లో అన‌ధికారికంగా చేరారు. అయితే, ఎస్పీవై రెడ్డి, కొత్త‌పల్లి గీత పై చాలా కాలం క్రిత‌మే పార్టీ ఫిరాయింపు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అభ్య‌ర్ధిస్తూ స్పీక‌ర్ కు పిటీష‌న్ ఇచ్చారు. అయితే, ఈ పిటీష‌న్ ను స్పీక‌ర్ ఎథిక్స్ క‌మిటీకి రిఫ‌ర్ చేసిన‌ట్లు వైసిపి ఎంపీలు చెబుతు న్నారు. ఎస్పీవై రెడ్డి అనారోగ్యం తో ఉన్నారు. ఆయ‌న బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సైతం దూరంగా ఉన్నారు. ఇక‌, కొత్త‌ప‌ల్లి గీత సైతం తాను వైసిపి లో లేన‌ని ఒక‌సారి..టిడిపిలో సంబంధం లేద‌ని మ‌రొక‌సారి పేర్కొన్నారు. అయినా..పార్టీని ధిక్క‌రించిన వీరి పై చ‌ర్య లు తీసుకోవాల‌ని వైసిపి నేత‌లు తాజాగా స్పీక‌ర్ కు విజ్ఞ‌ప్తి చేసారు.

ఏపిలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మ‌రోసారి ఈ ప‌రిణ‌మాల పై చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. బిజెపిని డామేజ్ చేసే విధంగా ఏపిలో టిడిపి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బిజెపి నేత‌లు ఆరోపిస్తు న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుండి టిడిపి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ రెండు పార్టీల మ‌ధ్య మ‌రింత‌గా గ్యాప్ పెరిగింది. ఇంకా ఈ రెండు పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తి పరిణామాల‌పై ఢిల్లీలోనూ క‌ద‌లికలు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇదే స‌మ‌యంలో.. పార్ల‌మెంట్‌లో వైసిపి ఎంపీల ఆందోళ‌న స‌మ‌యంలో ఫిరాయిం పు ఎంపీల పై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే ఒత్తిడిని వైసిపి ఎంపీలు పెంచిన‌ట్లు తెలుస్తోంది. దీని ఫ‌లితం త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని వైసిపి నేత‌లు ధీమాగా చెబుతున్నారు. వైసిపి నేత‌లు చెబుతుంది ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే..త్వ‌ర‌లోనే ఫిరాయింపు ఎంపీల పై చ‌ర్య‌లు ఈ స‌మావేశాలు ముగిసే లోగా ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేషకుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here