వైసిపి కి రాజ్యసభ సీటు దక్కుతుందా. టిడిపి ఎత్తుగడలను వైసిపి తిప్పికొడుతుందా. టిడిపి అభ్యర్ధులకు బిజెపి మద్దతు ఇస్తుందా. ఇప్పుడు ఇదే ఏపి పాలిటిక్స్‌లో హాట్ చర్చ. ఇప్పటికే ఏపి నుండి మూడు రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వైసిపి తమ అభ్యర్ధిగా ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని ప్రకటించింది. టిడిపి మాత్రం తమ అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఉన్న సంఖ్యబలం మేర టిడిపి కి ఇద్దరు..వైసిపి కి ఒక్కరు రాజ్యసభకు అవకాశం దక్కాల్సి ఉంది. కానీ, టిడిపి మూడు స్థానాలు తమ ఖాతాలో వేసుకొనే విధంగా పావులు కదుపుతోంది. ఒక్కో అభ్యర్ధిని గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. సంఖ్య పరంగా చూసుకుంటే టిడిపికి 102 మంది సభ్యులతో పాటుగా ఇప్పటికే టిడిపిలో విలీనం అయిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు ఉంది. ఇక, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయంతో బిజెపికి చెందిన నలుగురు టిడిపి అభ్యర్ధికి మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహగా మారింది. వైసిపి నుండి టిడిపి లోకి ఫిరాయించిన వారి సంఖ్య 23గా ఉంది. బిజెపి సభ్యు లను మినహాయిస్తే..టిడిపి బలం 127 గా ఉంది. బిజెపి మద్దతు ఇస్తే అది 131కి పెరుగుతంది.
మూడు రాజ్యసభ సీట్లు గెలవాలం టే టిడిపికి మరో ఎమ్మెల్యే మద్దతు అవసరం. ఇక, వైసిపి విషయానికి వస్తే ప్రస్తుతం వైసిపి వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 44. ఇది సరిగ్గా ఒక రాజ్యసభ అభ్యర్ధిని గెలిపించుకోవటానికి సరిపోతుంది. అయితే తమతో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇదే సమయంఓల..వైసిపి నుండి టిడిపి లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు వైసిపి తో టచ్‌లోకి వచ్చిన ట్లు సమాచారం. జిల్లాల వారీగా తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసిపికి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే పనులను ఇంకా టిడిపి కొనసాగిస్తోంది. కానీ, వైసిపి నుండి ఎవరూ వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. వైసిపి అంచనా వేస్తున్నట్లుగా టిడిపి శిబిరం నుండి వైసిపికి పోలింగ్ సమయంలో మద్దతు లభిస్తే..అది ఖచ్చితంగా టిడిపికి కోలుకోలేని షాక్ గా మారుతుంది. కేవలం ఒక్క ఎమ్మెల్యే తో ఇప్పుడు రాజ్యసభ అభ్యర్ధుల జయాపజయాలు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసిపి నేతలు మాత్రం ఖచ్చితంగా తాము తమకు దక్కాల్సిన రాజ్యసభ సీటును దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందు కోసం ఈనెల7వ తేదీన వైసిపి అభ్యర్ధి నామినేషన్ కు ముమూర్తం ఖరారైంది. మరి..టిడిపి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వైసిపి..కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. మరి..ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాల్సిందే..