జగన్ పాదయాత్రలో సంచలన విషయం. జగన్ వెనుక టిడిపి కోవర్టులు. పాదయాత్రలో ప్రతీ అడుగులోనూ ఫాలో అవుతున్న టిడిపి శ్రేణులు. జగన్ పాదయాత్ర పై తొలి నుండి ఏపి ప్రభుత్వం నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. టిడిపి అనుకూల ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రోన్లు ఏర్పాటు చేసి మరీ నిఘా పెట్టారు. జగన్ ఎవరితో మాట్లాడుతున్నారు..ఎవరెవరు వచ్చి జగన్ ను కలుస్తున్నారు..జగన్ ఎటువంటి హామీలిస్తున్నారనే దాని పై ఇప్పటి వరకు దృష్టి సారించారు. అయితే, జగన్ పాదయాత్రలో వైసిపి శ్రేణులే కాదు..టిడిపి నియమించిన వాలంటీర్లు ఫాలో అవుతున్నారు. దీనిని పసి గట్టిన వైసిపి నేతలు వారిని విచారించగా అసలు విషయం బటయకు వచ్చింది.
ఉండవల్లి సమీపంలో జగన్ సభలో కొందరు టమోటాలు..కోడిగుడ్లతో జగన్ సభకు హాజరు కావటం..వారిని వైసిపి శ్రేణులు గుర్తించి పంపించి వేయటం జరిగింది. ఇక, ఇప్పుడు ప్రత్యేకంగా పాదయాత్రలో అడుగడుగునా జరుగుతున్న పరిణామాలను సేకరించి..టిడిపి కార్యాలయానికి సమాచారం చేరవేయటం వారి ప్రధాన విధి. వైసిపి కార్యకర్తల్లో కలిసి పోయి వారి..వైసిపి కార్యకర్తల్లాగానే వ్యవహరిస్తూ..కోవర్టు ఆపరేషన్లు చేస్తున్నారు. వీటిని వైసిపి శ్రేణులు పసి గట్టాయి. పాదయాత్ర ప్రారంభం అయిన రోజు దాదాపు 50 మంది టిడిపి నియమిత వాలంటీర్లు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని వైసిపి శ్రేణులు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాయి. కొందరిని నేరుగా పట్టుకొని విచారించారు. ఇప్పుడు, పాదయాత్రలో ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. టిడిపి నేరుగా ఎదుర్కొన లేక..ఇటువంటి చీప్ ట్రిక్స్ కు దిగటమే సహజమైన విషయంగానే భావించాల్సి ఉంటుందనే భావన కూడా కొంత మంది నేతల నుండి వ్యక్తం అవుతుంది.
ఇటువంటి రాజకీయాలను వైసిపి చేయదని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే , ఇప్పటికే జగన్ ఎఫెక్ట్ ఏపిలో ఏమేర ఉందో తెలుసుకోవటానికి కేంద్ర నిఘా సంస్థ ప్రతినిధులు జగన్ ను ఫాలో అవుతున్నారు. ఏపిలో అధికారంలోకి రావటానికి కీలకం కావటంతో పాటుగా..ప్రస్తుతం సున్నితమైన అంశాలతో రాజకీయంగా కీలకంగా మారిన ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్ర ప్రభావం నేరుగా అధ్యయనం చేయటానికి కేంద్ర నిఘా సంస్థల ప్రతినిధులు పాదయాత్రను ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జగన్ ప్రతీ అడుగునూ రాష్ట్ర నిఘా అధికారులు లోతుగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర తో పాటుగా ప్రతీ సభలోనూ రాష్ట్ర నిఘా సిబ్బంది తమపని తాము చేసుకుపోతున్నారు. జగన్ పాదయాత్ర తో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న టిడిపి నాయకత్వం…ప్రభుత్వ నిఘా వ్యవస్థ ద్వారానే కాకుండా.. వైసిపి శ్రేణుల్లో..టిడిపి నియమించిన ప్రత్యేక వాలంటీర్లను చొప్పించి వారి ద్వారా సమాచారం సేకరించే పని కొనసాగుతోంది. దీని ద్వారా..టిడిపి పైకి ఎన్నిచెప్పినా..జగన్ పాదయాత్ర అంటే ఎంతగా టెన్షన్ పడుతుందో అర్దం అవుతోంది. ఈ రకమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వైసిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ అభిమాన సంఘాల్లోనూ..జగన్ అనుకూల వర్గాల్లోనూ టిడిపి అనుకూల వ్యక్తులు ఇదే రకంగా జగన్ అభిమానుల పేరు తో చొరబడి..అక్కడి విషయాలు తెలుసుకోవటంతో పాటుగా..డామేజింగ్ కంట్రోల్ కోసం టిడిపి నాయకత్వం నుండి వచ్చిన సూచనల మేరకు నడుచుకుంటున్నారు.