ప‌చ్చ పార్టీ కోస‌మే ప‌చ్చ మీడియా చ‌రిత్ర చెబుతున్న సాక్ష్యాలు – Yellow Media Mafia is for TDP.

0
640
ఒక NTR, ఒక YSR, ఒక దాస‌రి, ఒక చిరంజీవి, ఒక జ‌గ‌న్‌, నేడు ప‌వ‌న్ఇలా, అంద‌రి మీదా ఆ మీడియాకు ఆగ్రహమే. ఒక్క TDP అంటేనే ఆ మీడియాకు అనుగ్ర‌హం. 1995 నుండి నేటి వ‌ర‌కు TDP సంర‌క్ష‌ణ ల‌క్ష్యంగా ఆ ప‌చ్చ మీడియా జిమ్మిక్కులు చేస్తూనే ఉంది. NTR  వెన్నుపోటు సంద‌ర్భంలో కొంత మంది MLA లు NTR ను కాద‌ని  చంద్ర‌బాబు వైపు రావ‌టానికి సంకోచించారు. ఆ స‌మ‌యంలో మీడియా పెద్ద‌లుగా చెలామ‌ణి అవుతున్న కొంద‌రు NTR వెనుక ఎవ‌రూ లేర‌ని. అంతా చంద్ర‌బాబు వైపు వ‌చ్చేసారంటూ మ‌ద్ద‌తు సంఖ్య‌ను పెంచి చూపించి మైండ్ గేమ్ ఆడారు. NTR ప‌ద‌వీచ్యుతుడై ఆవేద‌న చెందుతున్నా ఆయ‌న ఆత్మ‌ఘోష నాటి మీడియా పెద్ద‌ల‌కు వినిపించ‌లేదు.
ఇక‌, సినిమా రంగంలో ఒక వ‌ర్గ ఆధిప‌త్యాన్ని ఎదుర్కొంటూ కొర‌కరాని కొయ్య‌గా మారిన దాస‌రి నారాయణ‌రావును, అదే ర‌కంగా హింసించారు. దీంతో ఆయ‌న వారికి ధీటుగా ఉద‌యం ప‌త్రిక‌ను స్థాపించి నాటి పోటీ ప‌త్రిక‌ల‌కు ధీటుగా నిలిచారు. ఇక‌, YS రాజ‌శేఖ‌ర‌రెడ్డి AP రాజ‌కీయాల్లో అప్ర‌తిహతంగా సాగిపోతుంటే త‌మ చంద్ర‌బాబుకు ద‌క్కాల్సిన సీటు YS కు క‌ట్ట‌బెట్టార‌నే అక్క‌సు ఆ స‌మ‌యంలో ఆ రెండు ప‌త్రిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఎలాగైనా YS ను ప్ర‌జ‌ల‌లో డామేజ్ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా టార్గెట్ చేసారు. కానీ, YS బెద‌ర‌లేదు. ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు. పోటీగా YS త‌న‌యుడు జ‌గ‌న్ సాక్షి ప‌త్రిక తీసుకొచ్చారు. ఇక, 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జారాజ్యం ప్ర‌జ‌ల ముందుకొచ్చింది. ఆ పార్టీని తొలుత TDP తో పొత్తు పెట్టుకోమ‌ని ఏకంగా ఓ పత్రికాధిప‌తి ప్ర‌తిపాదించారు. అందుకు చిరంజీవి NO అన‌టం ఇక, టార్గెట్ మొద‌లైంది. చిరంజీవి కుటుంబ వ్య‌వ‌హారాలు మొద‌లుకొని టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ డామేజ్ చేసారు. ఇక‌, YS మ‌రణం త‌రువాత TDPకి, త‌మ‌కు ఎదురు లేద‌నుకున్నారు.
కానీ, జ‌గ‌న్ అనే మొండిఘ‌టం వారికి మింగుడుప‌డ‌ని విధంగా ఎదిగారు. జ‌గ‌న్ ను దెబ్బతీసేందుకు ఆర్దిక నేర‌గాడు అని ల‌క్ష కోట్లు దోచేసాడు అని. ఇక‌, జైళ్లోనే శేష జీవితం అంటూ 2014 ఎన్నిక‌ల ముందు ఎంత విష ప్ర‌చారం చేయాలో అంతా చేసారు. కానీ, జ‌గ‌న్ వీటిని లెక్క చేయ‌లేదు. జ‌గ‌న్ పై ఇప్పటికీ అదే ర‌కంగా ఎల్లో మీడియా టార్గెట్ చేస్తూనే ఉంది. అయితే, నాడు YS, నేడు జ‌గ‌న్ ఈ ఎల్లోమీడియా కుతంత్రాల ను ఎదుర్కొని ప్ర‌జ‌ల గుండెల్లో చిరస్థానం సాధించారు. ఇక‌, TDP కి మ‌ద్ద‌తుదారుడిగా ఉన్నంత కాలం ప‌వ‌న్ ను ఒక వీరుడిగా ప్ర‌జ‌ల ముందు నిలబెట్టారు. ప‌వ‌న్ ఏ ప‌ని చేసినా ఆహో ఓహో అంటూ ఊద‌ర‌కొట్టారు. ఎప్పుడైతే ప‌వ‌న్‌- TDP ని కాద‌ని, వారి అవినీతీని కార్న‌ర్ చేయ‌టం మొద‌లు పెట్టాడో ఇప్పుడు ప‌వ‌న్ వారి ల‌క్ష్యంగా మారిపోయాడు. నీతి ప‌లుకులు మెరుగైన స‌మాజాలు అంటూ స్లోగ‌న్లు ఇచ్చే ఈ మీడియా బాల‌కృష్ణ లాంటి వారు అస‌భ్య ప‌ద‌జాలం వాడితే క‌నీసం వాటిని త‌ప్పుబ‌ట్ట‌రు.
ఇక‌, ఇప్పుడు ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా ప్ర‌తీ రోజు క‌ధ‌నాలు. ఇదే మోదీ తో TDP సన్నిహ‌తంగా ఉన్నంత కాలం మోదీ ఆరాధ్యుడు. ఇప్పుడు, నిరంకుశ‌వాది. ఇలా, TDP కోసమే ప‌ని చేసే ఈ మీడియా ప‌చ్చ మీడియా గా మారిపోయింది. కానీ, ప‌రిస్థితిలో మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న మారుతోంది. నిజం తెలుసుకుంటున్నారు. TDP చేసేదే క‌రెక్ట్చంద్ర‌బాబు చెప్పేదే వేదం అనే విధంగా మారిపోయిన AP లోని ఈ పచ్చ మీడియా పిడి వాదాన్ని ప్ర‌జ‌లు తిప్ప‌కొట్టే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయి.  ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. జ‌గ‌న్‌, ప‌వ‌న్ ల‌క్ష్యంగా ఇంకా ఎన్ని కుట్ర‌లు చేస్తారో, జ‌గ‌న్ సైతం రాటు తేలాడు. ఇటువంటివి ఎదుర్కోవ‌టం ప్ర‌జ‌ల్లో ఉండే జ‌గ‌న్కు పెద్ద క‌ష్టం కాదు. మ‌రి, ప‌వ‌న్ ఏం చేస్తాడ‌నేది వేచి చూడాలి. ఖ‌చ్చితంగా ప‌వ‌న్ సైతం జ‌గ‌న్ బాట ఎంచుకోవాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here