ప్రజానాడిని పసి గట్టిన జననేత..
వచ్చే ఎన్నికల పై జగన్ అంచనా ఇదే..!!
జగన్ మదిలోని మాట వింటే..ఉప్పొంగాల్సిందే..
జగన్ నోట ఊహించని మాట..కేడర్‌లో నయా జోష్..!!
జగన్ నోట ఊహించని మాట. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూల్ గా ఉంటూ చెరగని చిరునవ్వుతో కనిపించే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసిపి లో కొత్త జోష్ ను నింపుతున్నాయి. జగన్ పాదయాత్ర 200 రోజులు పూర్తయింది. తొమ్మిది జిల్లాల్లో పూర్తయి పాదయాత్ర ప్రస్తుతం తూ ర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ రెండు వందల రోజుల పాదయాత్ర లో అనేక వర్గాల ప్రజలతో జగన్ మమేకం అయ్యారు.
తొలుత రాయలసీమకే జగన్ ఛరిష్మా పరిమితమని టిడిపి నేతలు అంచనా వేసారు. జగన్ పాదయాత్ర కొద్ది రోజులకే పరిమితమనే వ్యాఖ్యలు చేసారు. కానీ, జగన్ టిడిపి నేతల ఆశలను అడియాసలు చేసారు. పట్టుదల..కార్యదీక్ష ఉన్న జగన్ తన పాదయాత్రను అప్రతిహాతంగా కొనసాగిస్తున్నారు. రాయలసీమ మొదలు అనేక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న సామాజిక వర్గాలతో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తూ వారికి మరింతగా దగ్గరయ్యారు. రాయలసీమ ను మించిన జనాదరణ కోస్తా జిల్లాలో లభించింది. కృష్ణా వారధి..గోదావరి బ్రిడ్జి జగన్ తో కలిసి అడుగు వేసిన జన హోరు తో ఊగి పోయాయి. జగన్ సృష్టించిన జన సునామీ తో ఉభయ గోదావరి జిల్లాలు ఊగి పోయాయి. టిడిపి కి మద్దతుగా నిలిచే వర్గాలు ఉండే ప్రాంతాలు జగన్ కు జై కొట్టాయి. అనేక మంది పార్టీలో చేరారు. ఆరోగ్య పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా..పైకి చిరునవ్వుతో ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రతీ జిల్లాలో పార్టీ పరిస్థితుల పై ఆరా తీస్తున్నారు. జగన్ సభకు జనం పోటెత్తుతున్నారు. ప్రతీ సభలో జగన్ ను చూడగానే సీయం సీయం అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. పాదయాత్ర తూర్పు గోదావరి వచ్చే వరకు జగన్ వచ్చే ఎన్నికల్లో ఫలితాల అంచనా పై ఎక్కడా ఎవరితోనూ తన అభిప్రాయం షేర్ చేసుకోలేదు. కానీ, తూర్పు గోదావరి లో వచ్చిన స్పందన తరువాత జగన్ లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయి. ఇతర జిల్లాల్లోనూ ప్రజా నాడి పసిగట్టినా.. ఏ ఒక్కరితోనూ జగన్ తన అంచనాలు ఏంటో ఎక్కడా చెప్పలేదు. తాజాగా, తూర్పు గోదావరి లో తనకు కలవటానికి వచ్చిన ఉత్తాంధ్ర నేతలతో జగన్ మనసు విప్పారు. తాను పాదయాత్రలో భాగంగా ప్రజల నాడి ఏంటో గుర్తించానని..రేపటి కోసం ఎన్నో ఆశలతో ప్రజలు ఉన్న విషయాన్ని జగన్ స్పష్టం చేసారు. అదే సమయంలో..ఒక కీలక కామెంట్ చేసారు. ఇక, వైసిపి విజయాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఇక..ఎన్నికలకు సిద్దం కండి. కదన రంగంలోకి దూకటానికి సిద్దం కండి.
విజయం మనదే అంటూ ఆ నేతలకు స్పష్టం చేసారు. ఇది..తాను ఉత్సాహం కోసం చెబుతున్నది కాదని….ప్రజలు కోరుకుంటున్నదే చెబుతున్నానని తేల్చి చెప్పారు. ఎప్పుడూ ఇంతలా విజయంపై స్పందించని జగన్..పార్టీ నేతలతో చెప్పిన మాటలు ఇప్పడు వైసిపి లో హాట్ టాపిక్ గా మారాయి. జగన్ వ్యాఖ్యలతో కేడర్ లోఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పాదయాత్ర 200 వ రోజున ఇదే వైసిపి లో జోష్ ను నింపింది. జగన్ మాటలను..అంచనాలను నిజం చేస్తామని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు.