వైసిపి అధినేత జగన్…ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పై చేయి సాధించారా. జగన్ ఒత్తిడి చంద్రబాబు పై పని చేసిందా. కేంద్రం నుండి టిడిపి మంత్రుల ఉప సంహరణ నిర్ణయం వెనుక ప్రధానం కారణం ఏంటి. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ గతంలో చేసిన ప్రకట ననే మరోసారి చేసారు. కానీ, టిడిపి గతంలో అభినందించిన ప్రకటననే ఇప్పుడు అభిశంసించింది. ఒకవైపు ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటికే కేంద్రం పై అవిశ్వాసం కోసం ముహూర్తం కూడా ప్రకటించారు. దీంతో ఆగకుండా..పార్లమెంట్ సమావేశాల చివరి రోజున వైసిపి ఎంపీల రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. దీంతో..టిడిపి పై ఒత్తిడి పెరిగింది. ప్రజలు సైతం వైసిపి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని గుర్తించారు. ప్రత్యేక హోదా పై ఇప్పటి వరకు భిన్నంగా వ్యవహరించిన టిడిపి..ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. తీసుకున్నారు అనే దాని కంటే..తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. జగన్ ఇప్పటి వరకు ఏదైతే చెబుతూ వచ్చారో అదే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారు.
ప్రతిపక్షం తీసుకుంటున్న నిర్ణయాలతో…ప్రజల్లో ఇమేజ్ పెరుగుతోంది. పరోక్షంగా టిడిపి పై ఒత్తిడి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రులు ఉప సంహరించుకొనే నిర్ణయం తీసుకుంది. బిజెపితో తెగదెంపులకు నిజంగా చంద్రబాబు సిద్ద మై ఉంటే..ఏకంగా ఎన్డీఏ నుండే బయటకు వచ్చేసేవారు. కానీ, పరిస్థితి అది కాదు. వైసిపి ఒత్తిడి బాగా పని చేసింది. కేంద్రం తో కయ్యానికి టిడిపి కి ధైర్యం చాలట్లేదు. పదేపదే చంద్రబాబు కారణంగానే ఏపికి ప్రత్యేక హోదా రాలేదని జగన్ ఏదైతే చెబుతూ వచ్చారో..ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆర్దిక మంత్రి ఆరుణ్ జైట్లీ సైతం ఏపి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తరువాతనే ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించామని చెప్పారు. ఇప్పుడు అదే..టిడిపికి డామేజ్ చేసే వ్యాఖ్యలని టిడిపి అధినాయకత్వం గుర్తించింది. జగన్ చెప్పినట్లుగా టిడిపి ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా..ఖచ్చితంగా ఇది ప్రజల విక్టరీగానే భావించాల్సి ఉంటుంది. తనకు ఎదురులేదని భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు తలొగ్గేలా చేయటంలో జగన్ వ్యూహం సక్సెస్ అయిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.