జగన్ రాజకీయల్లో రాటు తేలుతున్నాడు. నలభై ఏళ్ల అనుభనానికే టెన్షన్ పుట్టిస్తున్నాడు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో జగన్ అనుసరించిన వ్యూహం టిడిపిని ఆత్మరక్షణలోకి పడేసింది. ఎన్నిక లేకుండానే రాజ్యసభ ఎన్నికను ఏకగ్రీవం చేసిం ది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఏపిలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి వైసిపి కి..రెండు టిడిపికి దక్కాలి. అయితే, వైసిపి నుండి 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న టిడిపి నేతలు వైసిపికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సీటు దక్కకుండా చేయాలని తొలి నుండి భావించారు. వైసిపికి ఇక రాజ్యసభ సీటు దక్కటం కష్టమే అని అందరూ భావించారు. సరిగ్గా ఇదే సమయంలో..జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైసిపి నుండి అన్ని రకాలుగా సమర్ధత ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని అభ్యర్ధిగా బరిలో నిలిపారు.
ప్రభాకర రెడ్డి సైతం జగన్ సూచనలతో జిల్లాల వారీగా అభ్యర్దులతో సమావేశం అయ్యారు. ఇక, ఒక ఉత్తరాంధ్ర మంత్రి ఏకంగా వైసిపి ఎమ్మె ల్యేలకు ఫోన్ చేసి ప్రలోభాలకు ప్రయత్నించిన ఆడియో తమ చేతుల్లో ఉందంటూ వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి లీక్ ఇచ్చారు. ఇక, బిజెపి నాలుగు ఓట్ల మద్దతు టిడిపికి కష్టంగా మారింది. వైసిపి ఖాళీ అవుతుంది..ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడిన టిడిపికి..వైసిపి సైతం అదే స్థాయిలో మైండ్ గేమ్‌తో సమాధానం చెప్పింది. వైసిపి నుం డి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల్లో అనేక మంది అసంతృప్తితో ఉన్నారని వారు వైసిపి నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం తెర మీదకు తీసుకొచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో వారు వేమిరెడ్డికి మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వైసిపి నేతలు జోరుగా ప్రచారం చేసారు. దీంతో, ఓటుకు నోటు వ్యవహారం కారణంగా ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న టిడిపి అధినాయకత్వం..ప్రస్తుతం వైసిపి వ్యూహాలకు బెండ్ కాక తప్పలేదు. అంతే..మూడు స్థానాలు తమవే అంటూ ప్రచారం చేసుకున్న టిడిపి అధినాయకత్వం ఒక్కసారిగా వెనక్కు తగ్గింది. తమకు దక్కాల్సిన రెండు స్థానాలకే అభ్యర్ధులను ఖరారు చేసి మిన్ని కుండిపోయింది. దీంతో..వైసిపి కి అసలు దక్కుతుందా లేదా అనే సందేహల నడుమ..రాజ్యసభలోకి వైసిపి ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి నేరుగా ప్రవేశిస్తున్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ముందు జగన్ ఎంత అనుకున్న టిడిపి నేతలకు..జగన్ రాజకీయాల్లో ఎంతగా రాటు తేలారో స్పష్టమైంది