జగన్. ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. నేడు అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి. ఏపికి ప్రతిపక్ష నేత హోదాలో..ఏపికి ప్రత్యేక హోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు. ఢిల్లీలో..మంగళగిరిలో..గుంటూ
కాంగ్రెస్ ను కాదని వైసిపిని ఏర్పాటు చేసారు. అనేక అభియోగాలతో కేసుల్లో ఇరికించారు. అయినా అధైర్య పడలేదు. దేశం మొత్తం నాడు సోనియా కు భయపడే రోజుల్లో సోనియాకు ధిక్కిరించి కొత్త పార్టీ పెట్టిన తొలి వ్యక్తి గా గుర్తింపు పొందారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో సైతం జగన్ అధికారంలోకి రాకుండా అనేక కుట్రలు చేసారు. విష ప్రచారం చేసారు. 1.95 శాతం ఓట్ల తేడాతో జగన్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అనుభవం లేని ప్రతిపక్ష నేత అంటూ టిడిపి నేతలు హేళన చేసారు. అయినా..జగన్ పరిణితి చెందిన వ్యక్తిగా ఎదగటానికి ఎంతో సమయం పట్టలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్ర బాబు ఏ రోజు జగన్ పేరు ఎత్తకుండా ఉండని రోజు లేదంటే అతి శయోక్తి లేదు. ఇక,ఏపికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరిని తప్పు బడుతూనే కేంద్రం తో ఢీ అన్నారు. దేశం మొత్తం సొంత పార్టీ నేతలు…ప్రతిపక్ష పార్టీ నేతలు మోదీని చూసి భయ పడుతున్న సమయంలో…కాంగ్రెస్ కూడా చేయని ధైర్యం జగన్ చేసారు.
ఏపికి ఇచ్చిన హామీ ఏపికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాసం పెడుతున్నట్లు ప్రకిటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక, చెప్పినట్లుగా లోక్‌సభలో ఇతర పక్షాల మద్దతు కూడగట్టుకొని ఏకంగా కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఒకవైపు టిడిపి పై ఒత్తిడి పెంచుతూ ..మరోవైపు కేంద్రం తో ప్రజల తరపున పోటారానికి సిద్దమయ్యారు. ఏపి ప్రజల సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా కోసం జగన్ తొలి నుండి లీడ్ తీసుకున్నారు. అదే బాధ్యతతో పోరాడుతున్నారు. తన పార్టీకి చెందిన ఎంపీలు..ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అధికార పార్టీ తమ వైపు కు తిప్పుకున్నా..ఎక్కడా నెరవ లేదు. నాడు సోనియా ను ..నేడు మోదీను ఎదిరించిన తెగువ ఉన్న వ్యక్తిగా వైసిపి అధినేత జగన్ ను ఏపి ప్రజలే కాదు..దేశ వ్యాప్తంగా గుర్తిస్తున్నారు.