జ‌గ‌న్ ఆన్ ఫైర్‌…ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో టిడిపి – YS Jagan Masater Plan …TDP in self defense

0
531

వైసిపి అధినేత జ‌గ‌న్ మ‌రోసారి టిడిపిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసారు. ఇప్ప‌టికే వ్యూహాత్మ‌క ఒత్తిడితో కేంద్రం నుండి టిడిపి ఎంపీల‌ను ఉప‌సంహ‌రించుకొనేలా చేసిన జ‌గ‌న్‌..ఇప్పుడు ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం కొత్త ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. తొలి నుండి ప్ర‌త్యేక హోదా కో సం పోరాడుతున్న వైసిపి..ఇప్పుడు ఏపిలో రాజ‌కీయంగాపై చేయి సాధించింది. టిడిపి కేంద్రం నుండి మంత్రుల‌ను ఉప‌సంహ‌రించు కున్నా..ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు రాలేదు. ఇదే స‌మ‌యంలో  జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. కేంద్రం పై ఈనెల 21న అవిశ్వాసం పెట్టేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌..ఇప్పుడు టిడిపి సిద్ద‌మ‌ని చెబితే..వెంట‌నే అవిశ్వాసం పెట్టేందుకు సిద్ద‌మ‌నే వి ష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. వైసిపి ప్ర‌తిపాదించే అవిశ్వాసానికి మద్ద‌తు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రికి సూచించారు. ఒక‌వేళ‌..టిడిపి యే అవిశ్వాసం ప్ర‌తిపాదిస్తే..అందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి తాను సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. దీని ద్వారా..తాను ఏపి ప్ర‌యెజ‌నాల కోస‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నానే సంకేతాలిస్తూ..టిడిపిని రాజ‌కీయంగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టేసారు.

టిడిపి ఇంకా ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు రాక‌పోవ టంతో..టిడిపి ఇప్పుడు జ‌గ‌న్ ఆఫ‌ర్  కు సానుకూలంగా స్పందించే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. కానీ, జ‌గ‌న్ చేసిన ఆఫ‌ర్ పై ప్ర‌జ ల్లో మాత్రం సానుకూల స్పంద‌న క‌నిపిస్తోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా త‌న‌కు సంబంధం లేద‌ని..ఎవ‌రై తే ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తూ సంత‌కం చేస్తారో వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇందుకోసం ఏపి ప్ర‌జ‌లు ఎవ‌రినీ న‌మ్మ‌వ‌ద్ద‌ని..మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో వైసిపి అభ్య‌ర్ధుల‌నే గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్ధించారు. ఇలా..కొద్ది రోజులుగా ఏపికి ప్ర‌త్యేక హోదా అంశంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు..కేంద్రం పైనా..టిడిపి పైనా ఒత్తిడి పెంచ‌టమే కాకుండా.. ప్ర‌జ‌ల్లో వైసిపి ఇమేజ్ పెరిగేలా ఉంటున్నాయి. అయితే, రానున్న నాలుగైదు రోజుల్లో రాజ‌కీయంగా స‌మీక‌ర‌ణాలు మ‌రింత వేడి పుట్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here