జ‌గ‌న్ పాద‌యాత్ర సంచ‌ల‌నాల‌కు కార‌ణం అవుతోంది – YS Jagan Padayatra Creates a History

0
461

జ‌గ‌న్ పాద‌యాత్ర సంచ‌ల‌నాల‌కు కార‌ణం అవుతోంది. ఇప్ప‌టికే పాద‌యాత్ర లో త‌న తండ్రి వైయ‌స్ మార్క్ ను జ‌గ‌న్ దాటేసారు. 2004 లో వైయ‌స్ఆర్ 1,470 కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేసారు. జ‌గ‌న్ 111వ రోజు పాద‌యాత్ర లో భాగంగా 1500 మార్కు చేరా రు. అప్పుడ‌క సైతం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే. టిడిపి ప్ర‌భుత్వం..చంద్ర‌బాబు వైఖ‌రిని నిర‌సిస్తూ..మండుటెండ‌ల్లో వైయ‌స్ త‌న పాద యాత్ర ప్రారంభించారు. ఆ పాద‌యాత్రే మొత్తంగా వైయ‌స్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను మ‌లుపు తిప్పింది. ఇప్పుడు, అదే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  పాల‌న లోపాల‌ను ఎండ‌గ‌డుతూ..ప్ర‌జ‌ల‌తో క‌లిసి విప‌క్ష నేత హోదా జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆరు జిల్లాల్లో యాత్ర పూర్తి చేసారు. 2012లో నాటి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు 2,340 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర చేసారు. అయితే, వైయ‌స్‌-జ‌గ‌న్‌-చంద్ర‌బాబు పాద‌యాత్ర‌కు చాలా తేడా ఉంది. వైయ‌స్ మండుటెండ‌ల్లో కాలికి బొబ్బ‌ల తొ త‌న యాత్ర కొన‌సాగించారు.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ సైతం అదే విధంగా యాత్ర‌లో ముందడుగు వేస్తున్నారు. ఇక‌, చంద్ర‌బాబు పాద‌యా త్ర చేసిన స‌మ‌యంలో ఎక్కువ‌గా సాయంత్రం స‌మ‌యంలో యాత్ర ప్రారంభించి..అర్దరాత్రి వ‌ర‌కు కొన‌సాగించేవారు. ఇక‌, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ సైతం పాద‌యాత్ర చేసారు. ఒక మ‌హిళ ఏపిలో చేసిన పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డుగా నిలిచిపోయింది. అంద‌రి కంటే ఎక్కువ‌గా 3,112 కిలో మీట‌ర్లు ష‌ర్మిళ యాత్ర సాగింది. ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్న యాత్ర ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లాతో పాటుగా మ‌రో ఆరు జిల్లాల్లో కొన‌సాగాల్సి ఉంది. అంటే, దాదాపు 3,500 కిలో మీట‌ర్ల మేర..వ‌చ్చే ఆగ‌స్టు వ‌ర‌కు యాత్ర కొన‌సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వైసిపి అధినేత జ‌గ‌న్ న‌డుం నొప్పి కార‌ణంగా బెల్టు తోనే త‌న యాత్ర‌లో ముందుకు క‌దులుతున్నారు. బ‌స్సులో బ‌స చేస్తూ..ప‌రిమిత ఆహారంతో…క‌సితో పాద‌యాత్ర చేస్తున్నారు. కాళ్ల‌కు బొబ్బ‌లెక్కినా ప్రాధ మిక చికిత్స చేసుకుంటూ వాటిని లెక్క చేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో..జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర కార‌ణంగా వైసిపి లో కొత్త జోష్ క‌నిపిస్తోంది. ఇక‌, పాద‌యాత్ర‌లో క‌వ‌ర్ చేయ‌ని నియోజ‌క‌వర్గాల్లో ఆగ‌స్టులో బ‌స్ యాత్ర చేయాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..జ‌గ‌న్ మ‌రింత క‌సిగా పాద‌యాత్ర సాగిస్తూ.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ..ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here