జ‌గ‌న్ చెప్పిన ఆ 40 సీట్లు ఎవ‌రివి..!!, YS Jagan Predicts 40 Seats TDP’s Future after 2019 Elections

0
469
ఆ లెక్క ప‌క్కా జ‌గ‌న్ చెప్పిన ఆ 40 సీట్లు ఎవ‌రివి..!!
ధైర్యంగా ఒంట‌రి పోరుకే వెళ్తాం..!!
పొర‌పాట్లు చేసాను పున‌రావృతం కానివ్వ‌ను..!!
నా లెక్క ప‌క్కా. ధైర్యంగా ఒంట‌రి పోరుకే వెళ్తాం..!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపికి 40 సీట్లు కంటే రావు. రాసి పెట్టుకోండి. వైసిపి అధినేత జ‌గ‌న్ స‌వాల్‌. ఏంటా ధైర్యం. జ‌గ‌న్ ఇంత గ‌ట్టిగా ఎలా చెప్ప‌గ‌లుగుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేసిన త‌ప్పేంటి. జ‌గ‌న్ ఒప్పుకున్న ఆ పొర‌పాట్లు ఏంటి. చంద్ర‌బాబు పై జ‌గ‌న్ ప్ర‌తీకారం ఉండ‌దా. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌కు చ‌ర్య‌లు ఉంటా య‌ని చెబుతూ వ‌చ్చారు. అయితే, తాను అ ధికారంలోకి వ‌స్తే అవినీతి పై చ‌ర్య‌లు ఉంటాయి కానీ, ప్ర‌తీకారం ఉండ‌ద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. ఇక, రాజ‌కీయంగానూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

2014 లో పొరపా టు చేసాను. ఈ సారి ఎన్నిక‌ల్లో మా వ్యూహం మాకుంది. ఎవ‌రితో పొత్తు ఉండ‌దు. వైసిపి అధినేత జ‌గ‌న్ తే ల్చి చెప్పిన విష‌యాలు ఇవి. ఇక ప్ర‌ధాని మోదీని అసెంబ్లీ వేదిక‌గానే ఏకి పారేసాన‌ని గుర్తు చేసారు. 2014లో అనేక ర‌కాలు గా క‌లిసి వ‌చ్చి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యార‌ని జ‌గ‌న్ గుర్తు చేసారు. ఇక‌ ప‌వ‌న్ ను జ‌గ‌న్ వ‌ద‌ల్లేదు. చంద్ర‌బాబు కు నాడు మ‌ద్ద‌తుగా నిలిచి నేడు వ్య‌తిరేకిస్తే స‌రిపోద‌ని ప‌వ‌న్ గురించి కుండ బ‌ద్ద‌లు కొట్టారు. జ‌గ‌న్‌- ప‌వ‌న్ పొత్తు పై ర‌క‌ర‌కాలుగా సాగుతున్న ప్ర‌చారానికి ముగింపు ప‌లికారు వైసి పి అధినేత జ‌గ‌న్‌. ఇక‌, ప్ర‌తీ మ‌నిషి పొర‌పాట్లు చేయ‌టం స‌హ‌జ‌మ‌ని వ్యాఖ్యానించటంతో అస‌లు జ‌గ‌న్ ఏం త‌ప్పు చేసార నే చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో కొంత మంది అభ్య‌ర్ధుల గెలుపు అవ‌కాశాల పై ఇచ్చిన నివేదిక‌ల‌ను జ‌గ‌న్ న‌మ్మ‌టం, త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారికి వారి గెలుపు అవకాశాల పై అతి విశ్వాసం తో టిక్కెట్లు కేటాయించ‌టం తో న‌ష్టం జ‌రిగింది. అదే స‌మ‌యంలో సామాజిక స‌మీక‌ర‌ణాల ప‌రంగానూ కొన్ని జిల్లాల్లో టిక్కెట్ల కేటాయింపులో బ్యాలెన్స్ త‌ప్పింది. ఇవ‌న్నీ జ‌గ‌న్ నేరుగా ప్ర‌స్తావించ‌క‌పోయినా, 2014 ఫ‌లితాల త‌రువాత జ‌రిగిన పోస్టుమార్టంలో ఈ పొర‌పాట్ల‌ను గుర్తించారు. ఇక‌, ఎప్పుడూ  ఏ మాట జార‌ని జ‌గ‌న్‌ తొలి సారిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి 40 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని తేల్చి చెప్పేసారు. పైగా ఇది రాసిపెట్టుకోండంటూ సూచించారు. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండే జ‌గ‌న్ ఇంత ధీమాగా చెబుతుండ‌టంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది.

టిడిపి ఏ విధంగా ఓడి పోతుంద‌నే విశ్లేష‌ణ జ‌గ‌న్ చేసారు. ఇప్పుడు ఎవ‌రి స‌హాయం అవ‌స‌రం లేదు ప్ర‌జ‌లు దేవుడిని న‌మ్ముకున్నామ‌ని తేల్చి చెబుతూనే ప‌వ‌న్ ఓట్ షేరింగ్ గురించి వివ‌రించారు. ప‌వ‌న్ ఓటు గ‌తంలో చంద్ర‌బాబుకు ప‌డ్డాయ‌ని, ఇప్పుడు ప‌వ‌న్‌ వైసిపి కి షేర్ అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. వైసిపి కి గ‌తంలో వ‌చ్చిన 45 శాతం తిరిగి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇక‌, టిడిపి 40 సీట్లకే ప‌రిమితం అవుతుంద‌ని చెప్ప‌టంతో ఇప్పుడు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్న ఆ 40 సీట్లు ఎక్క‌డ‌, ఆ అభ్య‌ర్ధులెవ‌రనే అంశం పై అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here