అక్కడ జగన్ స్కెచ్ అదుర్స్.
2014 ఎన్నికల ఫలితాలు రివర్స్.
అదే జరిగితే వైసిపికి అధికారం ఖాయం.
అక్కడ జగన్ లెక్కలు పక్కా.
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలి. అదే ఇప్పుడు వైసిపి అధినేత జగన్ లక్ష్యం. ఇప్పుడు అదే ఫార్ము లా తో ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ పక్కాస్కెచ్ అమలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపికి ఒక్క సీటు దక్కలేదు. దీంతో..ఈ సారి అక్కడే అధిక సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో జగన్ అక్కడ కొత్త సమీకరణాలకు తెరలేపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు విశేష స్పందన రావటంతో పాటుగా అక్కడ కీలక సామాజిక వర్గాలకు చెందిన ఇతర పార్టీల నేతలు వైసిపిలో చేరారు. ఇప్పుడు జగన్ సైతం అక్కడ సామాజిక సమీకరణాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. జిల్లాలో గతంలో జరిగిన గరిగపర్రు అంశంపై జగన్ ఏ వర్గం మనోభాలు దెబ్బతిన కుండా వ్యవహరించి..అందరి మన్ననలను అందుకున్నారు.
ఇప్పుడు సైతం ఏ వర్గం వారు పార్టీకి దూరం కాకుండా అందరికీ దగ్గరయ్యేలా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఉండే కాపు-క్షత్రిక సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. బిసిలక కోసం ఇప్పటికే ఆత్మీయ సదస్సులు నిర్వహించి తాను ఏం చేయబోయేదీ వివరించారు. ఇక, ఎస్సీ-ఎస్టీ ఓటర్లను ఆకట్టుకోవటం లో జగన్ సక్సెస్ అయినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, జిల్లాలో అధికంగా ఉండే కాపు సామాజిక వర్గం..తమకు గత ఎన్నికల్లో ఇచ్చిన రిజర్వేషన్ల అంశం అమలు కాకపోవటం..కేంద్రం కోర్టులోకి బంతి నెట్టేసి..ఎటువంటి ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు అక్కడ చేయకపోవటం పై అసంతృప్తి తో ఉన్నారు.
ఇక, క్షత్రి సామాజిక వర్గానికి పార్టీలోనూ..ప్రభుత్వంలోనూ ప్రత్యేకంగా గుర్తింపు రాలేదని ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే…ఒక ఎమ్మెల్సీ మినహా క్షత్రియ సామాజిక వర్గానికి క్యాబినెట్ లో అవకాశం కల్పించ లేదు. ఇక, టిటిడి బోర్డులోనూ క్షత్రియ వర్గానికి ఆ జిల్లా నుండి ఎవరికీ అవకాశం దక్కలేదు. దీంతో..వారు అధికార పార్టీ పై అసహనంతో ఉన్న ట్లుగా అర్దం అవుతోంది. వీటిని గమనించిన వైసిపి అధినేత..ప్రధానంగా ఆ రెండు వర్గాలను దగ్గర చేసకొనేందు కోసం సీట్ల కేటాయింపులోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో కాపులను అధిక సీట్లు కేటా యించిన వైసిపి..ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్‌లో గోదావరి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. జగన్ పశ్చిమ గోదావరి జిల్లా టూర్ ఎఫెక్ట్‌తో ఆక్వాపరిశ్రమ, కొల్లేరు సరస్సు సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో..గతం లో 2014 ఫలితాలు ఈసారి రివర్స్ అవుతాయని వైసిపి నేతలు అంచనా వేస్తున్నారు.